"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

26 ఏప్రిల్, 2016

విజయపథాలవైపు తీసుకెళ్ళేది నిరంతర కృషే - పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.టి.వి.నారాయణ

సామాన్య మానవుణ్ణి కూడా ఉన్నతమైన కీర్తి శిఖరాలవైపు తీసుకెళ్ళేది నిరంతర కృషీ, పట్టుదల మాత్రమేనని, కుల, మతాలు కాదనీ పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.టి.వి.నారాయణ అన్నారు. 
సత్కార సభలో మాట్లాడుతున్న డా.టి.వి.నారాయణగారు 
నిన్న సాయంత్రం ( 25 ఏప్రిల్ 2016) తెలుగుశాఖ, స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ( సెంట్రల్ యూనివర్సిటీ) హైదరాబాదు వారు నిర్వహించిన సత్కార సభలో ఆయన మాట్లాడారు.   భారత ప్రభుత్వం  2016  వసంవత్సరం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా.టి.వి.నారాయణ గారు సామాజిక సేవా రంగం (సీరియల్ నెంబరు 97)లో ఎంపికయ్యారు.  డా. టి.వి. నారాయణ గారు తెలంగాణాలోని బొల్లారంలో జన్మించారు. సుమారు 92 సంవత్సరాల డా.టి.వి.నారాయణగారు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచే వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నవారు. అందువల్ల సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినీ విద్యార్థులకు వారిని పరిచయం చేసి, విద్యార్థినీ విద్యార్థుల్లో స్ఫూర్తినీ, చైతన్యాన్ని కలిగించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 
సభలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు 


డా.టి.వి.నారాయణ గారి సత్కరించిన సందర్భంగా ఫోటోలో విశ్వవిద్యాలయ సిబ్బంది ఉపేంద్రగారు, పిఆర్ వో ఆశిష్ జాకబ్ గారు, డా.టి.వి.నారాయణగారి కుమారుడు డా.వంశీతిలక్ గారు, విశ్వవిద్యాలయం సిబ్బంది ప్రసన్నకుమార్ గారు. హిందీ శాఖ అధ్యక్షులు ఆచార్య సర్రాజుగారు తదితరులు చిత్రంలో ఉన్నారు.
ఆహ్వాన పత్రాలు 
సత్కార సభను తెలుగు శాఖాధ్యక్షలు ఆచార్య తుమ్మల రామకృష్ణగారు అధ్యక్షతన జరిగిన ఈ సభకు డా.దార్ల వెంకటేశ్వరరావు స్వాగతం పలికి అతిథులను పరిచయం చేశారు. సత్కార సభ లక్ష్యాన్ని వివరించారు. 
అతిథులను పరిచయం చేస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు
సభాధ్యక్షత వహించిన ఆచార్య తుమ్మల రామకృష్ణగారు, సత్కార గ్రహీత డా.టి.వి.నారాయణ గారు, స్వాగతాన్ని పలికి, లక్ష్యాన్ని వివరించిన డా.దార్ల వెంకటేశ్వరరావుగారు సభావేదికపై ఉన్నారు. 
సభలో ముఖ్య వక్తగా ప్రముఖ రచయిత్రి గోగుశ్యామల మాట్లాడారు. ఈ సభలో విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.  
సభలో డా.టి.వి.నారాయణ గారి గురించి మాట్లాడుతున్న ప్రముఖరచయిత్రి గోగుశ్యామల గారు
తాను డా.వి.నారాయణ గారి భార్య డిప్యూటీ స్పీకర్ గా చేసిన సదాలక్ష్మిగారి జీవిత చరిత్రను రాశాననీ, త్వరలోనే డా.వి.నారాయణగారి జీవిత చరిత్రను రాస్తాననీ ప్రకటించారు. తెలంగాణ సామాజిక, చారిత్రిక, రాజకీయ జీవితమంతా డా.టి.వి.నారాయణగారి జీవితంతో ముడిపడి ఉందనీ, అది భవిష్యత్తు తరాల వారికి స్ఫూర్తినిస్తుందనీ ఆమె వ్యాఖ్యానించారు. 
 డా.టి.వి.నారాయణ గారికి సత్కారాన్ని చేస్తున్న తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా.దార్ల వెంకటేశ్వరరావు, చిత్రంలో గోగుశ్యామల తదితరులున్నారు. 
తదనంతరం తెలుగుశాఖ సిబ్బంది అంతా డా.టి.వి.నారాయణ గార్ని సత్కరించారు. 
తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య జి.అరుణ కుమారి, ఆచార్య రేమెళ్ళ వెంకట రామకృష్ణశాస్త్రి, డా.పిల్లలమర్రి రాములు, డా.దార్లవెంటేశ్వరరావు, డా.బి.భుజంగరెడ్డి, డా సోమయాజులు, డా. మల్లెగోడ గంగాప్రసాద్, డా. మంగమ్మగార్లు డా. టి.వి.నారాయణ గార్ని అభినందించారు.  చిత్రంలో వీరితో పాటు గోగుశ్యామల గారు కూడా ఉన్నారు. 
ఈ సందర్భంగా దళిత విద్యార్థి సంఘం (డిఎస్ యు) సభ్యులు కూడా డా.టి.వి.నారాయణ గార్ని ప్రత్యేకించి సత్కరించారు. 
డా.టి.వి.నారాయణగార్ని సత్కరించిన సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు ఫోటో తీసుకున్న దృశ్యం
సాక్షి పత్రిక కథనం 
వార్త పత్రిక కథనం
ఈనాడు పత్రిక కథనం 
సభలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు 
సభలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు 

కామెంట్‌లు లేవు: