తెలుగు సాహిత్య, సామాజికోద్యమాల్లో గత కొన్నాళ్ళుగా బహుజన రచయితల వేదిక చైతన్యవంతమైన పాత్రను నిర్వహిస్తోంది. సమాజంలో కుల, వర్గ, జెండర్, మత పీడనలకు వ్యతిరేకంగా తన ఉద్యమాల్ని కొనసాగిస్తోంది. ఈ సంస్థ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే తన కార్య క్రమాల్ని రూపకల్పన చేస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా జరిగే రకరకాల పీడనలకు సంబంధించిన సమస్యల పట్ల తనదైన దృక్పథంతో ముందుకెళుతోంది. డాక్టర్ నూకతోటి రవికుమార్ రాష్ట్రకన్వీనర్ గా ఈ కార్యక్రమాలు విస్తృతస్థాయిలోనే జరుగుతున్నాయి. ఒకప్పుడు దళిత సాహిత్యం అని ముందుకొచ్చిన సాహిత్యం భవిష్యత్తులో బహుజన సాహిత్యంగా రావాల్సిన అవసరాన్ని, దాని తాత్త్వికతను బహుజన రచయితల వేదిక తీసుకొని వెళుతోంది. అన్నిపీడిత కులాల వారు తమ తమ అస్తిత్వాలను కాపాడుకుంటూనే ఒక తాటిపైకి రావాల్సిన అవసరంతోనే బహుజన సాహిత్యవాదం ముందుకొస్తోంది. ఈ దిశగా సాహిత్య రంగంలో కృషి చేసిన వారిని గుర్తిస్తూ బహుజన రచయితల వేదిక తన మొదటి రాష్ట్రస్థాయి సమావేశాల సందర్భంగా ఇద్దరికి పురస్కారాలను ప్రకటించారు. ఆ ప్రకటన కింద ఇస్తున్నాను.
ప్రకటన
బహుజన రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమే మహాసభల సందర్భంగా ప్రముఖ సాహిత్య విమర్శకులు, కవి, రచయిత జి. లక్ష్మీనరసయ్యకు ప్రతిష్టాత్మక కలేకూరి ప్రసాద్ స్మారక సాహిత్య పస్కోరాన్ని ప్రదానం చేయనున్నాము. ఈ క్రమంలోనే బహుజన సాహిత్యపరిశోధన రంగంలో విశేష కృషి చేసినందుకు గాను డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావుకు మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పరిశోధనా పురస్కారాన్ని ప్రదానం చేయనున్నాము.
ఏప్రిల్ 9,10 తేదీల్లో విజయవాడ, ఎం.బి. విజ్ఞాన కేంద్రంలో మహాసభలు నిర్వహించనున్న దృష్ట్యా, ప్రముఖ సాహితీవేత్తలు ఎండూరి సుధాకర్, సతీష్చందర్, బొనిగల రామరావు, చల్లపలి స్వరూపారాణి తదితరుల చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేయబడతాయి. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలు వేర్వేరు అంశాలపై నిర్వహించే సాహిత్య సదస్సుల్లో ప్రసంగిస్తారు.మరిన్ని వివరాలకు 9848187416లో సంప్రదించవచ్చు.
-డాక్టర్ నూకతోటి రవికుమార్, రాష్ట్ర కన్వీనర్.
సాక్షి, 28 మార్చి 2016
ఆంధ్రజ్యోతి, 28 మార్చి 2016
1 కామెంట్:
subhakankshalu guruvugaru
meeru ilage sahitya seva chestoo undalani korukuntunnanu
కామెంట్‌ను పోస్ట్ చేయండి