రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

దళిత చైతన్యం : సాహిత్య సాంస్కృతిక రంగాలు – భవిష్యత్ సవాళ్ళు న్యూస్

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయ దళిత ఆదివాసీ అధ్యయన-అనువాద కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతోన్న రెండు రోజుల సదస్సులో ఆదివారం దళిత సాహి త్యంపై సుదీర్ఘ చర్చ జరిగింది. కవి, విమర్శ కులు ఎండ్లూరి సుధాకర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో "దళిత సాహిత్యం సాంస్కృతిక రంగాలు - తాత్విక సంఘర్షణలు- మార్గాన్వేషణ' అనే అంశంపై డాక్టర్ చల్లపల్లి స్వరూపరాణి, విమర్శకులు డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు, కేశవ్ర్ కుమార్, కేఎస్ చలం, జయధీర్ తిరుమలరావు, విమలక్క తదితరులు ఉపన్యసించారు. దళితుల్లో చైతన్యం మరింతగా పెర గాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.
మాల మాదిగల ఉపకులాల వారిని ఇప్పటికీ అంటరాని వారుగా చూడడం దారుణము న్నారు. ఆయా వర్గాల్లో చైతన్యం కోసం విస్తృత మైన కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లిం మైనారిటీల్లో సైతం షియా, షేక్, సయ్యద్ లే కాకుండా విస్మరించబడిన ముస్లిం ఉపకులాలైన దూదేకుల లాంటి అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపాలని అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేశవ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొదలుకొని ఢిల్లీలో కిస్టయ్య జాతీయత వరకు దళిత గొంతుకలు మార్క్సిజం మరుగున పడిపోతున్నాయన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే దళిత వాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ క్రిష్ట అధ్యక్షతన "దళిత సాహిత్యం, సాంస్కృతిక రంగాలు - అనుభవాలు- గుణపాఠాలు' అనే అంశంపై మధ్యాహ్నం జరిగిన సదస్సులో ప్రముఖ కవి, రచయిత సతీష్ చందర్, దానక్క ఉదయభాను ఉపన్యసించారు. తరాల అణచివేతలను ధిక్కరించే ధైర్యాన్నిచ్చిన రోహిత్ నీరసించిపోతోన్న దళితవాదానికి ప్రాణం పోసారన్నారు. పసు నూరి రవీందర్, రవి, శరత్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, హైదరాబాద్, 21 మార్చి 2016 


ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ జిల్లా ఎడిషన్, 21 మార్చి 2016 పుట: 2


No comments: