మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ వారు ‘‘తెలుగు నాటక సాహిత్యం -సామాజిక ప్రయోజనం’’ అనే అంశంపై 2016 మార్చి 30, 31 వ తేదీల్లో జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకి మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో అధ్యాపకులు డా. విస్తాలి శంకరరావు సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి, చెన్నై: మద్రాసు విశ్వ విద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31 తేదీల్లో తెలుగు నాటక సాహిత్యం-సామాజిక ప్రయోజనం' అంశం పై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక మెరీనా తీరంలోని విశ్వవిద్యాలయం రజతోత్సవ ప్రాంగణంలో బుధవారం ఉదయం 9.45 గంటలకు శ్రీకన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల విద్యార్థినుల బృందం ఆహ్వాననృత్యంతో సదస్సు ప్రారంభమవుతుంది. సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా కళా ప్రదర్శనలు కూడా ఏర్పాటుచేస్తున్నారు. తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య మాడభూషి సంపత్కుమార్ అధ్యక్షతన 10 గంటలకు ప్రారంభోత్సవ సభ జరుగుతుంది. ఈ కార్య క్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది డా.అద్దే పల్లి పురుషోత్తం ముఖ్య అతిథిగా పాల్గొని, సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు. చెన్నైలోని తెలుగు భాషా సేవకులు గుడి మెట్ల చెన్నయ్య, సినీ గేయ రచయిత భువనచంద్ర, వేద విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి కందనూరు మదు ఆత్మీయ అతిథులుగా పాల్గొననుండగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ కీలకోపన్యాసం చేయనున్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ సహాయాచార్యులు డా. విస్తాలి శంకరరావు సంచాలకులుగా వ్యవహరిస్తారు.
ఏడు సమావేశాలుగా సదస్సు.
రెండ్రోజుల ఈ జాతీయ సదస్సులో భాగం గా తెలుగు నాటక సాహిత్య వైభవాన్ని చాటి చెప్పే వివిధ అంశాలపై 30 మందికి పైగా పత్ర సమర్పణ చేయనున్నారు. ఏడు సమా వేశాలుగా విభజించి సదస్సును నిర్వహిస్తారు. తొలి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే తొలి సమావేశానికి రాజధాని కళాశాల విశ్రాంతాచార్యులు ఎల్బీ శంకర రావు, 2 గంటలకు ప్రారంభమయ్యే రెండో సమావేశానికి డీజీ వైష్ణవ కళాశాల విశ్రాంతాచార్యులు డా. కాసల నాగభూషణం,315 గంటలకు ప్రారంభమయ్యే మూడో సమావేశానికి డా.నాగసూరి వేణుగోపాల్ , రెండో రోజు ఉదయం 10:30 గంటలకు రాజధాని కళాశాల తెలుగు అధ్యాపకులు డా. ఎన్.ఎలిజబెత్ జయకుమారి, 1130 గంటల కు ప్రారంభమయ్యే ఆరో సమావేశానికి రాణీ మేరి కళాశాల తెలుగుశాఖాధ్యక్షులు డా. జి.నళిని, మద్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఏడవ సమావేశానికి మద్రాసు కళాశాల తెలుగుశాఖాధ్యక్షులు డా. శ్రీపురం యజ్ఞశేఖర్ అధ్యక్షత వహిస్తారు. 4 గంటలకు మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు జీవీ ఎస్ఆర్ కృష్ణమూర్తి అధ్యక్షతన సదస్సు సమాప నోత్సవం జరుగుతుంది. కార్యక్రమంలో వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు జికె రెడ్డి ముఖ్య అతిధిగా, సినీ గేయ రచయిత వెన్నెలకంటి, ఆస్కా ట్రస్టు సభ్యుడు పి.శ్రీని వాసరెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. రాజధాని కళాశాల విశ్రాంతాచార్యులు దేవళ్ల చిన్నికృష్ణయ్య సమాపనోత్సవ సందేశాన్ని వినిపిస్తారు. సదస్సు సంచాలకులు డా. విస్తాలి శంకరరావు సదస్సు నివేదక సమర్చిస్తారు. గుమ్మిడి పూండికి చెందిన తెలుగు వికాస సమితి అధ్యక్షుడు పోజుల ముదుకు షుడు సదస్సుపై స్పందన తెలియజేస్తారు.
కళా ప్రదర్శనలు.
సదస్సులో భాగంగా బుధవారం సాయం త్రం 4.15 గంటలకు తిరుపతి వేంకటకవులు ‘పాండవోద్యోగం’ ద్వారకఘట్టం ప్రదర్శన, గురువారం ఉదయం 9.45 గంటలకు ‘తస్మాత్ జాగ్రత్త’ సాంఘిక నాటకం,మధ్యాహ్నం 3.15 గంటలకు ‘మహాభారతం’ గాంధారి ఏక పాత్ర, 3.30 గంటలకు ‘సత్య హరిశ్చంద్రీయం’ శ్మశానవాటిక (కాటి సీను) ఏక పాత్ర ప్రదర్శనలు ఉంటాయి. తెలుగు భాషాభిమానులు, సాహిత్య, నాటకప్రియులు విద్యార్దులందరూ సదస్సుకు హాజరుకావాలని సంచాలకులు కోరుతున్నారు. వివరాలకు 91452 03041 నెంబరులో సంప్రదించవచ్చు.
మొదటి రోజు జరిగే మొదటి సమావేశంలో డా.దార్ల వెంకటేశ్వరరావు ‘ఆచార్య కొలకలూరి ఇనాక్ ‘మునివాహనుడు’నాటక శిల్పం, సామాజికాంశాలు’’ పై పరిశోధన పత్రాన్ని సమర్పిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి