హైదరాబాద్ విశ్వవిద్యాలయం
మానవీయ విభాగం
దళిత-ఆదివాసీ అధ్యయన మరియు అనువాద కేంద్రం
దళిత చైతన్యం : సాహిత్య సాంస్కృతిక
రంగాలు – భవిష్యత్ సవాళ్ళు
సదస్సు – అవగాహనా పత్రం
19 - 20 మార్చి, 2016
సామాజికావసరాలకు
అనుగుణంగా ఏ చైతన్యం అయినా సమాజంలోంచే రూపొంతుంది. అస్తిత్వ భావనలకు కూడా అనాదిగా
అదే పునాది ఉంది. పలురకాల అస్తిత్వ చైతన్యాలు సంఘర్షిస్తూ తమని తాము కాపాడుకుంటూ
తమ హక్కులను, జీవితాలను మెరుగుపరుచుకుంటూ సామాజిక పురోగమనం దశగా పయనిస్తున్నాయి.
అప్పుడప్పుడు ఈ ఘర్షణల స్థాయి హెచ్చుగా ఉంటుంది. కొన్ని త్యాగాలు కొంత సంయమనం,
మరికొంత సామాజిక సమతౌల్యతలతో చరిత్ర నడిచిపోతున్నది.
ప్రతి దశలో, ఒక రాపిడి సంభవించినప్పుడు సామాజిక సాంస్కృతిక
రంగాలలో దాని ప్రతిఫలనాలు కనుపిస్తాయి. పౌరాణిక ఘర్షణ కాలంలో తాత ఆది జాంబవుడు
కావచ్చు. మాల చెన్నయ్య కావచ్చు. ఇప్పుడు డా. అంబేద్కర్ కావచ్చు. చైతన్య స్ఫోరకమైన
భావజాలంతో ముందుకు నడిచినప్పుడు సాహిత్య సాంస్కృతిక రంగాలు కూడా ప్రభావితం
అయ్యాయి.
వేమన, వీరబ్రహ్మం, రవిదాస్, సావిత్రీబాయి ఫూలె, జ్యోతిరావు
ఫూలే, నారాయణగురుల వంటి మహాత్ములు కాలక్రమంలో ఆవిర్భవించండం గమనించాలి. కంచికచర్ల
కోటేశు వంటివారు కూడా పోరాటాలకి సంకేతాలై నిలిచారు. ఇది చరిత్ర. ఈ చరిత్రలో
చారిత్రక దశల్లో సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ప్రతి స్పందనలు స్పష్టంగా
కనబడుతున్నాయి.
ఏది ఏమైనా ప్రజల మధ్య, సముదాయల మధ్య ఉత్పత్తి సంబంధాలు
మారినప్పుడల్లా పరిస్థితుల ప్రభావాల వల్ల మార్గాన్వేషణ కోసం తాత్విక సంఘర్షణ
జరిగింది. సహజ సౌహార్థ జీవనం కోనసాగించ వలసిన అవసరం రీత్యా మనం ముందుకు
కొనసాగిపోతూ వస్తున్నాం.
ఐతే వర్తమానంలో గతాన్ని గర్తు చేసుకుంటూ వర్తమానంలో దాగిన
భవిష్యత్తును సరి చేసికోవడం ఒక బాధ్యత. భావజాలాలు సంఘర్షించాలి. సహజ న్యాయం
వికసించాలన్న ధ్యేయంతో బతుకు నడిచిపోతుంటుంది. అది మన రాష్ట్రంలోనే కాదు అన్ని
రాష్ట్రాలలోను గ్రామీణ ప్రాంతాల్లో మనకి కనుపించే వాస్తవం. ఇవ్వాళ నగరాలు,
పట్టణాలకు మరియు పల్లెసీమలకు మధ్య విపరీతమైన ఎడం పెరిగింది. ఒకే అస్తిత్వంలో ఉన్న
సమూహాల మధ్య కూడా ఈ అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. దళిత సమాజాల మధ్యగల చైతన్యంలో
సైతం కొన్ని తేడాలు ఉన్నాయి. చదువుకున్న వర్గం, నిరక్షరాస్య వర్గం, ధనిక పేద
వర్గాలు, సాంస్కృతిక తేడాలు, నోటి-రాత సాహిత్యాలు, జీవన విధానంలో తారతమ్యాల
వాస్తవికతల వంటి అంశాలను గమనించడం విజ్ఞత.
ఈ నేపథ్యంలో దళిత చైతన్య పరిణామక్రమాన్ని అంచనా వేస్తూ,
వర్తమాన కాలంలో ఎదురవుతున్న ప్రశ్నలు, సంఘర్షణలు, సవాళ్ళను ఎలా చూడాలి అని
ఆలోచించవలసి ఉంది.
అందుకోసం సాహిత్యా సాంస్కృతిక రంగాలలోని మార్పుల్ని
శోధించవలసిన అవసరం ఉంది. ఆయా సాహిత్యాలు సాంస్కృతికరంగాలు రూపొందిన పునాదులను,
ప్రభావాలను గమనంలోకి తీసుకుని ఆలోచించడం అనివార్యం. అందుకే ఆ దిశగా రెండు రోజుల
పాటు జరిగే సదస్సుని ఒక మేధోమథనంగా, చర్చాగోష్ఠిగా ఏర్పాటు చేయడం జరుగుతోంది.
ఈ చర్చాగోష్ఠి ప్రధానంగా నాలుగు పరిశోధనాంశాలను దృష్టిలో
ఉంచుకుని జరుగుతుంది.
1.
దళిత చైతన్యం సాహిత్య సాంస్కృతిక
రంగాలు – ‘వైరుధ్యాలు –
ఐకమత్యం’
2.
దళిత చైతన్యం సాహిత్య సాంస్కృతిక
రంగాలు – ‘పరిస్థితులు –
ప్రభావాలు’
3.
దళిత చైతన్యం సాహిత్య సాంస్కృతిక
రంగాలు – ‘తాత్విక సంఘర్షణ –
మార్గాన్వేషణ’
4.
దళిత చైతన్యం సాహిత్య సాంస్కృతిక
రంగాలు – ‘అనుభవాలు –
గుణపాఠాలు’
ఆచార్య ఆర్. ఎస్. సర్రాజు, అధ్యక్షులు
దళిత-ఆదివాసీ అధ్యయన మరియు అనువాద కేంద్రం
హైదరాబాద్ విశ్వవిద్యాలయం
హైదరాబాద్ విశ్వవిద్యాలయం
మానవీయ విభాగం
దళిత-ఆదివాసీ అధ్యయన మరియు అనువాద కేంద్రం
దళిత చైతన్యం – సాహిత్య-సాంస్కృతిక రంగాలు –
భవిష్యత్ సవాళ్ళు
19 -20 మార్చి, 2016
మొదటి రోజు – 19-03-2016
ప్రారంభ సభ
ఉదయం. 10.00 గం.ల నుండి 11.30 గం.ల వరకు
అధ్యక్షత : ప్రొ. వి. కృష్ణ
పరీక్ష నియంత్రకులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
విషయ పరిచయం : ప్రొ. ఆర్. ఎస్. సర్రాజు
శాఖాధిపతి, దళిత-ఆదివాసీ అధ్యయన మరియు అనువాద
కేంద్రం
ముఖ్య అతిథి : ప్రొ. యం. పెరియసామి,
కులపతి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
విశిష్ట అతిథి : అల్లం నారాయణ
అధ్యక్షులు, తెలంగాణ ప్రెస్ అకాడమి
ప్రధాన వక్త : డా. కె. శ్రీనివాస్
సంపాదకులు,
ఆంధ్రజ్యోతి
సందేశం : ప్రొ. జయధీర్ తిరుమల రావు,
విజిటింగ్ ప్రొఫెసర్, దళిత-ఆదివాసీ అధ్యయన
మరియు అనువాద కేంద్రం
మొదటి సమావేశం
ఉదయం. 11.45 గం.ల నుండి 1.15 గం.ల వరకు
దళిత సాహిత్య
సాంస్కృతిక రంగాలు : వైరుధ్యాలు – ఐకమత్యం
అధ్యక్షలు : 1. ప్రొ. జయధీర్ తిరుమల రావు
వక్తలు : 2. డా. భంగ్యా భుక్యా, చరిత్ర ఆచార్యులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
3. గోగు
శ్యామల, ప్రముఖ రచయిత్రి
భోజన విరామం – 1.15 గం.ల నుండి 2.00 గం.ల వరకు
రెండవ సమావేశం
మద్యాహ్నం 2.00 గం.ల నుండి 4.00 గం.ల వరకు
దళిత సాహిత్యం సాంస్కృతిక రంగాలు : పరిస్థితులు – ప్రభావాలు
అధ్యక్షలు : 1.మల్లేపల్లి లక్ష్మయ్య, వ్యవస్థాపక అధ్యక్షులు, దళిత అధ్యయన కేంద్రం, హైదరాబాద్
వక్తలు : 2.
సతీష్ చందర్, ప్రముఖ కవి,
సంపాదకులు
3.
జి. లక్మీనర్సయ్య, రచయిత, ప్రముఖ
విమర్శకులు
కవి సమ్మేళనం
సాయంత్రం 4.15 గం.ల నుండి
అధ్యక్షులు : ప్రొ. శిఖామణి, ఆచార్యులు, పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయం
విశిష్ట అతిథి : గోరటి వెంకన్న, ప్రముఖ ప్రజాకవి
సమన్వయ కర్త : డా. జి.వి.
రత్నాకర్, సహాయ ఆచార్యులు,
మౌ. ఆ. జా. ఉర్దు విశ్వవిద్యాలయం
కవులు : 1. జయరాజు, ప్రజాకవి
2. డా. కోయి కోటేశ్వర
రావు
3. ప్రసాద మూర్తి
4. తెలిదేవర
భానుమూర్తి
రెండవ రోజు : 20-03-2016
మూడవ సమావేశం
ఉదయం – 10.00 గం., నుండి 11.30 గం.ల. వరకు
దళిత సాహిత్యం సాంస్కృతిక రంగాలు : తాత్విక సంఘర్షణ –
మార్గాన్వేషణ
అధ్యక్షులు : జూపాక సుభద్ర, ప్రముఖ రచయిత్రి
వక్తలు : 1. డా. దార్ల వెంకటేశ్వర రావు, ప్రముఖ దళిత విమర్శకులు
2.
డా. చల్లపల్లి స్వరూపా రాణి, ప్రముఖ రచయిత్రి
నాలుగవ సమావేశం
మధ్యహ్నం 11.45 గం.ల నుండి 1.15 గం.ల వరకు
దళిత సాహిత్యం సాంస్కృతిక రంగాలు : అనుభవాలు – గుణపాఠాలు
అధ్యక్షులు : ప్రొ. వి. కృష్ణ
వక్తలు : 1. ప్రొ. కేశవ్ కుమార్, ఆచార్యులు, ఢిల్లీ విశ్వవిద్యాలయం
2. ప్రొ. ఎండ్లూరి సుధాకర్, ఆచార్యులు, పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయం
3. దానక్క ఉదయభాను, పరిశోధకులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
భోజన విరామం 1.30 గం.ల నుండి 2.30 గం.ల వరకు
ముగింపు సభ
సమయం. సాం. 2.30
గం.ల నుండి 4.00 గం.ల వరకు
విశిష్ట అతిథి : గద్దర్, ప్రముఖ ప్రజాకవి
ముఖ్య అతిథి : ప్రొ. కె. ఎస్. చలం, ఆర్థికశాస్త్ర ఆచార్యులు, ప్రముఖ విమర్శకులు
అధ్యక్షులు : ప్రొ. ఆర్. ఎస్. సర్రాజు
సందేశం : ప్రొ. జయధీర్ తిరుమల రావు
ప్రొ. వి. కృష్ణ
కవి సమ్మేళనం
సా. 4.15 గం.ల నుండి
అధ్యక్షులు : ప్రొ. గుండె డప్పు కనకయ్య, ప్రిన్సిపాల్, తెలంగాణ విశ్వవిద్యాలయం
విశిష్ట అతిథి : విమలక్క, ప్రజా గాయకురాలు
సమన్వయ కర్త : డా. పసునూరి రవిందర్, కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత
కవులు : 1.
బెల్లి యాదయ్య
2. డా. రవి
పొనుగోటి
3. శరత్
4. దాసోజు లలిత
5. గాజుల శ్రీధర్
6. ఈశ్వర్ గజివెల్లి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి