రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రరవే మూడవ మహాసభలు ( ఫిబ్రవరి 13, 14 తేదీల్లో)
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మూడవ మహాసభల్లో భాగంగా, ‘సహన, అసహన భావనలు- చారిత్రక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలు- ప్రభావాలు’ అంశంపై సదస్సును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో ఫిబ్రవరి 13, 14 తేదీల్లో నిర్వహించనుంది. మామిడిపూడి వెంకట రంగయ్య హాల్, ఆంధ్ర మహిళాసభ క్యాంపస్, హైదరాబాద్‌నందు జరిగే ఈ సదస్సులో భిన్న అంశాలపై ఉపన్యాసాలు, కవి సమ్మేళనం ఉంటాయి.
ప్రారంభ సభలో కథాకళి కళాకారిణి మాయా కృష్ణారావు ప్రదర్శన, ప్రరవే వ్యాస, కథా సంకలనాల ఆవిష్కరణ ఉంటాయి. జి.హరగోపాల్, వకుళాభరణం రామకృష్ణ, రమా మెల్కోటే, కె.రామచంద్రమూర్తి, నందిని సిధారెడ్డి, సంధ్య, కృష్ణారావు, మోహన్, తోట జ్యోతిరాణి, ఎన్.శంకర్, గణేషన్, డానీ, కె.సునీతారాణి, దార్ల వెంకటేశ్వరరావు, పి.విక్టర్ విజయ్‌కుమార్, కె.ఎన్.మల్లీశ్వరి పాల్గొంటారు.

No comments: