రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

త్రీ చీర్స్‌...! -ఆచార్య బేతవోలు రామబ్రహ్మం,
విశ్వవిద్యాయాల్లో అధ్యాపకుకి కూత ఒక్కటే ఉంటే చాలదు. రాత కూడా ఉండాలి. ఈ రెండింటికీ బలం చేకూర్చే మేత అంతకన్నా తప్పనిసరి. మేత అనే పదానికి రంగాన్ని బట్టి రంగు మారుతుంది. వేరే వేరే అర్థాలూ స్ఫురిస్తాయి. కానీ బోధన రంగంలో మాత్రం ఒక్కటే అర్థం- నిరంతర అధ్యయనం అని. ఇది బోధకు కూతకీ, రాతకీ బవర్థకం. ధైర్యవర్థకం కూడా ఇదే!
మా దార్ల నిరంతర అధ్యయశీలి. అనారత అధ్యాపన తత్పరుడు. కొత్త కొత్త కోణాను దర్శించే ప్రతిభ ఆ జన్మ సిద్ధం. డిగ్రీ చదువు నాటకే ద్వా.నా.శాస్త్రి వంటి గురువు పాదు తీసిన కుదుళ్ళు ఉండనే ఉన్నాయి. అందుకని మూడు పువ్వు ఆరు కాయుగా సాగుతోంది దార్ల వారి సాహితీ వ్యవసాయం.
ఇది‘పునర్మూల్యాంకనం’ ఇందులో ప్రతి వ్యాసంలోనూ చాలా స్ఫష్టంగా కనిపించే గుణాలు మూడు. అధ్యయనం-దర్శనం-ధైర్యం. విపులీకరిస్తే ఈ ముందుమాట పుస్తకమంత అవుతుంది. అంత అవసరమూలేదు. పాఠకు గుణ గ్రహణ పారీణు. అందుకని ఉభయతారకంగా త్రీచీర్ష్‌...! సెలవు
మీ
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం,
అధ్యక్షుడు, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాయం
14.04.2010)

No comments: