రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం గ్రంథావిష్కరణ సభ కు ఆహ్వానం

ప్రముఖరచయిత్రి డా. పుట్ల హేమలత గారి పరిశోధన గ్రంథం ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ ఆవిష్కరణ సభ అక్టోబరు, 15, 2015 సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు తెలంగాణ సారస్వత పరిషత్, తిలక్ రోడ్, బొగ్గుల కుంట, హైదరాబాదులో జరుగుతుంది.. గ్రంథాన్ని ఆచార్య సి.నారాయణరెడ్డిగారు ఆవిష్కరిస్తారు. సభాధ్యక్షులుగా ఆచార్య ఎన్. గొపీ గారు వ్యవహరిస్తారు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు స్వాగతం పలికే ఈ సభలో ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు, నల్లమోతు శ్రీధర్ వక్తలుగా పాల్గొంటారు. ఈ సభకు సహృదయులైన సాహితీవేత్తలందరినీ ఆహ్వానిస్తున్నాను. 


No comments: