"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

31 August, 2015

డా. పసునూరి రవీందర్ సన్మానం ( 30 ఆగస్టు 2015)

యువ కథారచయిత, కవి, పరిశోధకుడు డా. పసునూరి రవీందర్ రాసిన ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ కథల సంపుటికి కేంద్రసాహిత్య అకాడమీ యువపురస్కారం ప్రకటించిన సందర్భంగా హైదరాబాదు లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 30 ఆగస్టు 2015 సాయంత్రం 5 గంటలకు ఘనంగా సన్మానించారు. సుమారు 56 సంఘాల వారు ఈ సన్మానాన్ని నిర్వహించడం చరిత్రలో గుర్తించదగిన విషయం. సభలో ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, గోరేటి వెంకన్న, అన్వర్, డా. యూకూబ్, డా. పిల్లలమర్రి రాములు, దార్ల వెంకటేశ్వరరావు. జిలుకర శ్రీనివాస్, విమల, శరత్, స్కైబాబా మొదలైన హేమాహేమీల వంటి రచయితలు, కవులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. సభ అద్భుతంగా జరిగింది. 





1 comment:

Unknown said...

మీ ప్రేమకు స‌దా విధేయుణ్ణి సార్‌. ధ‌న్య‌వాదాలు. జైభీం. నాగ‌ప్పగారు మీరు వేసిన‌ దారులివి.