యువ కథారచయిత, కవి, పరిశోధకుడు డా. పసునూరి రవీందర్ రాసిన ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ కథల సంపుటికి కేంద్రసాహిత్య అకాడమీ యువపురస్కారం ప్రకటించిన సందర్భంగా హైదరాబాదు లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 30 ఆగస్టు 2015 సాయంత్రం 5 గంటలకు ఘనంగా సన్మానించారు. సుమారు 56 సంఘాల వారు ఈ సన్మానాన్ని నిర్వహించడం చరిత్రలో గుర్తించదగిన విషయం. సభలో ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, గోరేటి వెంకన్న, అన్వర్, డా. యూకూబ్, డా. పిల్లలమర్రి రాములు, దార్ల వెంకటేశ్వరరావు. జిలుకర శ్రీనివాస్, విమల, శరత్, స్కైబాబా మొదలైన హేమాహేమీల వంటి రచయితలు, కవులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. సభ అద్భుతంగా జరిగింది.
1 కామెంట్:
మీ ప్రేమకు సదా విధేయుణ్ణి సార్. ధన్యవాదాలు. జైభీం. నాగప్పగారు మీరు వేసిన దారులివి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి