హైదరాబాదు విశ్వవిద్యాలయంలో జూలై, 29, 2015 వ తేదీన బహుజన స్టూడెంట్స్ ఫ్రంట్ తరపున ‘గుర్రం జాషువ 44 వ వర్థంతి సభ’’ ను డా.బి.ఆర్. అంబేద్కర్ లెక్షర్ హాల్ లో నిర్వహించారు. ఈ సభను ఒక సదస్సులా నిర్వహించారు. ‘‘తెలుగు సాహిత్యంపై కులప్రభావం-బహుజనదృక్పథం’’ అనే అంశంపై వక్తలు మాట్లాడేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సందర్భంగానే ఇటీవల సాహిత్య అకాడమీ యువపురస్కారాన్ని ప్రకటించిన డా. పసునూరి రవీందర్ ని విద్యార్థి సంఘం తరపున అభినందన కార్యక్రమాన్ని కూడా చేశారు. సభకు నన్ను (డా.దార్ల వెంకటేశ్వరరావు) అధ్యక్షులుగా వ్యవహరించమని కోరారు. సభలో ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా. పి.రాములు, డా. జిలుకర శ్రీనివాస్, శ్రీ ధనంజయ్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా డా. పసునూరి రవీందర్ ని అభినందించి సత్కరించారు.
సభాధ్యక్షత వహించి గుర్రం జాషువ గురించి మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావు. సభావేదికపై ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా. పిల్లలమర్రి రాములు, డా. పసునూరి రవీందర్, వి.ధనుంజయ్, డా. జిలుకర శ్రీనివాస్ (వేదికపై ఉన్నా కనిపించడంలేదు)
సభలో మాట్లాడుతున్న పరిశోధక విద్యార్థి వి. ధనుంజయ్
బహుజన స్టూడెంట్సో ఫ్రంట్, హైదరాబాదు విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన కార్యక్రమ వివరాల పత్రం
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు
సభాప్రారంభానికి ముందు గుర్రం జాషువ పద్యాలను వినిపిస్తున్న ఎం. రవిచంద్ర
సభలో మాట్లాడుతున్న డా. పిల్లలమర్రి రామలు
సభలో డా. పసునూరిని సత్కరిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు
సభలో మాట్లాడుతున్న డా. జిలుకర శ్రీనివాస్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి