రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రజాసాహితి పత్రికకు ఆహ్వానం

సుదీర్ఘచరిత్ర ఉన్న ప్రజాసాహితి మాసపత్రిక ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆన్ లైన్ లో ఉచితంగా చదువుకొనే అవకాశాన్ని కలిగిస్తోంది.
పత్రిక చదవాలని ఉన్నా డబ్బుల్లేక చదవలేనివారికి ఇది సదవకాశం మాత్రమే కాకుండా ఛందా కట్టి కూడా పత్రిక అందనివారికి కూడా ఇది ఎంతో అరుదైన అవకాశం. డబ్బులివ్వగలిగిన వారు ఛందాలు పంపకపోతే దాన్ని ( దాన్నే కాదు ఏ పత్రికనైనా ) నిర్వహించడం కష్టం. అది తెలిసి వాళ్ళు వారి వారి మార్గాల్లో ‘సహాయం’ అందిస్తూనే ఉంటారు. ఒక విఫ్లవాత్మక నిర్ణయం తీసుకున్న ప్రజాసాహితిని అభినందిస్తున్నాను. 
- డా.దార్ల వెంకటేశ్వరరావు

No comments: