దీనికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ముందుమాట రాశారు. ఆయన రాసిన కొన్ని అభిప్రాయాలు...
‘‘విషయ వైవిధ్యంతో కూడిన వ్యాసాలు సాహితీ విద్యార్థులకు చక్కగా పాఠం చెప్తున్నట్లుగా సరళమైన భాషలో అందించటం విశేషం. అత్యాధునికమైన సాహిత్య విమర్శసూత్రాలూ, సిద్ధాంతాలూ గమనించి ఆ దృష్టికోణంతో దార్ల ఈ వ్యాసాలను రచించినట్లు స్పష్టంగా చెప్పగలను.
ఈ వ్యాస సంపుటిలోని వ్యాసాలన్నీ సదస్సులకోసం రాసినవే. సదస్సు ముగిసిన పిదప, ఆ వ్యాసంపై వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి, విమర్శలను పునః సమీక్షించి పత్రాన్ని మళ్ళీ సిద్ధం చేయటం నిజాయితీకల పత్ర సమర్పకుడు చేయవలసిన పని. ఈ వ్యాసాలన్నీ ఇలా చేసినవేనని ఆ వ్యాసాలలో కన్పించే నిఖార్సయిన రిసెర్చి మెథడాలజీ చెప్పకనే చెప్తుంది. ఈ విషయంలో మాత్రం విద్యార్థులు- విద్యార్థులే కాదు కొందరైనా అధ్యాపకులూ దార్లని చూసి నేర్చుకోవాలని నా అభిప్రాయం. సీరియస్‌గా సాహిత్యవిమర్శ, పరిశోధన రంగాలలో పని చేసే వారికీ, సాహిత్య విద్యార్థులకీ ఈ పుస్తకం ఒక ‘ఫేస్ బుక్’ వంటిదని విన్నవించుకొంటూ- పాఠకులకు స్వాగతం పలుకుతున్నాను. దార్ల వారిని అభినందిస్తున్నాను.
- బేతవోలు రామబ్రహ్మం’’
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి