ప్రముఖ బ్లాగర్, కవి, మిత్రుడు జాన్ హైడ్ కనుమూరి నిన్న రాత్రి సుమారు 7- 8 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్ళుతున్న మార్గమధ్యలోనే హఠాత్తుగా మరణించారు. ఈ ఉదయమే జాన్ హైడ్ కనుమూరి గారి కుమార్తె ఫోను చేసి నాకీ విషయం చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన ఇంటి చిరునామా : BHEL, LIG BDL క్వార్టర్స్ నెంబరు: 163. ఫోను: 9700631132.
జాన్ హైడ్ కనుమూరి
జాన్ హైడ్ కనుమూరిగారు మంచి సాహిత్యాభిమాని. కవిత్వం బాగా రాసేవారు. బ్లాగు ద్వారానే ఆయన నాకు పరిచయం. గత నాలుగేళ్ళ క్రితం ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. తర్వాత మరలా ఆయన నేను కలుసుకోలేకపోయాం. కానీ, ఫోనులో మాట్లాడుతుండేవాళ్ళం. ఈ మధ్యఆయన ఫేసుబుక్ లో విస్తృతంగా రాస్తున్నారు. ఫేసుబుక్ లో పోస్టులను బట్టి ఈ మధ్య కాలంలో అత్యధికంగా ప్రార్థనా కూటమిలకు హాజరవుతున్నట్లనిపించింది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లూ అనిపించింది. ఫోనులో మాట్లాడేటప్పుడు కూడా కుటుంబసభ్యులతో ఎక్కువగా గడపాలనిపిస్తుందనే అనేవారు.
కుటుంబసభ్యులతో జాన్ హైడ్ కనుమూరి
ఈయన http://alalapaikalatiga.blogspot.in/ పేరుతో బ్లాగు రాస్తుండేవారు. చాలా హృద్యమైన కవిత్వం రాస్తుండేవారు. ఆయన ఈ మధ్య కాలంలో సి.వి.కృష్ణారావుగారితో మాట్లాడిన సంభాషణను తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
ఈ మధ్య ఆయన రాస్తున్న పోస్టుల్లో కవితలు అసంపూర్ణంగా రాయాల్సి వస్తుందని వాపోయారు. వాటిని ఫేసుబుక్ లోను, తన బ్లాగులోను ప్రచురించేవారు. వాటిపై కామెంట్లు వస్తే వెంటనే రిప్లై కూడా ఇచ్చేవారు. అంతేకాదు తన ప్రొఫైల్ ఫోటోని ఈ మధ్య మార్చుకున్నారు.
జాన్ హైడ్ కనుమారి గారు అమ్మపేరుతో ఒక ఈబుక్ ప్రచురించారు. దీనికి సాహితీవేత్తల మంచి స్పందనలు వచ్చాయి. త్వరలోనే నాన్న పేరుతో ఒక ఈ బుక్ తీసుకొస్తాని అనేవారు. ఒక మంచి మిత్రుణ్ణి కోల్పాయననిపిస్తుంది. ఆయన తన మిత్రల మరణానికి స్పందించి అనేక కవితలు రాశారు. మరలా ఆయన గురించి కవిత్వం రాయనవసరం లేదు. ఆయన రాసింది కూడా ఆయనకే వర్తిస్తుందనిపిస్తుంది.
ఆయన తనమిత్రుడి కోసం రాసిన కవితా పాదాల్నే ఇక్కడ పున: ప్రచురించి ఆయనకు నా నివాళిని అర్పిస్తున్నాను.
‘‘నా నుంచి కనుమరుగైన మిత్రుడా!
పదిలపరుచుకున్న
నీ అక్షరం, నీ పాదముద్రలకు నమస్కరిస్తాను....
పదిలపరుచుకున్న
నీ అక్షరం, నీ పాదముద్రలకు నమస్కరిస్తాను....
ఒకొక్కటిగా
చితాబస్మమౌతున్న జ్ఞాపకాలు
సమాధులకు పుష్పగుచ్చాలు
కాసింత అనుబంధంతో హృదయాన్ని మెలిపెడుతుంటాయి
చూస్తున్న కళ్ళకు
రహదారిపై నడుస్తూ నడస్తూ
మలుపుతిరిగి కనబడనట్టు
దృశ్యాదృశ్యాల మధ్య మనసు చిక్కుకుంటుంది’’ - జాన్ హైడ్ కనుమూరి 5 నవంబరు 2014
చితాబస్మమౌతున్న జ్ఞాపకాలు
సమాధులకు పుష్పగుచ్చాలు
కాసింత అనుబంధంతో హృదయాన్ని మెలిపెడుతుంటాయి
చూస్తున్న కళ్ళకు
రహదారిపై నడుస్తూ నడస్తూ
మలుపుతిరిగి కనబడనట్టు
దృశ్యాదృశ్యాల మధ్య మనసు చిక్కుకుంటుంది’’ - జాన్ హైడ్ కనుమూరి 5 నవంబరు 2014
కుటుంబసభ్యులతో జాన్ హైడ్ కనుమూరి
కుటుంబసభ్యులతో జాన్ హైడ్ కనుమూరి
కుటుంబసభ్యులతో జాన్ హైడ్ కనుమూరి
3 కామెంట్లు:
May his soul rest in peace. Kindly convey may heartfelt condolences to the bereaved family.
ప్రముఖ బ్లాగర్ , సాహితీవేత్త జాన్ హైడ్ కనుమూరి గారు దివంగాతులైనారని తెలిసి చాలా బాధ పడ్డాను . వారి ఆత్మకు శాంతి కలుగాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను
Dear All
Its with deep grief that we communicate this message to all.
Our colleague, Mr.John Hyde ( In-charge - HR Dept - Unit - III ) met with a serious heart stroke ( At 5.30 pm on 07.12.2014 ) and expired on his way to the hospital. He was 54 years old ( DOB : 08/02/1960 ).
He has been working past 22 years with us ( 01.09.1992 ) in HR-Dept ... he was a great poet as well.
We deeply mourn his untimely demise and will miss his presence among us.
He is survived by family members his wife and two daughters.
May his soul rest in peace. We pray to God to give his bereaved family the strength to bear this loss.
His Funeral is at 2 pm, near R C Puram for Further details Bhima : +919392044460
For Fenoplast Limited
కామెంట్‌ను పోస్ట్ చేయండి