రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

త్వరలో రానున్న దార్ల కవిత్వం ‘నెమలికన్నులు’

నేను రాసిన కొన్న్ని కవితలను గతం (2004)లో దళితతాత్త్వికుడు’ పేరుతో ప్రచురించాను. ఆ ప్రతులన్నీ అయిపోయాయి. వ్యాసాలు, సిద్ధాంత గ్రంథాలు ఎన్ని రాసినా కవిత్వానికి ఉన్న క్రేజే వేరు. దానిలో మన ఆత్మీయ స్పందన ఉంటుంది. మిగతా వాటిలో ఆలోచన ప్రధానంగా ఉంటుంది.  ఆ కవితలతో పాటు మరికొన్ని కవితలను కలిపి  రివైజ్డ్ ఎడిషన్ ‘నెమలికన్నులు’ పేరుతో  తీసుకొని రావాలనుకుంటున్నాను. ఈ నెలాఖరుకి ఆ పుస్తకం బయటకు వస్తుందని ఆశిస్తున్నాను.

1 comment:

Hari Babu Suraneni said...

యెన్ని పెన్నుల తపస్సు ఈ నెమిలికన్నులు?
యెన్ని కన్నుల ఉషస్సు ఆ నెమిలికన్నులు!