"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

27 ఆగస్టు, 2014

గ్యార యాదయ్య‘ఎర్కోషి’ (తెలంగాణ దీర్ఘ కవిత)


తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం 1969లో ఆత్మగౌరవ అస్తిత్వ ప్రతిబింబమై నింగికి రం గులద్దిన తరుణంలో స్వార్థపరుల ద్రోహ బుద్ధికి ఆహుతైన తదనంతర పరిణామంలో ఈ సహస్రాబ్ది ఆరంభం తెలంగాణలో మరో ఉద్యమంగా రూపుది ద్దుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కవిగాయకుల పాత్ర అనిర్వచనీయమైనది. విమర్శకులకంటే కవులే ముందుండాలని నమ్మే వాగ్గేయకారుడు, తెలంగాణ లోని చాలా మంది కవి పుంగవుల కంటే ముందుగానే మే ల్కొని, జనాన్ని మేల్కొలిపే దిశగా అక్షరాన్ని ఆయుధంగా మ లచే క్రమంలో పాట, కవిత ప్రక్రియలను ఎంచుకొని ముం దువరుసలో నిలిచినవాడు గ్యార యాదయ్య. తెలంగాణ నిం డా ఆకలి చావులు, ఆర్తనాదాలు! ఏ ముఖంలోనూ ఆనందం కనిపించదు. కరవు.. కరవు! దిక్కులు పిక్కటిల్లే చావు కేకలు! ఆధిపత్య వలసపాలన కక్కిన విషబీజం ఆకలి. ఈ స్థితిగతులకు గ్యార యాదయ్య అక్షరకూర్పు ఎర్కోషికావ్యం.

నల్లగొండ జిల్లా మర్రిగూడెంలో పేద మాదిగ కుటుంబంలో జన్మించిన గ్యార యాదయ్య యూనివర్శిటీ చదువుల వరకు ఎదిగిన క్రమంలో సాహిత్య రణరంగంలో పరాక్రమవంతుడైన సైనికుడై 1996లో గూటం దెబ్బ’ (దళిత పాటలు), 2001లో రంపెకోత’ (దళిత పాటలు), 2002లో ఎర్కోషి’ (తెలంగాణ దీర్ఘ కవిత)లను ప్రకటించాడు.60 ఏండ్ల తెలంగాణ ఘోషను సల సల కాగే సిరాతో సాహిత్య తెరపై గీసిన దృశ్యమాలిక ఎర్కోషికావ్యం.కండ్ల సంబూరం/ పాకూరు బండైపూసె/ ఆకలి ఒడ్డుమీని జెల్లఅంటూ ఆ కలి బాధను అనుభవించాడు. తెలంగాణలోని అస్తవ్యస్థ జనజీవన గతికి అద్దం పట్టే కవితా పంక్తుల సమూహాలు మరికొన్ని- బూడ్దిబువ్వ బాలింతకూన/ నోట్ల నెత్తురు పాల జల/బతుకంతా పత్తెం ఉప్పాసం’.

తెలంగాణలో చేనేత కార్మికుల ఆకలి చావులకు చెలించి తల్లడిల్లిన కవితాపాదాలు కొన్ని- పోగు పోగు పేనిన పేగు/గొంతుల పత్తికాయలు పటీల్‌మన్న/ ముక్కుల దూది’. తెలం గాణలో నీళ్లు పారినా పొలాలకందవు, తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు ఉ న్నా ఎవరికీ ఉద్యోగాలుండవు. ఇది ఆంధ్ర సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల కు ట్ర. తెలంగాణలో అతికొద్ది మందికి పదవులిచ్చి, దొరికిన కాడికి దోచుకు న్నరని యాదయ్యకవిత్వం ఆక్రోశిస్తుంది. కులావమానం, శారీరక రుగ్మతలు, ఆకలి ఆర్తనాదాలు, బత్కనీకి తండ్లాట, బానిసత్వమే దిక్కైన విధానాన్ని చూసి తల్లడిల్లి దేవున్ని నిందించే దళితజీవుల సహజ స్వభావాన్ని కవి ఇక్కడ ప్రసవిం చాడు ఇవన్నీ గతించి సర్వమానవ సమానత్వ సశ్య తెలంగాణను స్వప్నిస్తాడు గ్యార యాదయ్య!


కామెంట్‌లు లేవు: