ప్రముఖ సాహిత్య విమర్శకుడు, భాషాశాస్త్రపరిశోధకుడు ఆచార్య చేకూరిరామారావు గారు తన నివాసంలో 24 జూలై 2014 రాత్రి మృతిచెందారు. యువసాహిత్య విమర్శకులకు ఆయన ఒక మార్గదర్శిగా చెప్పుకోవచ్చు. ఆయన అనేక రచనలను చేశారు. వాటిలో కింది వాటిని ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు:
1975 తెలుగు వాక్యం, 1978 వచన పద్యం: లక్షణ చర్చ, 1982 రెండు పదుల పైన,1982 తెలుగులో వెలుగులు (భాషా పరిశోధన వ్యాసాలు),1991 చేరాతలు సాహిత్య విమర్శ - పరామర్శ,1994 చేరా పీఠికలు,1997 ముత్యాల సరాల ముచ్చట్లు,1998 ఇంగ్లీష్ తెలుగు పత్రికాపదకోశం,2000 స్మృతికిణాంకం,2000 భాషానువర్తనం, 2001 భాషాంతరంగం,2001 సాహిత్య వ్యాస రింఛోళి,2001 కవిత్వానుభవం, 2002 వచన రచన తత్త్వాన్వేషణ,2002 సాహిత్య కిర్మీరం,2003 భాషా పరివేషం మొదలైనవి.
ఆయన మృతి సంతాపం తెలియజేస్తున్నాను. ఈరోజు సూర్య దినపత్రికలో ఆయన గురించి నివాళి అర్పిస్తూ ఒక వ్యాసం కూడా రాశాను. ... దార్ల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి