"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

31 మే, 2014

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం




జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయహే
పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి
భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
హాలునిగాథాసప్తశతికి ఆయువులూదిన నేల
బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయహే
ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
తెలుగులో తొలి ప్రజాకవి పాలకుర్కి సోమన్న
రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని కట్టి
కవిరాజై వెలిగె దిశల కంచర్ల గోపన్న
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయహే

కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
మల్లినాథసూరిమా మెతుకు సీమ కన్నబిడ్డ
ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధు వతడు
దిగ్నాగునికన్న నేల ధిక్కారమే జన్మహక్కు
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయహే
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండరగండడు కొమరం భీముడేనీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మీనార్‌
జై తెలంగాణ జై జై తెలంగాణఠి
జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయహే
రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచెర్ల
సర్వజ్ఞ సింగభూపాలునిబంగరు భూమి
వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి
పిలలమఱ్ఱి పినవీరభద్రుడుమాలో రుద్రుడు
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయహే
సమ్మక్కలు సారక్కలు సర్వాయిపాపన్నలు
సబ్బండావర్ణాల సాహసాలు కొనియాడుతు
ఊరూర పాటలైన మీరసాబువీరగాథ
దండునడిపే పాలమూరు పండుగోల్ల సాయన్న
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయహే
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
డప్పు డమరుకము డక్కి శారదస్వరనాదాలు
పల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగా
అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయహే
జానపద జనజీవన జావళీలు జాలువార
జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి
తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయహే
బడులగుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక
ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మా వెలగాలి
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయహే
గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయహే
                                                           - అందెశ్రీ

3 కామెంట్‌లు:

Satyam చెప్పారు...

తెలంగాణా రాష్త్ర గీతం తెలంగాణా యాసలో వుంటుందనుకున్నా. అంధ్రా వాళ్ళ తెలుగులో వుందేమిటి? ఇద్దరిదీ ఒకే తెలుగైతే ఇంత గొడవ దేనికి జరిగింది?
అన్యాయాలు జరిగివుంటే సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. కొంతమంది స్వార్థం కోసం అన్యాయంగా రాష్త్రాన్ని విడదీసారు.



Unknown చెప్పారు...

ఏడుపుగొట్టు వెధవలు విడిపొయినందుకు చాలా, చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళు అబద్దాలు, విషం, విద్వెషాలా మధ్య మనం సాధించిందంత అప్పనంగా సాని దాని అండ చూసుకొని దోచుకున్నారు తెలబాన్లు. కాని ఆంద్రులకున్న ఏకైక ఆస్తి వాళ్ళ శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం, ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. విద్యుత్, నీళ్ళు, ఆంధ్రుల శ్రమతొ నిర్మించిన హైదరబాద్ దోచుకున్నా తెలబాన్లలొ ఇంకా అభద్రతా భావం ఎందుకు? వాళ్ళకు భయం, అందుకే వాళ్ళకు అలవాటైయిన ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అసూయ, ద్వెషాలతొ రగిలిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం, తెలబాన్లు పాకిస్తాన్లా తయరవుతారు, వాళ్ళకి ఆంధ్రుల మీద ద్వెషం లేకపోతే మన లేరు.

Unknown చెప్పారు...

I am really aghast to see the blind hatred for seemandhra people in the minds of the so called leaders of Telangana of all hues and from all walks - politicians, employees, teachers,film makers. It is much worse than a Pakistani Jihadis have against the Hindus. In both cases, the hatred was systemactically injected into the minds of gullible people. In near future , I am sure there will be school books describing the "loot and exploitation" during united AP.