రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సెంట్రల్ ’ వర్సిటీలో డాబి.ఆర్. అంబేద్కర్ జయింతి ఉత్సవాలుఅంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏప్రిలో, 25, 2014 వతేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డా.బి.ఆర్.అంబేద్కర్ 124వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ దళిత ఉద్యమకారిణి శ్రీమతి మంజుల ప్రదీప్, ప్రత్యేక అతిథిగా రచయిత, ఉద్యమకారుడు, ప్రముఖకార్డియోలజిస్ట్ డా. ఎం. ఎఫ్. గోపీనాథ్ పాల్గొంటున్నారు. వక్తలుగా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డీన్, ఆచార్య జి.నాంచారయ్య, తెలుగుశాఖలో అసిస్టెంటు ప్రొఫెసర్ డాదార్ల వెంకటేశ్వరరావు, రచయిత్రి, పరిశోధకురాలు డా.స్వాతీ మార్గరెట్, సినీనటుడు శ్రీ సందేష్, ఇప్లూ లో అసిస్టెంటు ఫ్రొఫెసర్ డా.షరీన్ బి.ఎస్., పాల్లొంటున్నారు. ఈ సమావేశానికి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దారా అశోక్ అధ్యక్షత వహిస్తారు. సమావేశానికి ముందు క్యాంపస్ లో ఊరేగింపు ఉంటుంది. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు గోనే లింగరాజు చిత్రకళాప్రదర్శన ఉంటుంది.

1 comment:

NAGARAM PRAKASH said...

manci programe