"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

22 November, 2013

తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలు (ఆంధ్రభూమి)

తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలు


  • 21/11/2013
హైదరాబాద్, నవంబర్ 20: తెలుగు సాహిత్యంలోని భిన్నమైన ప్రక్రియల్లోని నాట్యం, నాటకం, అవధానం, పత్రికా రచన, మహిళాభ్యుదయం, గ్రంథాలయం, సంఘసేవ, జానపద కళలు తదితర రంగాల్లో విశేషమైన సేవలు అందించిన 32 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2012 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం పురస్కార గ్రహీతలను ఎంపిక చేసింది.
పురస్కారాలకు ఎంపికైన వారిలో మన్నవ భాస్కరనాయుడు (సృజనాత్మక సాహిత్యం), హరి శివకుమార్ (పరిశోధన), టి. రాంరెడ్డి (హాస్య రచన), మంగళగిరి ప్రమీలాదేవి (జీవిత చరిత్ర), ఎం.కె.దేవకి (రచయిత్రి), జ్యోతిరాణి ఎస్ (ఉత్తమ నటి), జానకీనాథ్ (ఉత్తమ నటుడు), గోపి సత్య ప్రకాష్ (ఉత్తమ నాటక రచయిత), మేడూరి సత్యనారాయణ (హేతువాద ప్రచారం), శ్రీపాద స్వాతి (ఉత్తమ రచయిత్రి), చిన్ని నారాయణ (వచన కవిత), ఎ వి జనార్ధనరావు (వివిధ ప్రక్రియలు), ఎం సదాశివశర్మ (పత్రికా రచన), ఆముదాల మురళి (అవధానం), పరుచూరు జమున (మహిళాభ్యుదయం), కె పి అశోక్ కుమార్ (గ్రంథాలయ కర్త), టి అశోక్‌బాబు (గ్రంథాలయ సమచార విజ్ఞానం), కె వి నరేందర్ (కథ), వనం లక్ష్మీకాంతరావు (నాటకరంగం), అమృతలత (సంఘసేవ), పేట జయలక్ష్మి (ఆంధ్రనాట్యం), నాయని కృష్ణమూర్తి (నవల), ఎ ఉషాదేవి (్భషా సాహిత్య విమర్శ), కచ్చు కొమరయ్య (జానపద కళలు), మసన చెన్నప్ప (ఆధ్యాత్మిక సాహిత్యం), దార్ల వెంకటేశ్వరరావు (సాహిత్య విమర్శ), మల్లవరపు వెంకటరావు (పద్య కవిత), శిరోమణి వంశీ రామరాజు (సాంస్కృతి సంస్థ నిర్వహణ), సి వి సర్వేశ్వర శర్మ (జనరంజక విజ్ఞానం) అరుణా సుబ్బారావు (జానపద సంగీతం), చొక్కాపు వెంకటరమణ (ఇంద్రజాలం), టి వేదాంతసూరి (బాలసాహిత్యం) ఈ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో వున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. పురస్కారం కింద వెయ్యి నూట పదహారు రూపాయిల నగదు, పురస్కార పత్రంతో పాటు సత్కరిస్తామని విసి ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య కె. ఆశీర్వాదం చెప్పారు.

3 comments:

Unknown said...

i mish you congratslassions to you sir to got keerti puraskaram for 2012 iam very happy sir to get the award..........

Unknown said...

i mish you congratslassions to you sir to got keerti puraskaram for 2012 iam very happy sir to get the award..........

Unknown said...

congradulations sir to got keerthi award for 2012. iam very happy sir