నాన్న చనిపోయి మార్చి 30, 2013 నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా 30 మార్చి 2013న తూర్పుగోదావరిజిల్లా, కాట్రేనికోన మండలం, చెయ్యేరు అగ్రహారం గ్రామంలో మా సొంత పొలంలో నాన్నని సమాధి చేసిన దగ్గరే ఆ స్మృతి చిహ్నాన్ని నిర్మించుకున్నాం. ఇంకా పూర్తికావలసిన పనులున్నాయి. అయినా నాన్న చనిపోయిన రోజునే నాల్గవ వర్థంతి జరపాలని నిర్ణయించుకున్నాం. అందువల్ల మా కుటుంబసభ్యులు, బంధవులు, గ్రామస్థులు, చర్చి సభ్యులంతా మార్చి 30, 2013 వతేదీన మా నాన్నకు ఘనంగా నివాళులర్పించాం. అప్పుడే నాలుగేళ్ళయిపోయిందా అనిపిస్తుంది. కాలం ఎంత తొందరగా పరుగుపెడుతుందనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కింద ప్రచురిస్తున్నాను.
నాన్న సమాధి దగ్గర కుటుంబ సభ్యుల నివాళి పెద్దన్నయ్య కుటుంబం, చెల్లి కుటుంబం.
సమాధి దగ్గర నాన్నకు అమ్మ నివాళి ( అమ్మతో పాటు తమ్ముడు రవికుమార్ ఉన్నాడు)
ఊరేగింపుగా సమాధి దగ్గరకు వెళ్తున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు
ఇంటి దగ్గర ప్రార్థన
నాన్న సమాధి దగ్గర కుటుంబ సభ్యుల నివాళి ( చిన్నన్నయ్య కుటుంబ సభ్యులు)
నాన్న సమాధి దగ్గర కుటుంబ సభ్యుల నివాళి ( తమ్ముడు కుటుంబ సభ్యులు, అత్తామామలతో కలిపి)సమాధిపై పూలతో అలంకరించి, కొవ్వోత్తులతో నివాళులు అర్పిస్తున్న గ్రామస్థులు, చర్చి సభ్యులు
నాల్గవ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా కూటమిలో పాస్టర్ గార్లు, గ్రామ పెద్దలు తదితరుల సమక్షంలో దేవుని స్థుతిస్తూ ప్రార్థనలు చేశారు.
నాల్గవ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా కూటమిలోపాల్గొన్న చర్చి సభ్యులు, గ్రామస్థులు
ప్రార్థనలో పాల్గొన్న పెద్దన్నయ్య, నేను
సమాధి దగ్గర ప్రార్థనలు చేస్తున్నపాస్టర్లు, ప్రజలు, కుటుంబసభ్యులు
నాన్న గురించి తనకున్న ఆత్మీయ సంబంధాలను పంచుకుంటున్న తమ్ముడు డా.దార్ల రవికుమార్
ప్రార్థనలో నిమగ్నమైన గ్రామప్రజలు, కుటుంబ సభ్యులు
ప్రార్థనా కూటమికి ముందు నాన్నకు నివాళి అర్పిస్తున్న చిన్నన్నయ్య సత్యనారాయణ
నాన్నకు నివాళులు అర్పిస్తున్న మనవలు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనాల దృశ్యాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి