యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో పి.జి., పిహెచ్.డి., ప్రవేశ పరీక్ష ఫలితాలు ప్రకటించారు. మరిన్ని వివరాలకు http://acad.uohyd.ac.in/ResInt1.html వెబ్ సైట్ ని దర్శించవచ్చు.రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

హైదరాబాదులో ’బ్లాగు పుస్తకం‘ ఆవిష్కరణ సభ ( ఆదివారం 19-02-2012)

ఈ మధ్య కాలంలో కొంచెం రెగ్యులర్ గా ఇంటర్నెట్ ఉపయోగించేవాళ్ళకి బ్లాగు రాయడమనేది ఒక భాగంగా గానీ, సరదాగా గాని మారుతోంది.’బ్లాగులు రాయడమెలాగో ’ గతంలో చాలా మంది రాశారు. దానికంటే ఈ పుస్తకంలో ఉన్న ప్రత్యేకత ఏమిటో చూడాలి. ఈ పుస్తకం వల్ల ప్రయోజనమేంటో ఇప్పటికే ’ఈనాడు’( ఆదివారం అనుబంధం) లోను, పుస్తకం.నెట్ లోను సమీక్షించారు కూడా.  ‘బ్లాగు పుస్తకం’ గురించి http://suravara.com వారిలా పేర్కొన్నారు.
  • బ్లాగులంటే ఏంటో తెలుస్తుంది
  • బ్లాగులు ఎలా చదవాలో తెలుస్తుంది
  • బ్లాగులు ఎలా రాయాలో తెలుస్తుంది
  • బ్లాగులపై అవగాహన కలుగుతుంది.

‘బ్లాగు పుస్తకం’ ఆవిష్కరణ హైదరాబాదులోని  మధురానగర్ లో జరుగుతుందనీ, రమ్మనీ నన్నూ పిలిచారు చావా కిరణ్ .  దాని ఆహ్వాన పత్రిక దిగువనిస్తున్నాను.

No comments: