రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రాజెక్టు ఫెలోగా ప్రముఖ కవి వేముల ఎల్లయ్య ఎంపిక

యు.జి.సి. వారి ‘‘తెలుగు సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక అధ్యయనం’’ అనే నా  మేజర్‌ రీసెర్చ్ ప్రాజెక్టులో ప్రాజెక్టు ఫెలో ఉద్యోగానికి 29 సెప్టెంబరు 2011 వతేదీన ఇంటర్వ్యూ జరిగింది. దీనిలో ప్రముఖ కవి వేముల ఎల్లయ్య ఎంపికయ్యారని ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఇంటర్వ్యూ కి హాజరైన మిగతా అభ్యర్థులకూ, సంబంధిత సమాచారాన్ని ఆశించేవారందరికీ తెలియజేస్తున్నాను.
-
వేముల ఎల్లయ్య నల్లగొండ జిల్లాకు చెందినవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో  ఉన్నత విద్యను అభ్యసించారు. ఇప్పటికే కక్క, సిద్ది అనే రెండు నవలల్ని, ముల్కి అనే ఒక కవితా సంపుటిని ప్రచురించారు. ఈయన దళిత, మాదిగ సాహిత్యంలో విశేషంగా కృషి  చేస్తున్నారు.  ప్రాజెక్టు ఫెలో గా  ఎంపికైన సందర్భంగా వేముల ఎల్లయ్య గార్ని అభినందిస్తున్నాను.--డా. దార్ల వెంకటేశ్వరరావు

No comments: