"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

11 సెప్టెంబర్, 2011

తమ వారసుల్ని తెలుగు చదివిస్తున్నారా?

-వెంకట రామయ్య గంపా (రచయిత యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌)

ఇటీవల కాలంలో ప్రాంతీయ భాషాభిమానులు వారి భాషల పరిరక్షణకోసం తీవ్రంగా ఉద్యమాలు చేస్తున్నారు. అందుకు కారణం ఆయా భాషలు ఇతర భాషల వల్ల, ముఖ్యంగా ఆంగ్లభాష ప్రభావం వల్ల క్రమంగా కనుమరుగవుతున్నాయని వారి భావన. భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో భాషా పరిరక్షణ చర్యలు తీసుకొంటున్నవారికి తమిళులు ఆదర్శప్రాయులని పేర్కొంటున్నారు. తక్కిన ప్రాంతీయ భాషల వారు కూడా తమిళులను అనుకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు భాషాభిమానులు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం నాడు తెలుగు భాష సంరక్షణకు తీసుకోవలసిన చర్యల గురించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొందరు తెలుగు భాష ఆంగ్లప్రభావం వలన అంతరించిపోయే అవకాశం ఉందని వాదిస్తున్నారు.

వారి వాదన ప్రకారం, తెలుగు భాషకు అతి తక్కువకాలంలో ప్రమాదం పొంచి ఉంది. తెలుగు చదువుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంది. భాషలో కొన్ని పదాలు పూర్తిగా ఆంగ్లంలో ఉన్నాయి. వాటికి తెలుగు పదాలు లేవు. పిల్లలు తమ ఇంట్లో కూడా తెలుగు మాట్లాడడం మానేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమాన్నే ప్రోత్సహిస్తున్నారు. దీనివలన క్రమంగా తెలుగు భాష కనుమరుగవుతుందనే వాదన వినిపిస్తుంది. ఆంగ్లభాష వల్ల తెలుగు భాషకు కొంత అన్యాయం జరుగుతున్నప్పటికీ వాస్తవాల్ని మరిచి మాట్లాడే పరిస్థితే ఎక్కువగా కనిపిస్తుంది.

భారతదేశంలో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడేభాష తెలుగు. భాషకు సంబంధించిన వాస్తవాలను గమనిస్తే ఒక భాష మనుగడ అనేది ఆభాష మాట్లాడేవారిపై ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు 2011 నాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ జనాభా పనిమిది కోట్ల నలభై ఆరు లక్షలు. తెలుగేతర ప్రాంతాలలో తెలుగుభాష మాట్లాడేవారి సంఖ్య దాదాపు నాలుగు కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఆ లెక్కన తెలుగుభాష మాట్లాడేవారి సంఖ్య దాదాపు పన్నెండు కోట్లకు పైగానే ఉంటుంది.

ప్రపంచంలో పన్నెండు కోట్లకుపైగా జనాభా ఉన్న దేశాలు పది మాత్రమే. ఇంతమంది ప్రజలు మాట్లాడే భాషకు ఇతర భాషల నుంచి ప్రమాదం ఉందని చెప్పడం కొంత ఆలోచించవలసిన విషయం. చాలా మంది మన దేశ వాస్తవ పరిస్థితులను విస్మరిస్తున్నారు. మన రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 72.5. శాతం. ఇది అధికారిక లెక్కల ప్రకారం ఉన్న అక్షరాస్యత. ఇందులో కేవలం సంతకం తప్ప రాయడం, చదవడం రానివారు దాదాపు 10 శాతానికి పైగానే ఉంటారు. ఈ విధంగా దాదాపు ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత 60 శాతం కంటే కొంచెం పక్కువగా ఉంటుంది. అంటే 40 శాతం నిరక్షరాస్యులకు తెలుగు తప్ప మరొక భాష తెలియదు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ జనాభా అయిదు కోట్ల అరవై మూడు లక్షలు కాగా, పట్టణ జనాభా రెండుకోట్ల పనభై మూడు లక్షలు. దాదాపు 75 శాతం విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోనే చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నప్పటికీ వారి పరీక్షలు తప్ప, తక్కిన చదువంతా తెలుగులోనే ఉంటుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో చదువుతున్న వారు 25 శాతం మంది. వారు ఆంగ్లమాధ్యమంలో చదువుతున్నప్పటికీ పదవతరగతి వరకు తెలుగు తప్పనిసరిగా చదవాలి. సిబియస్‌సిలో కూడా తప్పని సరిగా మూడు భాషలు చదవాలి. వాటి నుంచి తెలుగును కూడా పంచుకోవచ్చు. అంటే తెలుగు భాషను ప్రతి విద్యార్థి తప్పని సరిగా చదివే అవకాశం ఉంది.

ఈ విధానాల వలన తెలుగువాడైన ప్రతి విద్యార్థి తెలుగు చదవటానికి, రాయడానికి అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో తెలుగుకు వచ్చిన ముప్పేమి లేదు. అయితే విద్యార్థుల్లో తెలుగు భాష వాడకం కొంత తగ్గింది. ఆంగ్ల పదాలు కొన్ని పూర్తిగా వాడుకలోకి వచ్చాయి. ఒక భాష నుంచి మరొక భాషలోకి పదాలు ప్రవేశించడం అనేది సహజం. ఏదైనా ఒక పదం కేవలం ఒక్క భాషలోనే ఉంటే, ఆ పదాన్ని ఇతర భాషల వాళ్ళు వాడాల్సివస్తే మూల భాష పదాన్నే వాడడం సహజంగా జరుతున్నదే. ఆ విధంగా చాలా ఆంగ్లపదాలు తెలుగులో వాడుతున్నారు.

భాషా పండితులు చాలా ఆంగ్ల పదాలకు తెలుగులో సమానార్థక పదాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పదాలను కొన్ని పత్రికలు వ్యవహారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. గత్యంతరం లేని సమయంలో ఆంగ్లపదాలను యథాతధంగా వాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు భాషలో కొన్ని వేల సంఖ్యలో ఇతర భాషల నుంచి వచ్చిన పదాలున్నాయి. తెలుగులో ఉన్న పదాలలో సంస్కృతం వాటా 60 శాతం పైగానే ఉన్నట్లు భాషాశాస్త్ర వేత్తలు నిరూపించారు. సంస్కృత పదాలు లేకుండా ఒక వాక్యం కూడా తెలుగులో రాయలేం. కాబట్టి తెలుగులో సమానార్థకాన్ని సృష్టించలేని ఆంగ్లపదాలను యథాతధంగా వాడటం వల్ల తెలుగు భాషకు వచ్చిన ముప్పేమి లేదు.

భాషా వ్యాప్తి పురోగతి లేదా తిరోగతి ఆ భాషలోవచ్చే సాహిత్య రచనలపై కూడా ఆధారపడి ఉంటుంది. శతాబ్దాల కాలం వరకు ఒకటి రెండు తెలుగు రచనలు మాత్రమే చలామణిలో ఉన్నాయి. అతి తక్కువ మంది పాఠకులు మాత్రమే ఉన్నారు. సాహిత్య రచనల సంఖ్య క్రమంగా పదుల సంఖ్యలో పెరగడానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టింది. పాఠకుల సంఖ్య కూడా చాలా కొద్దిమందికే పరిమితమై ఉంది. కాని ప్రస్తుతం తెలుగులో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో సాహిత్య రచనలు వెలువడుతున్నాయి. కొన్ని వేల సంఖ్యలో సాహిత్య పాఠకులు ఉన్నారు.

ఈ గణాంకాల ద్వారా ప్రస్తుత తెలుగుభాష పురోగతి తెలుస్తుంది.నాడు కొద్ది మంది మాత్రమే తెలుగు భాషా సాహిత్యాలను అభ్యసించేవారు. కాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పదహైదుకు పైగా విశ్వవిద్యాలయాలలో తెలుగు పం.ప. పాఠ్యాంశంగా ఉంది. ప్రతి విశ్వవిద్యాలయంలో సగటున వందమంది విద్యార్థులు ఉన్నారు. ఈ లెక్కన సంవత్సరానికి పదహైదు వందల మంది విద్యార్థులు తెలుగును విశ్వద్యాలయ ్థాయిలో చదువుతున్నారు. ఇంతకు పూర్వం ఉన్న తెలుగు విద్యార్థులతో పోస్తే ఈ సంఖ్య చాలా పక్కువనే చెప్పాలి.

కొందరి అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పదవతరగతి వరకు మాత్రమే తెలుగు తప్పనిసరి పాఠ్యాంశంగా ఉంది. దానిని ఇంటర్మీడియట్‌ వరకు పొడిగించాలి. అంటే తెలుగు భాషను ఇంటర్మీడియట్‌ వరకు తప్పనిసరిగా చదవాలి అనేది వారి వాదన. ఇలా చదవడం వలన తెలుగు రాయడం, చదవడం బాగా వస్తుందనేది వారి అభిప్రాయం. ఇక్కడ ఆలోంచవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. దాదాపు రెండు మూడు దశాబ్దాల క్రితం పదవ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. అప్పట్లో పదవ తరగతి చదిన వారు తెలుగులో స్పష్టంగా చదవడం, రాయడంతో పాటు ఉద్యోగంలో పటువంటి సమస్య లేకుండా రాణించారు.

కానీ ప్రస్తుతం పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం సరిగా రాదు అనే పరిస్థితి నెలకొనడానికి కారణమేమిటి? అందుకు కారణం విద్యార్థులు తెలుగును సరిగా చదవకపోవడమా? లేక తెలుగు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు సరిగా చెప్పకపోవడమా? ఒక విద్యార్థి లేకా కొందరు విద్యార్థులు తమకు తెలుగు సరిగా రాయడం, చదవడం రావడం లేదంటే అది ఆ విద్యార్థుల తప్పు. కానీ అధిక శాతం మంది విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం రావడం లేదంటే అది తెలుగు నేర్పే ఉపాధ్యాయుడి తప్పు. పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమం చదివిన విద్యార్థులు తక్కిన పాఠ్యాంశాలు పాసై తెలుగు పాఠ్యాంశం మాత్రమే ఫెయిల్‌ అయినవారి సంఖ్య పక్కువగానే ఉంది. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి.

కొందరు విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశం అంటే భయం. అందుకు గల కారణం తెలుగు ఉపాధ్యాయులే. ఇప్పటికీ చాలా మంది తెలుగు ఉపాధ్యాయుల దృష్టిలో తెలుగు పాఠ్యాంశం అంటే తెలుగు పద్యాలు మాత్రమే అనే భావన ఉంది. వారి దృష్టిలో విద్యార్థులకు తెలుగు నేర్పడమంటే తెలుగు పద్యాలను, వ్యాకరణాన్ని కంఠస్థం చేయించడమే. తెలుగు పద్యాలను తప్పులు లేకుండా రాస్తేనే విద్యార్థులకు మంచి మార్కులు వేస్తారు. తక్కిన పాఠ్యాంశాలు చదవడానికి ఇబ్బంది ఉండదు. పూర్థిగా ప్రతి అక్షరాన్ని కంఠస్థం చేయవలసిన అవసరం ఉండదు. సమాధానాలలో ఒకటి రెండు విషయాలు గుర్తుకు రాకపోయినా సమాధానాన్ని పూర్తిచేయవచ్చు. మార్కులూ వస్తాయి.

కానీ తెలుగు పద్యంలో ఏ ఒక్క అక్షరం తప్పు పోయినా పూర్తి పద్యాన్ని తప్పుగా గుర్తించి తక్కువ మార్కులు ఇచ్చే ఉపాధ్యాయులు ఇప్పటికీ ఉన్నారు. దీని వలన చాలా మంది విద్యార్థులు తెలుగు పాఠ్యాంశాన్ని కాదని సంస్కృతమో లేక హిందీనో తమ ద్వితీయ భాషగా పంచుకొంటున్నారు. ఈ విధానం ఇప్పటికీ విశ్వవిద్యాలయ ్థాయిలో కూడా కొనసాగుతోంది.ఉదాహరణకు పిహెచ్‌.డి. చేసిన వారు విశ్వ విద్యాలయ అధ్యాపక పోస్టులకు ఇంటర్వూలకు ెవెడితే, అభ్యర్థి పరిశోధనాంశాన్ని పక్కనపెట్టి, కేవలం పద్యాల ద్వారా అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేసే పరిస్థితి నేటికీ ఉంది. కొన్నిచోట్ల తెలుగు ఉపాధ్యాయులే లేని పరిస్థితి కూడా ఉంది.

కానీ అన్ని పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులు లేరని చెప్పలేం. మరి కొన్ని చోట్ల ‘తెలుగును ప్రత్యేకంగా చెప్పేది ఏముంది!’ అని చెప్పి విద్యార్థులకు గైడ్‌ ఇచ్చి చదువుకోమని చెప్పే తెలుగు ఉపాధ్యాయులు ఉన్నారు. మరికొంత మంది తెలుగు ఉపాధ్యాయులు తమ పిల్లలకు తెలుగు చదవడం, రాయడం రాదు అని గొప్పగా, గర్వంగా చెప్పుకొంటుంటారు. తమ పిల్లలకు తెలుగు పాఠాలు నేర్పించవచ్చు, కాని నేర్పరు. వారి పిల్లలకే వారు తెలుగు చదవడం, రాయడం నేర్పలేనివారు ఇతర విద్యార్థులకు తెలుగును సరిగా బోధించడానికి నైతికంగా అర్హత కలిగిఉన్నారో లేదో వారే ఆలోంచుకోవాలి. తెలుగు భాష పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న తెలుగు ఉపాధ్యాయులలో పంతమంది తమ పిల్లలు కూడా తెలుగు ఉపాధ్యాయులు కావాలని అనుకుంటున్నారు?
తెలుగు భాష పరిరక్షణ గురించి సభలలో మాట్లాడేవారు, తెలుగు రచ యితలు, కవులలో తమ రచనా వారసత్వాన్ని తమ పిల్లలు కూడా కొన సాగించాలనుకొనే వారు పంతమంది ఉన్నారు? కేవలం వార్తా ఛానెళ్లలో వాడుతున్న భాషే అందరి భాషా! వారి వల్లే భాష అంతరించి పోతుందా? పిల్లలు మాట్లాడే వచ్చీ రాని ఆంగ్లపదాలే భాషను కనుమరుగు చేస్తాయా? వార్తా ఛానెళ్ల వారిని, ప్రభుత్వాన్ని, పిల్లలను విమర్శస్తే తెలుగుభాషను సంరక్షించినట్ల వుతుందా? లేక మన చేతుల్లో ఉన్న పనిని సక్రమంగా నిర్వహిస్తే తెలుగు భాషను కాపాడు కోవచ్చా? ఈ విషయాలను ఆలోంచవలసిన అవసరం ఉంది.


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీరు చెప్పేది ఎలా ఉన్నా, వాస్తవాలు మాత్రం వేఱుగా ఉన్నాయి. రాష్ట్రంలో కోటీ ముప్ఫై అయిదులక్షలమంది విద్యార్థులు ఉండగా వారిలో కేవలం 93 లక్షలమంది మాత్రమే తెలుగుని ఒక సబ్జెక్టుగా చదువుతున్నారు. మీరు చెప్పిన త్రిభాషాసూత్ర పథకంలో తెలుగుని ఎంచుకోవడానికి అవకాశమున్నప్పటికీ చాలా ప్రైవేట్ పాఠశాలలో తెలుగుకు బదులు పిల్లలకి ఫ్రెంచో, స్పెషల్ ఇంగ్లీషో ఇప్పిస్తున్నారు. కేంద్రీయ సిఉలబస్ ని అనుసరిస్తున్న పాఠశాలల్లో 6 తరగతిలో తెలుగు అక్షరాలు దిద్దిస్తారు. ఇది హాస్యాస్పదం కావడమే కాక వారికి భాషాపరిచయం ఆలస్యం అవ్వడం వల కనీసపు పట్టు ఏర్పడడం లేదు. అందుచేత తెలుగుని ఇంటర్మీడియట్ వఱకు తప్పనిసరి సబ్జెక్టు చేయాలన్నది సహేతుకమైన డిమాండే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఒక భాషాజాతిలో ఆ భాషని చదవనివాళ్ళ సంఖ్య ౩౦ శాతానికి మించితే ఆ భాష ప్రమాదంలో పదిందని అర్థం. ఆ రకంగా చూస్తే తెలుగు పరిస్థితి బాలేదనేది నిజం. చాలామంది పిల్లలకి తెలుగంకెలు రావు. తెలుగులో రంగుల్ని ఏమంటారో తెలియదు. తెలుగువారి వావి-వరుసల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. తెలుగులో ఉన్న మొక్కల పేర్లూ, జంతువుల పేర్లూ తెలియవు. చాలా తెలుగు క్రియాపదాల్ని ఆంగ్ల క్రియాపదాలతో వ్యవహరిస్తున్నారు. ఇన్ని కోణాల నుంచి చూసినప్పుడు తెలుగు ప్రమాదంలో ఉందనే అర్థం.

WELCOME Mr. VENKATA RAMAIAH చెప్పారు...

మీ ప్రశ్నకు సమాధానం వ్యాసంలోనే ఉంది. మీరు చెప్పింది నిజమే అయినప్పటికీ వాస్తవాల్ని విస్మరిస్తున్నారు. విద్యార్థులు తెలుగును ఒక సబ్జెక్ట్ గా చదవక పోవటానికి గల ప్రాధమిక కారణాలను అన్వేషించాలి. ప్రతి విద్యార్థి మూడు భాషలు విధిగా చదవాల్సినప్పుడు విద్యార్థి తన మాతృభాషను కాదని హిందీనో, సంస్కృతాన్నో లేక మరొక భాషనో ఎందుకు చదువుతున్నాడు? ఆ విద్యార్థికి హిందీ మీదనో లేక సంస్కృతం మీదో ప్రేమ ఉండి కాదు. మాతృభాష మీద మమకారంలేక కాదు. నేటి విద్యావ్యవస్థలో మార్కుల మీద ఉన్న ఆసక్తి. హిందీలోనో, సంస్కృతంలోనో వచ్చినన్ని మార్కులు తెలుగులో రావటం లేదు. మన రాష్ట్రంలో కూడా హిందీని ఆరవ తరగతి నుంచి మాత్రమే చదువుతారు. ఇక సంస్కృతాన్ని చాలా తక్కువ మంది చదువుతున్నారు. కానీ ఇంటర్ మీడియట్ లో విద్యార్థులు సంస్కృతాన్నే ఎక్కువగా తీసుకొంటున్నారు. అందుకు కారణం కూడా మార్కులే. సంస్కృతాన్ని తెలుగులోకానీ, లేదా మరొక భాషలో కానీ రాయటానికి అనుమతిస్తున్నాం. కానీ తెలుగు సబ్జెక్ట్ మార్కులు మాత్రం సంస్కృతంతో సమానంగా ఇవ్వలేక పొతున్నాం. ఇక మీరన్నట్లు పిల్లలు కొన్ని సంవత్సరాల కాలంపాటు తెలుగు చదివి కనీసం అంకెలు రాయటం, చదవటం, జంతువుల పేర్లు తెలియటం లేదంటే తప్పెవరిదనే విషయం మీరే ఆలోచించాలి. ఈ విషయన్ని నేను వ్యాసంలో ప్రస్తావించాను.