యూనివర్సిటీ గ్రాంట్సు కమీషన్ వారు నాకు ‘‘తెలుగు సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక అధ్యయనం’’ ’ అనే అంశంపై పరిశోధన చేయడానికి గాను ఒక మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టుని మంజూరు చేసింది. దీన్ని మూడు సంవత్సరాలలో పూర్తిచేయాలి. అందుకు గాను ఒక ప్రాజెక్టు ఫెలోని నియమించుకోవచ్చు. ప్రాజెక్టు ఫెలోకి నెలకి రూ.8000/` ( ఎనిమిది వేల రూపాయలు ) ఇస్తారు.
దీనికి సంబంధించిన ఉద్యోగ ప్రకటనను వెలువరించాను. కనీసం 55 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడుతో ఎం.ఏ., తెలుగు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నలభైయ్యేళ్ళలోపు యువతీ, యువకులలో ఏ కులానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.పూర్తి వివరాల కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది: 5 సెప్టెంబరు 2011 (సాయంత్రం 5 గంటలలోపు).
దరఖాస్తుల్ని నిర్దేశిత నమూనాలో జతపరిచి
డా॥దార్ల వెంకటేశ్వరరావు,
ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్, అసిస్టెంటు ప్రొఫెసరు,
తెలుగుశాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు,
గచ్చిబౌలి, హైదరాబాదు`46., ఆంధ్రప్రదేశ్, ఇండియా అనే చిరునామాకి పంపించాలి.
అర్హులైన అభ్యర్ధులను యూనివర్సిటీ గ్రాంట్సు కమీషన్, న్యూఢల్లీి మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు వారి నియమనిబంధనలను అనుసరించి ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ, స్థలాన్ని అర్హులైనవారికి ఫోను లేదా మెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
మరిన్ని వివరాలకు : 09989628049 ఫోను చేసి తెలుసుకోవచ్చు.format of the application: Format for Ugc Project Fellow
Dr. Darla Venkateswara Rao at the time of ugc major research project presentation at UGC office, New Delhi.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి