Thursday, December 09, 2010

‘పునర్మూల్యాంకనం‘ ఆవిష్కరణ

డా.దార్ల వెంకటేశ్వరరావు రాసిన పరిశోధన పత్రాల సంపుటి ‘పునర్మూల్యాంకనం‘ గ్రంథాన్ని హైదరాబాదు విశ్వవిద్యాలయం  వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్ గురువారం (8.12.2010 ) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమమంలో హ్యుమానిటీస్ డీన్ ఆచార్య రమణన్, ప్రొ.వైస్ ఛాన్సలర్ సారంగి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మొత్తం మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి గ్రంథం  ‘‘ ఉత్తరరామచరిత్రము ‘ వ్యాఖ్యానం, డా. అద్దంకి శ్రీనివాస్ 9 సంస్క్రత నాటకాల పరిచయం అనే గ్రంథాలను ఆవిష్కరించారు. ఆచార్య రామబ్రహ్మం గారు తన గ్రంథాన్ని వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్ గార్కి అంకితం చేశారు. 
 మాట్లాడు తున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్
 గ్రంథాన్ని అంకితం తీసుకుంటున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్
 ఢా. అద్దంకి శ్రీనివాస్ రచించిన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్
డా.దార్ల వెంకటేశ్వరరావు రాసిన పరిశోధన పత్రాల సంపుటి ‘పునర్మూల్యాంకనం‘ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్No comments: