అంటరాని వసంతం నవలా రచయిత జి. కళ్యాణరావు గారు ఈ నెల 8 ( 8-3-2010) మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ కి వచ్చారు. అల్లాడి ఉమ, ఎమ్. శ్రీధర్ గార్లు అనువదించిన ఆంగ్లానువాద పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చారు పుస్తకాన్ని ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు.
ఆ సందర్భంగానే మళ్ళీ ఆయనతో మాట్లాడాను.
ఆయన చాలా ప్రజాస్వామిక పద్ధతిలో నా విమర్శ వ్యాసాన్ని ఆహ్వానించారు.
దాని పరిధులు కూడా దానికి ఉన్నాయని అన్నారు.
మరో భాగం రాస్తున్నట్లు చెప్పారు.
ఆ నవలపై వచ్చిన విమర్శనంతా ఒక పుస్తకంగా తీసుకొస్తున్నట్లు చెప్పారు.
నవలపై నేను ప్రతిపాదించిన అంశాలను ఆయన కంటే, ఆ కులస్థులే తీవ్రంగా కలత చెందారు.
కానీ, ఆయన మాత్రం అంత తీవ్రంగా కలత చెందినట్లేమి కనిపించలేదు.
దాన్నొక stupid argument గా కొట్టిపడేయలేదు.
వ్యక్తిగతంగా ఫోన్లు చేసి తమ దండకాల్ని వినిపించలేదు.
ఆయనతో మళ్ళీ మాట్లాడినప్పుడు కూడా, అంతకుముందెలా మాట్లాడారో అంత ఆత్మీయంగానూ మట్లాడారు.
దటీజ్ జి.కళ్యాణరావు అనిపించింది.
1 కామెంట్:
I came to know about Dr. Darala's review on "Antarani Vasantam", and seen the same on this blog. But was unable to read the same due to my busy activity/ies. I have heard bitter comments against the review too.
But I am happy to know here how Mr. Kalyan Rao treated and received Dr. Darla. It's great. Others, who are campaining against Dr. Darla and are 'hurt', should observe the reaction of Mr. Kalyan Rao.
కామెంట్‌ను పోస్ట్ చేయండి