(దార్లవెంకటేశ్వరరావు (జ:5-9-1973) యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలుగు శాఖలో 2004 నుండి అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. అంతకు ముందు మూడేళ్ళ పాటు డిగ్రీకళాశాలలో లెక్చరర్‌గా పనిచేసిన ఈయన, తెలుగులో ఎం.ఏ., ( 1996), ఎం.ఫిల్,(1997), పిహెచ్.డి.,(2003) యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోను చేశారు. వీటితో ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎం.ఏ.,(2005) సోషియాలజీ, సంస్కృతంలో డిప్లొమా, 'తెలుగుభాష-బోధన'లో పి.జి.డిప్లొమా చేశారు. యు.జి.సి.వారి నెట్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ తో పాటు, రాష్ట్రప్రభుత్వం వారి 'స్లెట్'కూడా సాధించారు.
డా||యస్.టి.జ్ఞానానందకవి 'ఆమ్రపాలి' కావ్యంపై ఎం.ఫిల్, ఆరుద్ర రచనలపై డాక్టరేట్ చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో జరిగిన జాతీయ సదస్సుల్లో సుమారు 32 పరిశోధన పత్రాలను సమర్పించిన ఈయన, వివిధ పరిశోధన పత్రికల్లో సుమారు 25 పత్రాలను ప్రచురించారు. ఇప్పటి వరకూ ఒక కవితాసంపుటి 'దళితతాత్త్వికుడు' (2004), సృజనాత్మక రచనలు చేయడం ఎలా? (2005), సాహితీసులోచనం (2006), ఒక మాదిగస్మృతి (2007), దళితసాహిత్యం-మాదిగదృక్పథం (2008), వీచిక, (2009) పునర్మూల్యాంకనం (2010) ఆరు విమర్శ, పరిశోధనలకు సంబంధించిన పుస్తకాలను ప్రచురించారు. వీరి కవితలు,వ్యాసాలు ప్రముఖ పత్రికల్లోను, తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, ద్రావిడ విశవ్వవిద్యాలయం వారి పరిశోధన పత్రికల్లోను, వివిధ ప్రత్యేక సంచికలు, సంకలనాల్లోను ప్రచురితమైయ్యాయి.
2007సంవత్సరంలో భారతీయ దళిత సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) వారి డా||బి.ఆర్.అంబేద్కర్ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం''తెలుగుసాహిత్యంలో మాదిగల సాహిత్య ,సాంస్కృతిక జీవన ప్రతిఫలనం'' గురించి యు.జి.సి. మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టు చేస్తున్నారు. త్వరలో వీరి కవిత్వ అనువాదం ఆంగ్ల , కన్నడ భాషలలో రాబోతుంది. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో 2005 లో ఎం.ఏ.స్థాయిలో ''దళితసాహిత్యం'' ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి, దానితో పాటు తెలుగు సాహిత్య విమర్శ, ఆధునిక సాహిత్యం బోధిస్తున్నారు.ఈయన చిరునామా: తెలుగు శాఖ,యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 046. ఆంధ్రప్రదేశ్, ఇండియా. మొబైల్: 09989628049. ఇ-మెయిల్: vrdarla@gmail.com )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి