Saturday, December 05, 2009

ఆంబేద్కర్ ఆశయ సాధనే ఆయనకిచ్చే నిజమైన నివాలి!


భారతరాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ 53 వ వర్థంతి సందర్భంగా 06-12-2009 ఉదయం యూనివర్సిటీ ఆవరణంలోని షాపింగ్ కాంపెల్క్స్ దగ్గర హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఇన్ చార్జ్ వైస్ చాన్స్ లర్ ఆచార్య ప్రకాశ్ సి. సారంగి, రిజిస్ట్రార్ ఆచార్య సి.పి.మోహన్ కుమార్, ఢీన్, స్టూడెంట్స్ వెల్పేర్ ఆచార్య బి. రాజశేఖర్, డా. తిరుమల్, ఆచార్య ప్రకాశరావు, ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా. దార్ల వెంకటేశ్వరరావు, డా. జి.నాగరాజు, అసిస్టెంట్ లైబ్రరీయన్ డా రవి, విద్యార్థి నాయకులు ఉల్లి ధనరాజ్ , సిలివేరు హరినాథ్, మల్లికార్జున్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనివర్సిటీలోని లైబ్రరీ, డా.అంబేద్కర్ ఆడిటోరియం,. అడ్మినిస్ట్రేషన్ భవన్, ఎస్.సి., ఎస్.టి వెల్ఫెర్ భవన్, హాస్టల్స్ లలో గల డా.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డా.అంబేద్కర్ భావాలను వివరించారు. ఆయన సిద్ధాంతాలు నేటికీ అనుసరణీయాలని కొనియాడారు. ఆయన ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చేనివాళి అని అన్నారు.


అంబేద్కర్ కి నివాళులు అర్పించి సందేశం ఇస్తున్న ఇన్ చార్జ్ వైస్ చాన్సలర్ ఆచార్య ప్రకాశ్ సి. సారంగి

అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలాలంకరణ చేస్తున్న అంబేద్కర్ అసోసియేషన్ నాయకుడు ఉల్లి ధనరాజ్, సోషియాలజీ లెక్చరర్ డా. జి.నాగరాజుమాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావు


మాట్లాడుతున్న డా. నాగరాజుమాట్లాడుతున్న యూనివర్సిటీ రిజిస్టార్ మోహన్ కుమార్


No comments: