Thursday, September 17, 2009

తెలుగు సాహిత్య విమర్శ- నేటి ధోరణులు జాతీయ సదస్సు ప్రారంభం!

హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ ఆధ్వర్యంలో గురువారం ( 17-9-2009) ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా ఆచార్య కొలకలూరి ఇనాక్ పాల్గొన్నారు. సభను ఆచార్య మోహన్ జి. రమణన్ ప్రారంభించారు. సభకు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అధ్యక్షత వహించారు. సభ కు ఆచార్య తుమ్మల రామకృష్ణ స్వాగతం పలుకగా డా. పిల్లలమర్రి రాములు వందన సమర్పణ చేశారు. తర్వాత ఆచార్య ఎండ్లూరిసుధాకర్, ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా. నిత్యానందరావు తదితరులు పత్రాలను సమర్పింఛారు. పూర్తి సమాచారాన్ని కార్యక్రమం అయిన తర్వాత నివేదించడానికి ప్రయత్నిస్తాను...దార్ల


No comments: