"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

30 August, 2009

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సమంజసం కాదా? - చర్చించండి!

("ఎస్సీ హోదా రాజ్యాంగ విరుద్ధం " పేరుతో ఆంధ్రజ్యోతి పత్రికలో 30-9-2009 న ఒక వ్యాసం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసన సభ దళిత క్రైస్తవులను షెడ్యూల్డు కులాలుగా గుర్తిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో ఈ విషయం పై తీవ్రమైన చర్చ జరుగుతుంది. జరగ వలసిన చర్చకూడా! దీనిలో భాగంగా ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో ఆ వ్యాసాన్ని ఇక్కడ పునర్ముద్రిస్తూ చర్చకు ఈ రంగంలో ఆసక్తి గలవారిని చర్చకు ఆహ్వానిస్తున్నాను. ...దార్ల)

క్రైస్తవ, ముస్లింలు ఏనాడు తాము దళితులుగా అంగీకరించలేదు. పైగా దళితుల కోసం పోరాటం చేస్తున్న అంబేద్కర్‌కు మద్దతు ఇవ్వకుండా తాము అసలు దళితులమే కాదు అన్న వీరు నేడు రిజర్వేషన్ల రుచికి మరిగి తప్పుడు సరిఫికెట్లతో 80శాతం ఎస్సీ రిజర్వేషన్లను అనుభవిస్తూ అసలైన దళితులు అనుభవిస్తున్న ఆ కాస్త 20 శాతాన్ని కొట్టివేయడానికి కుట్రపన్నుతున్నారు.

దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగా గుర్తిస్తూ రాష్ట్ర శాసన సభ మం గళవారం తీర్మానించడం దాన్ని బలపరుస్తూ తెలుగుదేశం, ప్రజారాజ్యం, తెరాస, సిపిఎం మద్దతు తెలపడం రాజ్యాంగ నియమావళికి విరుద్ధం. రిజర్వేషన్ల రాజకీయాల ఉచ్చులో మాల, మాదిగలతో పాటు దళిత క్రైస్తవులను కూడా చేర్చి తన్నుకు చావండి అంటూ వైఎస్ వేసిన రాజకీయ ఎత్తుగడలకు ఇతర ప్రతిపక్షాలు మద్దతు తెలపడం వారి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం. ఎందుకంటే రాజ్యాంగం చాలా స్పష్టంగా హిందుమతంలో భాగం కాని దళితులకు రిజర్వేషన్లను తిరస్కరించింది.

హిందుమతంలో భాగమైన సిక్కు, జైన, బౌద్ధ మత దళితుల కు రిజర్వేషన్లు వర్తిస్తాయనీ, క్రైస్తవ, ఇస్లాం మతం మారిన దళితులు షెడ్యూల్డు కులాల్లో భాగం కాదు అనీ భారత ప్రభుత్వ చట్టం 1935, భారత రాజ్యాంగ చట్టం 1950 పేరా 3 పేర్కొంటున్నాయి. భారత రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా భారత సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాలలో మతం మార్చుకున్న ముస్లిం, క్రైస్తవులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి వీల్లేదని స్పష్టం చేసినా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కేంద్రంలోని యు.పి.ఎ. ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిం చి వారికి దళితుల 15 శాతం రిజర్వేషన్‌లోనే వాటా కల్పించాలని ప్రయత్నించడం రాజ్యాంగ వ్యతిరేకం. భారత రాజ్యాంగ పిత అంబేద్కర్ జీవితాంతం హిందుమత విధానానికి బలైన అంటరాని కులాల కోసం రిజర్వేషన్ కల్పిస్తే, సోనియా గాంధీ కనుసన్నలలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి సవరణలకు పూనుకుంటున్నది.

దళిత క్రైస్తవులు కొంత కాలంగా రాజ్యాంగ చట్టం 1950లోని 3వ పేరాను సవరించాలని చేస్తున్న డిమాండ్‌ను అంగీకరిం చి దళిత క్రైస్తవ, ముస్లింలను కూడా ఎస్సీలుగా గుర్తిస్తే అంబేద్కర్ ప్రతిపాదించిన రిజర్వేషన్ల ఆశయానికే అర్థం లేకుండా పోతుంది. పి.వి. ప్రధానిగా ఉన్నప్పుడు దళిత క్రైస్తవులకు షెడ్యూల్డు కులాల పరిధిలో రిజర్వేషన్లు ఉండాలని ఒక బిల్లు తయారైంది.

నాటి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అయిన హనుమంత ప్ప ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు ఏకగ్రీవంగా నివేదిక ఇచ్చారు. దీంతో ప్రభుత్వ బిల్లు ప్రతిపాదనను విరమించుకుంది. అయితే సోనియా చెప్పుచేతలలోని ప్రభుత్వం జాతీయ భాషాపరమైన మైనారిటీ కమిషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి రాజ్యసభ సభ్యుడు అయిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా నేతృత్వంలో నివేదికను తమకు అనుకూలంగా ఇప్పించుకుంది.

వ్యక్తులు మారితే అధికార పక్షం మారితే రాజ్యాం గ బద్ధమైన కమిషన్ నివేదికలు మారతాయా? ఈ నివేదిక ఆధారంగా ప్రధాని మన్మోహన్ దళిత క్రైస్తవులకు, ముస్లింలకు ఎస్సీ కోటాలో రిజర్వేషన్ ఇవ్వడానికి తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. ఇక్కడ వైఎస్ ఇందుకు పూనుకున్నారు. కాలేకర్ కమిషన్ మొదలుకొని మండల్ కమిషన్ వరకు అన్నీ దళిత క్రైస్తవులకు బిసి జాబితాలో రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించాయి. వారి సిఫారసుల ఆధారంగానే బిసి(సి) కోటాలో ఒకశాతం రిజర్వేషన్లను క్రైస్తవులు అనుభవిస్తున్నారు. ఇవికాక క్రైస్తవ మైనారిటీలు రాజ్యాంగ పరం గా అనేక రాయితీలు పొందుతున్నారు. విదేశాల నుంచి క్రైస్తవ మతం పేరున వచ్చే కోట్లాది రూపాయలు వీరి అభివృద్ధి కోసమే కేటాయిస్తున్నా రు.

ఎంతో మంది దళిత క్రైస్తవులు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు తీసుకుని షెడ్యూల్డు కులాలకు చెందాల్సిన రిజర్వేషన్లను అక్రమంగా పొందుతున్నారు. ఎస్సీల పేర ఉద్యోగాలు సంపాదించిన అధికారులు, పదవులు అనుభవిస్తున్న నాయకులు చాలా మంది దళిత క్రైస్తవులే. షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లలో 20 శాతం మాత్రమే అనుభవిస్తు న్న నిజమైన హిందు దళితులకు ఆ కాస్తా రిజర్వేషన్ దక్కకుండా చేయడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. నిజంగా దళిత క్రైస్తవులకు చిత్తశుద్ధి ఉంటే బి.సి. (సి) కోటాను పెంచి వారిని ఆదుకోవాలి. ముస్లిం, క్రైస్తవ సమాజాల్లో కులవ్యవస్థ లేదు. షెడ్యూ ల్డ్ తెగలు లేవు. హిందువుల్లో మాత్రమే షెడ్యూల్డ్ కులాలు, తెగలు ఉన్నాయి. మతపరమైన కట్టుబాట్ల కారణంగా హిందువులు అంటరానితనాన్ని పాటిస్తున్నారు.

హిందువు ఎవరైనా ఇస్లాం, క్రైస్తవం స్వీకరిస్తే అతను సహజంగా తమ కులాన్ని కూడా కోల్పోతా డు. దళిత క్రైస్తవులకు ఎస్సీలతో సమానంగా రిజర్వేషన్లు కావాలని కోరే క్రైస్తవ నాయకులు భారతీయ క్రైస్తవంలో సహోదరత్వం లేదనీ, క్రైస్తవం కులవివక్షను తొలగించలేకపోయిందని బహిరంగంగా అంగీకరిస్తారా? క్రైస్తవులు-దళిత క్రైస్తవుల మధ్య సామాజిక వివక్షలేదు. ఒకవేళ ఎక్కడన్నా ఉంటే వారు క్రైస్తవ వ్యవస్థలోని ఆ రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడాలి.

ఈ పోరాటం చేయకుండా దళితుల రిజర్వేషన్ల హక్కులలో వాటా లు కోరడం, వాటిని హరించబూనటం ఎంతవరకు సబబు? హిందూ సమాజం వలె క్రైస్తవంలో సామాజిక సంస్కరణలకు ఆయా మతాల పెద్దలు తయారుగా ఉన్నారా? ఆ పని చేయకుండా తమను కూడా ఎస్సీ రిజర్వేష్లను వర్తింపచేయాలని కోరడం సమంజసమా? ఇండియా కాన్షరెన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ సంస్థ వారు 1928లో (నవంబర్ 26న) సైమన్ కమిషన్ ముందు 'క్రైస్తవ సమాజంలో భారతీయ క్రైస్తవు లు, నిమ్మ వర్గాలు అంటూ వేరు వేరు వర్గాలేమీ లేవు' అని తమ వాదనలను వినిపించారు.

1931 జనాభా లెక్కల కమిషనర్ జె.ఎస్.హట్టన్ ప్రకారం-క్రైస్తవ మతం తీసుకున్న దళితులు అంటరాని వారు కారు. వీరు 1940 నాటి జనాభా లెక్కల కమిషనర్ ముందు 'భారతీయ క్రైస్తవ సమాజంలో కుల వ్యవస్థ లేదు. నిమ్న వర్గాలంటూ ప్రత్యేకంగా క్రైస్తవ మతంలో ఎవరూ లేరు. కనుక మేము అంబేడ్కర్ కోరుతున్న ప్రత్యేక నియోజక వర్గాలను, కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తున్నాము. మాది ఏకరూప సమాజం' అని తెలిపా రు. రాజ్యాంగ సభలో మతపరమైన రిజర్వేషన్ల విషయం కూడా చర్చకు వచ్చింది.

తుది నిర్ణయంగా మతపరంగా రిజర్వేషన్ల ను ఎవరికీ ఇవ్వరాదని నిర్ణయమైంది. రాజ్యాంగ సభ లో రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్నప్పుడు క్రైస్తవ సభ్యులు తమ మతంలో కుల వ్యవస్థ, అస్పృశ్యత లేదు కనుక రిజర్వేషన్లు అవసరం లేదన్నారు. ఈ క్రైస్తవ, ముస్లింలు ఏనాడు తాము దళితులుగా అంగీకరించలేదు. పైగా దళితుల కోసం పోరాటం చేస్తున్న అంబేద్కర్‌కు మద్దతు ఇవ్వకుండా తాము అసలు దళితులమే కాదు అన్న వీరు నేడు రిజర్వేషన్ల రుచికి మరిగి తప్పుడు సరిఫికెట్లతో 80శాతం ఎస్సీ రిజర్వేషన్లను అనుభవిస్తూ అసలైన దళితులు అనుభవిస్తున్న ఆ కాస్త 20 శాతాన్ని కొట్టివేయడానికి కుట్రపన్నుతున్నారు.ఈకుట్రను భగ్నం చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న మూల వాసులైన అది హిందూ దళితులు ఉపకులాలకు అతీతంగా ఉద్యమించడం ఒక్కటే పరిష్కారం.

-డా. గాలి వినోద్‌కుమార్
(వ్యాసకర్త ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర అధ్యాపకులు)





















Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

15 comments:

Praveen Mandangi said...

మతాధారిత రిజర్వేషన్లని వ్యతిరేకించే న్యాయశాస్త్ర ప్రొఫెసర్ ని చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. I am an atheist, not a hindu. Religion based reservations disgusts most of the people including atheists.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

హిందువు ఎవరైనా ఇస్లాం, క్రైస్తవం స్వీకరిస్తే అతను సహజంగా తమ కులాన్ని కూడా కోల్పోతా డు. దళిత క్రైస్తవులకు ఎస్సీలతో సమానంగా రిజర్వేషన్లు కావాలని కోరే క్రైస్తవ నాయకులు భారతీయ క్రైస్తవంలో సహోదరత్వం లేదనీ, క్రైస్తవం కులవివక్షను తొలగించలేకపోయిందని బహిరంగంగా అంగీకరిస్తారా?
===========
ఈ ప్రశ్న బ్లాగుల్లో ఈపాటికే చాలామంది వేశారు. ఇంతవరకూ సమాధానమే లేదు. ఇదంతా 'దళితవాదాన్ని' అడ్డం పెట్టుకొని హిందువులను, హిందూ మతాన్ని చిన్నబుచ్చాలని చేసే రాజకీయ కుతంత్రం.

Kathi Mahesh Kumar said...

1931 నాటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికీ చాలా తేడా ఉందని గుర్తించాలి.

కారణాలు ఏవైనా గత రెండు దశాబ్ధాలుగా పెద్ద స్థాయిలో దళితులు క్రైస్తవానికి తరలివెళ్ళారు. మతం మారినా వివక్షమాత్రం అలాగే ఉంది. పైగా క్రైస్తవంలోకి అప్పటికే మారిన కొంతమంది అగ్రవర్ణాల వారూ అక్కడా వివక్షను అమలుచేస్తున్నారు. అంటే మతం మారినా కులంరంగుమాత్రం అట్లాగే ఉంది. ఈ పరిస్థితుల్లో కొంత అధ్యయనం అత్యవసరం. అది జరక్కుండా కేవలం రాజకీయ కారణాలవల్ల రిజర్వేషన్ ఇవ్వాలనో లేక ఇవ్వకూడదనో వాదించడం రెండూ అసమంజసం.

తాడేపల్లి said...

దళిత క్రైస్తవులకి రిజర్వెషన్ ఇవ్వడాన్ని నేను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నాను. దీని పరిణామాలు చాలా చాలా దూరం వెళ్ళబోతున్నాయి. ఆ అనుభవాలు సమాజానికి భవిష్యత్తులో చాలా చేదుగా ఉండబోతాయి. క్రైస్తవులుగా మారిన దళితులు ప్రస్తుతం దొడ్డిదారిలో రిజర్వేషన్లు అనుభవించడమూ, అందుకోసం గేట్లని బహిరంగంగా బార్లా తెరవడమూ ఈ రెండూ ఒకటి కాదు.

ఇది ప్రస్తుతం ఉన్న కులాల సంఖ్యని భవిష్యత్తులో రెట్టింపు చేస్తుంది. బ్రాహ్మణులు - క్రైస్తవబ్రాహ్మణులు, రెడ్లు - క్రైస్తవ రెడ్లు మొ||

Praveen Mandangi said...

ఓ పేపర్ లో వ్రాసిన దాని ప్రకారం దళిత క్రైస్తవులలో ఎక్కువ మంది మాల కులస్తులు. ఇతర దళిత కులాలలో మతం మారిన వాళ్ళు తక్కువ. అదే నిజమైతే క్రైస్తవ రిజర్వేషన్ ప్రతిపాదన మాస్ గా మత మార్పిడులకి ద్వారాలు తెరవడానికే అనుకోవాలి.

రవి said...

స్వాతంత్ర్యం తర్వాత అంబేద్కర్ సూచించిన రిజర్వేషన్లు ఐదేళ్ళవరకు మాత్రమే. ఆ తర్వాత ఇన్నేళ్ళు అయినా, రిజర్వేషన్ అమలు విధానం అత్యంత లోపభూయిష్టంగా ఉంది. రిజర్వేషన్ అమలు విధానాన్నే ప్రక్షాళణ చేయవలసిన అవసరం ఉన్న తరుణంలో స్వార్థ రాజకీయ నాయకులు అమలు పరుస్తున్న వికృత నీతులు ఇవి. రేప్పొద్దున మహమ్మదీయులు అంటారు, మహమ్మదీయ దళితులకు రిజర్వేషన్లు కల్పించమని. అది మొదలయితే అసలు ఊహించని పరిణామాలు సంవించటం తథ్యం.ఈ దేశం నాశనమవుతుంది. ఇంకా బౌద్ధులు, పార్శీలు, సిక్కులు, జైనులు...అందరికీ ఇదొక సాకు అవుతుంది. కనుక ఈ క్రైస్తవ రిజర్వేషన్లు నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నాను.

Praveen Mandangi said...

అక్బరుద్దీన్ ఒవైసీ ఇది వరకే డిమాండ్ చేశాడు, ముస్లిం దళితులకి కూడా రిజర్వేషన్లు కల్పించాలని. అక్బరుద్దీన్ వాళ్ళ అన్న అసదుద్దీన్ ముస్లింలలో కులాలు లేవని ఓ సారి అన్నాడు. తమ్ముడు మాత్రం ముస్లింలలో కులాలు ఉన్నాయని ఒప్పుకున్నాడు. క్రైస్తవ, ఇస్లాం మతాలు కూడా మనుషుల మధ్య సమానత్వం ఇవ్వలేవని సూడో సెక్యులరిస్టులందరూ ఒప్పుకుంటారా?

Praveen Mandangi said...

మతాధారిత రిజర్వేషన్లని అట్టహాసం చేస్తూ ఒక వీడియో రూపొందించాను చూడండి http://www.youtube.com/watch?v=DZ1Wz9BQZ44

Raj said...

Hi All,
Please understand that Dalit Christians are already under Reservation Umbrella(BC-C category with 1% reservation). Now the question is allowing these dalit christians to be eligible to use reservation in SC categorty.

Even Loksatta JP is also highlighting the same point. His point is that if there are more number of Dalit Christians now and if this 1% reservation is not enough, depending on their population BC-C % should be increased and at the same SC 15% reservation should be decreased proportionately.

General assumption is Dalit Christians are a bit advanced compared to Dalit Hindus and if Govt recognizes Dalit Christians as SCs, then they will completely benifit from the SC reservations which will create another issue among Dalits.

I would strongly condemn the move.

Naresh

Kathi Mahesh Kumar said...

హిందుత్వవాదులు ఈ సమస్యని ఒక రాజ్యాంగాన్ని interpret చేసే సమస్యగా కాకుండా, మతపరమైన సమస్య చేసిపారేశారు. దీంతో అసలు చర్చ చాలా చోట్ల తప్పుదోవపడుతోంది.

మాల-మాదిగల పోరాటం advantage ఉన్న మాలలు ఎక్కువశాతం రిజర్వేషన్ లాభాలు పొందుతున్నారని. సంఖ్యాపరంగా ఎక్కువున్నప్పటికీ మాదిగలు ఆ సౌలభ్యాన్ని అందిపుచ్చుకోలేకున్నారని. దళితక్రైస్తవులకు రిజర్వేషన్ కల్పిస్తే మళ్ళీ అదే జరుగుతుంది. కాన్వెంట్ చదువులు,ఆర్థికపరమైన బలిమి కలిగిన దళితక్రైస్తవులు రిజర్వేషన్లో సింహభాగాన్ని ఎగేసుకెళ్తే నష్టపోయేది మాల-మాదిగలే.

Praveen Mandangi said...

ఎంతైనా అగ్రకుల రాజకీయ నాయకులు కదా, దళితుల మధ్య చీలిక తేవడానికి ఎంతకైనా తెగిస్తారు.

Unknown said...

మొదటగా ఒక మాట! దళిత క్రైస్తవులు అంటే ఎవరు? మాలా మాదిగలు. వీరికి ఎస్.సి. రిజర్వేషన్స్ కల్పించాలా వద్దా అనేది ప్రస్తుతానికి పక్కన పెడితే మొదట మనం వారి కులం గురించి చర్చిద్దాం. వీరు హిందూ మతంలో వున్నా, సిక్కు మతంలో వున్నా, బౌద్ధ మతంలో వున్నా ఎక్కడ ఉన్నప్పటికీ వీరు కులపరంగా మాలా మాదిగలే. అందులో ఎవరికి ఏరకమైన అనుమానం ఉండాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక మనిషి బ్లడ్ గ్రూప్ మార్చడానికి ఎవరికి వీలుకాదు అలాగే ఒక మనిషి జన్మించిన కులం గాని , తెగ గాని, జాతి గాని మార్చడానికి వీలుకాదు. కనుక మొదట మనం తెలుసుకోవలసింది ఏంటంటే దళిత క్రైస్తవులంటే మాలా మాదిగలు.

ఇక పోతే... వీరు మతం మారిన కారణం తెలుసుకుందాం. ఎస్.సి.లను ప్రలోభాలకు గురిచేసి అంటే క్రైస్తవ మిషనరీలు డబ్బు ఎరగా చూపి లేక బర్రెలు , గొర్రెలు , గోధుమలు , బట్టలు ఎరగా చూపి దళితులను క్రైస్తవ మతంలోకిలాగారు అంటున్నారు. ఒక మాట చదువరులు గమనించాలి. ఏంటంటే... దళితులు నాడు - నేడు కష్ట జీవులు, ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని అమాయకులుకాదు, ముఖ్యంగా డబ్బులకు ఇతర ప్రలోబాలకు తమ ఆత్మగౌరవాన్ని అమ్ముకునే నీచ స్థితిలో వాళ్ళు లేరు. చచ్చిన కళేబరాన్ని చర్మం వొలిచి చెప్పులు కుట్టిన చారిత్రక శాస్త్రజ్ఞులు, అలాంటి వారు ఎవరో వచ్చి ఏదో చెబితే గుడ్డిగా నమ్మే అలగా జనం కాదు.మోసంతో వచ్చే సొమ్ముపై దళితులకు ఏనాడు ఆశలేదు. కష్టించి పనిచేయడమే వారికి తెలుసు. మిషనరీలు చేసిన సేవ సామాజిక సేవలో భాగమే గాని అందులో ఏ దురుద్దేశం లేదు. దళితులు ప్రలోబాలకు లొంగి క్రైస్తవ మతం తీసుకున్నారని ఎవరైనా అంటే వారు ఈ ప్రపంచంలో హిట్లర్ కంటే పెద్ద అబద్ధికుడు, పచ్చి మోసగాడు అని అర్ధం. ఎందుకంటే దళితులు ఎంత జ్ఞానవంతులో అంబేద్కర్ గారు రాజ్యంగ రచనతో నిరూపించాడు. దళితులు క్రైస్తవ మతాన్ని నచ్చి, అందులోని సుగుణాలను మెచ్చి మతం మారారు. క్రైస్తవ్యం దళితులకు సమానత్వాన్ని ఇచ్చింది, చర్చి లో అందరూ సమానులే. ముఖ్యంగా భారతదేశంలో నూటికి తొంబై తొమ్మిది శాతం చర్చి లలో పీటాదిపతులు దళితులే. ఇది దళితులకు ఎంత గొప్ప ఆధిక్యత , ఎంత గౌరవం. వేల సంవత్సరాలుగా బానిసలుగా వున్న ప్రజలకు పీటాదిపతి స్థానం దళితులకు కలిగిన గొప్పవరం, క్రైస్తవ్యం కాకుండా హిందూ మతంలో ఎన్ని తరాలు గడిచినా , ఎన్ని యుగాలు గడిచినా ఇది సాధ్యమా? గుడిలోకే ప్రవేశంలేని మేము గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం మా దళితులకు వుందా? సమాధానం చెప్పండి. క్రైస్తవులు గౌరవప్రదమైన జీవితం కొరకు క్రైస్తవ మతంలోకి వెళ్తారు.ఎందుకంటే అక్కడ ప్రేమ వుంది, ఆదరణ వుంది,మానవత్వం వుంది, మాకు కావలసిన సమానత్వం వుంది. అంతేకాకుండా అంబేద్కర్ గారు హిందూ మతంలోనుండి వేరే మతాలలోకి వెళ్ళమని పిలుపునిచ్చారు. ఆయన బౌద్ధ మతంలోకి వెళ్ళారు. నిజంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుకన్న జీవితాన్ని దళితులు క్రైస్తవ మతంతో నెరవేరుస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవ మతం తీసుకున్న దళితులు బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా, దేశ సేవకులుగా, పరోపకారులుగా, సేవాతత్పరులుగా, శుభ్రతకలిగినవారుగా, శాంతికాముకులుగా జీవిస్తున్నారు. ఆయన కోరికను నిజం చేస్తున్నారు.

ఇక దళిత క్రైస్తవులకు ఎస్.సి. హోదా విషయం చర్చిద్దాం. ఇందులో పెద్దగా లాజిక్ లు వెతకాల్సిన పనిలేదు. ఎందుకంటే పైన మనం చర్చించుకున్నట్టుగా దళిత క్రైస్తవులంటే ఎవరో కాదు వారంతా మాలా మాదిగలే. రిజర్వేషన్లు కులానికి కల్పించారు కాని మతానికి కల్పించలేదు కనుక మాలా మాదిగలైన దళిత క్రైస్తవులు రిజర్వేషన్స్ కు పూర్తిగా అర్హులు.
కొందరు దళిత క్రైస్తవ సమస్యను మత కోణంలో చూస్తున్నారు.అది తప్పు. ఎందుకంటే రిజర్వేషన్లు ఎస్.సి.,ఎస్.టి. లకు మతంతో గాని, ప్రాంతం తో గాని,లింగ బేధం గాని చూపకుండా అమలు చేయాలి అని రాజ్యాంగం చెపుతుంది. రాజ్యాంగ విరుద్ధంగా దళితులను మతం పేరుతో చీల్చే కుట్రలు ఇకనైనా ఆపి పాలకులు న్యాయం దిశగా ఆలోచన చేయాలి.

Unknown said...

దళిత క్రైస్తవులకు ఎస్.సి. హాదా కల్పించాలి

Unknown said...

సిక్కు, జైన, బౌద్ధ మతాలు హిందుమతంలో భాగమని అందుకే ఆ మతాలలోని డళితులకు రిజర్వేషన్లు వర్తిస్తాయనీ, క్రైస్తవ, ఇస్లాం మతం మారిన దళితులు షెడ్యూల్డు కులాల్లో భాగం కాదు అనీ భారత ప్రభుత్వ చట్టం 1935, భారత రాజ్యాంగ చట్టం 1950 పేరా 3 పేర్కొంటున్నాయని అలాగే భారత రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా మతం మార్చుకున్న ముస్లిం, క్రైస్తవులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి వీల్లేదని భారత సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాలలో స్పష్టం చేసిందని న్యాయశాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ గాలి వినోద్ కుమార్ గారు అన్యాయంగా గాలి వార్తలు వ్రాసారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగంలో హిందుమతం లో వున్న షెడ్యూల్డు కులాలకు మాత్రమే రిజర్వేషన్లు అని ఎక్కడా చెప్పలేదు. ఒకవేలా బాబాసాహెబ్ అలా రాజ్యాంగలో వ్రాసినా, పోనీ వారి రచనలలో ఎక్కడైనా పేర్కొన్నా అది మాకు సమ్మతమే. దానిని శ్రీ గాలి గారు రుజువుచేయగాలరా? షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు మతంతో గాని, ప్రాంతంతో గాని, లింగ భేదం అంటే ఆడా, మగ అనేతేడా గాని చూపకుండా రాజ్యాంగ అవకాశాలు అందరికి సమానంగా వర్తింపచేయాలని బాబాసాహెబ్ డా. అంబేద్కర్ గారు సూచించారు. డా.అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగాని విరుద్ధంగా రాష్ట్రపతి ఉత్తర్వు (షెడ్యూల్డు కులములు) 1950 లోని 3వ పేరా వచ్చిందనేది అందరు గమనించాలి. మొదటి రాజ్యాంగ ఉల్లంగన ఇదే. షెడ్యూల్డు కులాలకు మత స్వేఛ్చ ను తీసివేసి బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాగానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వు (షెడ్యూల్డు కులములు) 1950 లోని 3వ పేరా తెచ్చారు. తద్వారా బౌద్ధమతం మారిని రాజ్యంగ నిర్మాత డా.అంబేద్కర్ గారే తన ఎస్.సి. హోదాను కోల్పోయారు.
ఇక సిక్కు,జైన,బౌద్ధ మతాలు హిందూమతoలోని అంతర్భాగాలు అని శ్రీ గాలి గారు చెప్పారు, ఈ మాట ఆ మతాలలోని పెద్దలతో చెప్పించగలరా? హిందూమతానికి వ్యతిరేఖంగా ఈ మతాలన్ని పుట్టిన విషయం న్యాయశాస్త్ర పట్టభద్రుడికి తెలియక పోవడం విచిత్రం. అసలు రాష్ట్రపతి ఉత్తర్వు (షెడ్యూల్డు కులములు) 1950 లోని 3వ పేరా ఏమి చెప్తుందో చూద్దాం.... "షెడ్యూల్డు కులాల వారు రాజ్యాంగం తమకిచ్చిన హక్కులు, ప్రయోజనములు పొందుకోవాలంటే తప్పనిసరిగా వారు హిందూమత విశ్వసాలు పాటించాలి." మరి హిందూమతమoలో అంతర్భాగాలైన సిక్కు, జైన, బౌద్ధ మతాలను రాష్ట్రపతి ఉత్తర్వులో నాడు ఎందుకు విస్మరించారో శ్రీ గాలి గారే సెలవివ్వాలి. ఆ తరువాత సిక్కు మతంలోని దళితులు పోరాటాలు చేస్తే 1956 లో రాష్ట్రపతి ఉత్తర్వు (షెడ్యూల్డు కులములు) 1950 లోని 3వ పేరాను సవరించి సిక్కుమతంలోని దళితులకు ఎస్.సి. హోదా కల్పించారు. ఆరు సంవత్సరాలు సిక్కు మత దళితులు ఎస్.సి. హోదా కోల్పోయారు. ఇక బౌద్ధ మతంలోని దళితులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయగా చేయగా శ్రీ వి.పి.సింగ్ గారు ప్రధానమంత్రి గా వున్నప్పుడు 1990 వ సంవత్సరంలో బౌద్ధమతంలోని దళితులకు ఎస్.సి. హోదా కల్పించారు. అంటే 40 సంవత్సరాలు బౌద్ధమతంలోని దళితులు ఎస్.సి. హోదా కోల్పోయారు. ఇక నేటికి జైన మత దళితులకు ఎస్.సి. హోదాలేదు. మరి న్యాయశాస్త్ర పట్టభద్రులైన శ్రీ గాలి గారు ఇన్ని అబద్ధాలు ఎందుకు పలికారో వారికే తెలియాలి.
భారత అత్యున్నత న్యాయస్థానం ఏనాడు మతం మారిన దళితులకు రిజర్వేషన్లు వద్దని చెప్పలేదు. ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. "మనిషి ఎన్ని మతాలైనా మారోచ్చుగాని కులం మాత్రం మారదని".
రాజ్యాంగం ప్రసాదించే హక్కులను దళితులకు మతం పేరుతో దూరం చేసిన పాలకులు నేటికైన కళ్ళు తెరిచి రాష్ట్రపతి ఉత్తర్వు (షెడ్యూల్డు కులములు) 1950 లోని 3వ పేరా తొలగించి న్యాయం చేయాలి.

Juda Lion Tribe said...

🖎Christian Ambassador గారు మీరు చెప్పింది నూటికి కి వెయ్యి శాతం నిజం👍మీకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను _/\_