రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

'వీచిక' గ్రంథావిష్కరణ, అంకితోత్సవ సభ ( 14-8-2009)
డా. దార్ల వెంకటేశ్వరరావు రాసిన సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి " వీచిక" గ్రంథావిష్కరణ, అంకితోత్సవ సభను 14-8-2009 న హైదరాబాదు విశ్వవిద్యాలయం, డా. అంబేద్కర్ ఆడిటోరియం లో సాయంత్రం 3-30 నిమషాలకు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు, ప్రముఖ కవి, ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు ఆవిష్కరిస్తారు. హైదరాబాదు విశ్వ విద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు, ప్రముఖ కవి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు సభాధ్యక్షులుగా వ్య వహరిస్తారు. సభలో అతిథులుగా డా. ద్వానాశాస్త్రి, డా. జి. అరుణకుమారి తదితరులు పాల్గొంటారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య పరిమి రామనరసింహం గార్కి ఈ పుస్తకాన్ని అంకితం చే స్తున్నారు. సహృదయ సాహితీ వేత్తలందరికీ ఇదే మా ఆహ్వానం.
----వీచిక పుస్తకావిష్కరణ కమిటి.

1 comment:

సురేష్ కుమార్ దిగుమర్థి said...

ప్రియమైన దార్లగారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. తెలుగు సాహిత్యంలో మీరు కృషి, ప్రయోగాలు, మీరు కొనసాగిస్తున్న అస్తిత్వ సాహిత్యం, భవిశ్యత్తులో మరింత ముందుకు దూసుకు పోవాలని, ప్రేమతో ఆకాంక్షిస్తూ...
మీ
సహోదరుడు.