29 June, 2009

సూర్య(28-6-2009)లో దళితతాత్త్వికుడు సమీక్షదళిత కవిత్వాన్ని కేవలం అనుభవాల, ఆ త్మన్యూనతా భావాల వ్యక్తీకరణగా కుదించే ప్రయత్నం చేసిన అగ్రకుల సాహితీ వేత్తల కుహకత్వాన్ని ప్రశ్నించి ఆర్థిక నియతి వాద అసమగ్రతని బద్దలు కొట్టి తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపు కుదిపింది దళిత కవిత్వం. దళితుల ఆశలకీ, ఆకాంక్షలకీ, ఆవేదనకీ, ఆక్రోశానికీ, ఆగ్రహానికీ, ఆత్మగౌరవానికీ ప్రతి రూ పంగా నిలిచిన దళిత కవిత్వం కొత్త చూపుతో, కొత్త వ్యక్తీకరణతో బలంగా వస్తోంది. ఈ కోవ లో వచ్చి దళిత సాహిత్యంలో కనిపించే బలమై న తాత్విక భూమికను విశదీకరించే కవితల సంపుటి ‘దళిత తాత్వికుడు’. డా దార్ల వెంకటేశ్వర రావు ఈ కవితలన్నీ అప్పుడప్పుడూ రాసి నా, దళిత తాత్త్విక భూమికను ఒకేచోట చూపడంలో ఏకసూత్రత కనిపిస్తుంది.ఈ కవితా సంపుటిలో 23 కవితలు ఉన్నాయి. వీటితో పాటు ప్రతి పుటలో ఒకటి, రెండు మినీ కవితలున్నాయి. వస్తువు రీత్యా, అభివ్యక్తి లో ఈ కవితలు కొత్త పంథా తొక్కాయి. దళితు ని ఆత్మ న్యూనత భావాన్ని విడనాడి ఆత్మగౌరవ పోరాటానికి నడిపే కవితలకు ప్రతీకలుగా వీటి ని అభివర్ణించవచ్చు. ‘బడిలో అమ్మ ఒడిలో’ కవితలో కవి దళితుల ఆత్మగౌరవాన్ని కవిత్వీకరించాడు.
‘ఈ కులంలో పుట్టక పోతే
నేను ఇం కోలా ఆలోచించే వాణ్ణేమో
ఈ కులంలో పుట్టడ మే మంచిదైంది
అవమానమంటే అర్థమైంది
అందర్ని ప్రేమించిడం తెలిసింది’ అంటాడు. ఈ కవిత కథనాత్మక శైలిలో ఉన్న దీర్ఘ కవితా లక్షణాలతో కొనసాగింది. చిన్న నాటి నుండే అందరిలా చదువుకోవాలని దళితునికీ ఉన్నా, తప్పని సరిగా పశువుల్ని మేపడానికో, కూలి పనికో వెళ్ళవలసి వస్తుంది. కేవలం పేదరికం వల్ల మా త్రమే కాదు. గ్రామ పెత్తందారీ తనం వల్ల కూ డా అలా వెళ్ళవలసిన దయనీయ స్థితిని వర్ణిం చారు. ప్రాచీన సాహిత్యం నేటికీ తప్పనిసరి బోధనాంశమవుతోంది. అవి కొన్ని వర్ణాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాసినవి. కానీ, ఆ ప్రాచీన సాహిత్యంలోనే శాశ్వత విలువలున్నాయనే వితండ వాదనల వల్ల యావత్తు ఆ సాిహ త్యం పట్లనే వ్యతిరేకత కలుగుతుంది.
ప్రాచీన సాహిత్యం పాఠమైనప్పుడల్లా
నా ముఖకవళికలన్నీ మారిపోయేవి
మూకుమ్మడిగా కళ్ళన్నీ నాపైన పోకస్‌
ఎన్ని సార్లు చంపుతావంటూ
దేవుణ్ణి కాలర్‌ పట్టుకోవాలనిపించేది’అనడంలో దళితుల మానసిక సంఘర్షణను కవి బలంగా అభివ్యక్తీకరించగలిగాడు. కవిని తన పల్లె తాలుకు గతం వెంటాడుతోంది. పురుగుల్ని, పాముల్ని లెక్క చేయకుండా, గాయాల చేతుల తో పొద్దున్నే కారం పచ్చడి నూరుతున్న ‘అమ్మ’ గుర్తొచ్చి ‘మా ఊరు నవ్వింది’ కవితలో చక్కగా చిత్రీకరించాడు.
మనం సదూకోకుడదంటే ఇ న్వేందిరా
భయపెట్టే గ్రామ పెత్తందారీతనం
మా యమ్మా బాబుల గొంతుల్లో
ఆవేదన జీరకు
సజీవ సాక్షాలుగా
నాకు కనిపించే మా ఊరి పాఠశాల, పశుపాకలు’ అని నాటి బాల్య స్మృతులను గుర్తుచేసుకుంటున్నాడు. దళిత తాత్వికతని, దళిత సౌందర్యాన్ని ‘పు ట్టు మచ్చ మీద ప్రేమ’ అనే కవితలో భావగర్భితంగా దార్ల వెల్లడిస్తున్నాడు. ‘పుట్టుకతో మచ్చ ఒకడికి అందమైన అలంకారంగాను
మరొకడి కి అసహ్యంగాను మారుతుంది
నాకున్న పుట్టుమచ్చలో
నా ఎదుటి వాళ్ళకేమి దర్శనమవుతుందో కానీ
వెన్నుపూసై నిలిచిన సౌందర్య రమణీ
నా పుట్టుమచ్చా
నిన్ను నేను ప్రేమిస్తున్నాను’ అని అనడంలో కులం వల్ల వచ్చిన హీనత్వంతో పాటు, తన కులమే తనకు రక్షణ కవచంగా కూడా నిలిచే ఒక విచిత్ర పరిస్థితిని దీని లో వర్ణించాడు కవి.కులం పోవాలనుకుంటూ నే, మళ్ళీ ఆ కులం వల్లే భద్రత పొందడంలో ఒక దె్వైదీభావం కనిపిస్తుంది. రిజర్వేషన్స్‌ లేకపోతే కనీసం తమకి రావాల్సిన వాటిని అందుకోలేని స్థితినీ, రాజ్యాంగ పరంగా దళితులు కావడం వల్లే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం వంటి వాటి వల్ల కనీస ఉపశమనం పొందుతున్నారనే భావాన్ని చక్కని లోతైన ప్రతీకలతో అక్షరీకరిస్తున్నారు. దళితుల సహన శీలతను, ప్రేమించే తత్వా న్ని అగ్రవర్ణాల వాళ్ళు ఎంత ద్వేషించినా వేధించి నా, దళితులెంతగానో ప్రేమించే తత్వాన్నే కలిగి ఉంటారని ‘దళిత తాత్వికుడు’ కవితలో రచయి త కవిత్వీకరించారు.
‘ఇప్పటికైన నువ్వెప్పుడైనా
అమ్మ తినిపించే గోరుముద్దల రుచిని చూడు
మిట్ట మధ్యాహ్నం చెట్టు నీడకెల్లి చూడు
నీకు ప్రేమించడమే తెలుస్తుంది’ అంటూ ప్రేమించేతత్వాన్ని నేర్చుకోవాలని ఈ కవిత ద్వారా శక్తిమంతంగా తెలియజేస్తున్నాడు. దళిత సాహి త్యం రావట్లేదనడం కంటే, ఒక తాత్త్విక దృక్పథంతో వస్తున్న తీరుతెన్నులు గమనించేందుకు ఈ కవితాసంపుటిని చదవాల్సిందే. అప్పుడే దళి త సాహిత్య తత్త్వం పతాక స్థాయిని అర్థం చేసుకోగలుగుతారు.
- ఏడాకులపల్లి వెంకటేశ్‌

No comments: