(మన తెలుగులో స్త్రీవాదం భిన్న వర్గాలుగా కనిపిస్తుంది. మనలోమనం పేరుతో ఇటీవల రచయిత్రుల సదస్సు జరగడం, వాళ్ళలో కొన్ని అంతర్గత విభేదాలు రావడం, అవి ఇప్పుడు బహిర్గతం కావడం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రకటనకు చాలా ప్రాధాన్యత ఉందని భావించి ఇక్కడ ప్రచురిస్తున్నాను. –డా//దార్ల వెంకటేశ్వరరావు)
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రచయిత్రుల వేదిక
'మట్టిపూలు'
ఆవిర్భావ సదస్సుకు ఆహ్వానం
తరాలుగా అణచివేయబడిన కులాలు, మతాల ఆడవాళ్లం ఒకచోట కలిసింది లేదు. అవమానాలు, అణచివేతలు మనసు విప్పి పంచుకున్నది లేదు. ఎవరి బాధల్ని వాళ్లం ఎవరి బతుకుల్ని వాళ్లం ఒంటరిగానే రాసుకుంటూ వస్తున్నాం. సమాజంలో ఎంత హెచ్చుతగ్గులున్నాయో, సాహిత్యంలో కూడా అవి ప్రతిబింబించడం మమ్మల్ని కలచివేస్తున్నది. ఈ సాహితీ ఆధిపత్యాల్ని మేం ధిక్కరిస్తున్నాం. మేమంతా ఒక్కటవుతూ మా ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తున్నాం. విశాఖ 'మనలో మనం' వేదిక అనుభవం నుంచి మేము వేసిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. విభజించి పాలించే కుయుక్తిని అవలంబించారు.
స్త్రీవాదం కొత్త చిగుళ్లు వేయాలని ఉబలాటపడడం మంచిదే. కాని దానికి అస్తిత్వ వాదాల్ని బలిచేయాలనుకోవడం అన్యాయం. మమ్మల్ని తొక్కుడుబండగా చేసుకుందామనుకోవడంలో భాగమే 'మనలో మనం' అని విశాఖ సభలు తేల్చాయి. మా ప్రశ్నలకు స్త్రీవాదుల మౌనం, తెర వెనక అవహేళనలు అందరి దృష్టికీ వచ్చాయి. ఈ నేప థ్యంలో మా అస్తిత్వ వాదాల్ని వారి ఉనికి కోసం బలిపెట్టడానికి మేం సిద్ధంగా లేము. అందుకే మా అస్తిత్వ చైతన్యాల నుంచే 'మట్టిపూలు' వేదికను ఏర్పాటు చేస్తున్నాం. విస్తృతస్థాయిలో ఈ వేదిక నిర్మించే దిశలో ఎస్సి ఎస్టి బిసి మైనారిటి రచయిత్రులందరిని ఆహ్వానిస్తున్నాం.
అందరి సహాయ సహకారాలు కోరుతున్నాం। మా జాతుల స్త్రీలపట్ల ప్రేమ, గౌరవం, బాధ్యత వున్నవారంతా మా సభలకు వస్తారని ఆశిస్తున్నాం। అందరికీ ఇదే మా ఆహ్వానం। ఈ నెల 22వ తేది ఆదివారం ఉ।11 గం।లకు హైదరాబాద్-హైదర్‌గూడ-ప్రోగ్రెసివ్ మీడియా సర్వీసెస్ హాలు లో రచయిత్రుల సమావేశం జరుగుతుంది। సా.6గం.లకు బహిరంగ సభ. వక్తలుగా డా.విజయభారతి, కె.వరలక్ష్మి, నాగమ్మ పూలె, పుట్ల హేమలత, గోగు శ్యామల, డా.చల్లపల్లి స్వరూపరాణి, డా.వినోదిని, జమీలా నిషాత్, జ్వలిత తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 97014 51074, 94403 22361, 97035 64878 లకు ఫోన్ చేయవచ్చు.
--- జూపాక సుభద్ర, షాజహానా, జి.విజయలక్ష్మి
( ఆంధ్రజ్యోతి 16-3-2009 సౌజన్యంతో)
4 కామెంట్లు:
"తరాలుగా అణచివేయబడిన కులాలు, మతాల ....".
What do you mean by "తరాలుగా అణచివేయబడిన మతాల"?
It was Hindus who were ruled by Muslims and Christians for 1200 years.
Why you hate Hindus?
"తరాలుగా అణచివేయబడిన కులాలు, మతాల ....".
What do you mean by "తరాలుగా అణచివేయబడిన మతాల"?
It was Hindus who were ruled by Muslims and Christians for 1200 years.
Why you hate Hindus?
కుల పిచ్చి మన్షులను ఎటు తెసుకువెళుతుందొ? Shame on such people.
ఇది నేను రాసిన పోస్టు కాదు.ఇది ఒక ప్రకటన.ఆ ప్రకటనలోని భావాలకు, వాక్యాలకూ వారే బాధ్యులవుతారు. అయినా, నేను ఆ ప్రకటన నా బ్లాగులో విద్యాసమాచారం నిమిత్తం పెట్టాను. ఎందుకు పెట్టినా గానీ, దీనిలో తరం గురించి ప్రకటన రాసిన వాళ్ళు ఏదో హిందూవులనే ద్వేషిస్తున్నారని నేను అనుకోవడం లేదు. ఇక తరం అంటే ఇన్ని సంవత్సరాలని ఎవ్వరూ నిర్ణయించలేరు. మన తాత, తండ్రి రోజులను,మన రోజుల గురించి చెప్పేటప్పుడు మూడు తరాలు అంటుంటాం. నిజానికి కుల వ్యవస్థను ప్రోత్సహించిన హిందు వ్యవస్థను ఆ కులం వల్ల నష్టపోయిన వాళ్ళు ప్రేమించలేరు. దీన్ని వాస్తవదృష్టితో అంగీకరించగలగడం మన అవగాహనను తెలుపుతుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి