"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

22 నవంబర్, 2008

ఒక కవిత : రెండు అనువాదాలు

( గతంలో నేను రాసిన ఇక్కడ పుట్టడమే నేరమా? పేరుతో రాసిన కవితను ప్రముఖరచయిత, అనువాదకుడు డా// వి.వి.బి.రామారావు గారు ఆనువదించారు. వీరు సుమారు 40 పుస్తకాలు, వందలాది వ్యాసాలు రాసారు. ఇంగ్లీషు భాషలోకి మన తెలుగు సాహిత్యాన్ని అందిస్తూ విశేషంగా కృషి చేస్తున్నారు. అటువంటి డా// వి.వి.బి.రామారావు గారు నా కవితను అనువదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ కవితను, దాని మూలాన్ని అందిస్తున్నాను-- ఇదే కవితను హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి, తులనాత్మక శాఖలో అధ్యాపకుడుగా పనిచేస్తున్న ప్రముఖ అనువాదకుడు, సాహితీవేత్త, డా// జె.భీమయ్య గారు కూడా అనువదించారు. రెండింటికీ పోటీ పెట్టడం కాదు గానీ రెండింటిలో ఏది మూలానికి దగ్గరగా ఉంది? ఒకవేళ మూలం కంటే అందంగా ఉంది? సహజంగా రాసినట్లుంది? వంటి ప్రశ్నలకు మీ అభిప్రాయాలను తెలియజేస్తే సంతోషిస్తాను. అందువల్ల రెండు అనువాదాలను ఇక్కడ అందిస్తున్నాను -డా//దార్ల వెంకటేశ్వరరావు )
Is it an offence to be born here?

Telugu Original: Dr Darla Venkateswara Rao

English rendering: Dr V.V.B. Rama Rao

If anyone is talking about birth

Down my spine runs a shiver

As to how many theories are extant,

About the birth of the universe, I don't know

But there is just one for my birth here

Hereditarily, those of my very caste

Being wives of god,

I becoming an item of luxury of the land owners,

Titillating and enchanting the proprietors' heart-minds

Becoming prey to their consuming passion

Being crushed and crumpled as a 'matangi'

While all go on reciting myths about their birth

I too, dragging some Poleramma or some Pochamma

To the village court on the stone dais

I feel like making those deities stand testimony

As to who fathered me: who fathered each of my offspring.

I feel like making those deities give testimony

As to who was born to whom.

Even so, it's my doubt:

Except those born of the feet of those great males

Youth of others wouldn't be palatable for those gods?


(Note: Purusha Sookta, a description of Virat Purusha, the Supreme Being has this:

braahmaNOya mukhamaaaseet bahoo rajanya kritah

uuruu tadasya yadvysyah padbhaagyagam shudrO ajayata

The poem questions as to why the youth of matangis, stated as born from the feet of God, alone would be palatable to those gods and landlords. Poleramma and Pochamma are folk deities. )

IS IT AN OFFENSE TO BE BORN HERE?

Telugu Original: Dr Darla Venkateswara Rao

English rendering: Dr J.Bheemaiah

I feel a shiver down my spine

If any comments on my birth

I don’t know how many theories exist

To show the birth of the universe

But, there exists single premise

It is the women of my caste folk

Who are hereditarily made

To be their mistresses

For the feudalists

I am a sexual object

I am destined

Only to amuse their heart

I am a prey to their sexual thirst;

I have been crushed as Mathangi for centuries

About their birth

The puranas are piously recited

I too feel like dragging pochamma or poleramma[1]

On to the racchabanada[2]

To grill them to declare

To whom I was born, and

Who was born of me through whom.

For one thing I am in doubt:

Except those born of the feet of the gentry

Will not those gods taste the ‘youth’ of others?

Notes:

(1. Poleramma/Pochamma: The village deities worshipped by the dalits

2. Racchabanda: A round platform constructed in the heart of the village

where disputes resolved

Mathangi: A woman from a lower caste is also known as Mathangi, Basvini or Jogini . In the name of the village deity, she is thrown open for marriage with anyone coming forward to take her in marriage. Already married dominant upper castes use her satisfy their sexual thirst. They never treat them as their wives of their own caste. Rather they keep as mistresses. In that way almost all people take advantage of the nature her marriage and sexually exploit her.

‘I’ in the poem personifies as Mathangi. No gender confusion here as you expresses at one of the places.)




తెలుగు మూలం:

ఇక్కడ పుట్టడమే నేరమా?

పుట్టుక గురించెవరైనా మాట్లాడుతుంటే
నా వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది
విశ్వం పుట్టడానికెన్ని సిద్దాంతాలున్నాయో ...
నాకు తెలియదు కానీ...
ఈ ప్రపంచంలో నేను పుట్టడానికిమాత్రమొక్కటే సిద్ధాంతం
వంశపారంపర్యంగా నాకుటుంబంవాళ్ళే
దేవుడిపెళ్ళాలైపోవడం
భూస్వామ్యానికి భోగవస్తువునై
పెత్తందారీ చిత్తాన్ని రాగరంజితం చేయడం
వాళ్ళ కామదహనానికి బలైపోతూ
తరతరాలుగా మాతంగిగానలిగిపోవడం

అంతా తమపుట్టుక గురించి
ఏవేవో పురాణాల్ని పవిత్రంగా వినిపిస్తుంటే
నేను కూడా
ఏ పోలేరమ్మనో, ఏ పోచమ్మనో రచ్చబండ మీద కీడ్చుకొచ్చి
నేనెవడికి పుట్టానో
నాకెవడివల్ల ఎవడు పుట్టాడో
ఆదేవతలచేతే చెప్పించాలనిపిస్తుంది

అయినా నాకో అనుమానంగానీ...
మహాపురుషుల పాదాలనుంచి పుట్టినోళ్ళు తప్ప
ఆదేవుళ్ళెవ్వరికీ ఇతరుల యవ్వనాలంతగా రుచించవా...?
- డా. దార్ల వెంకటేశ్వర రావు.
( ఈ కవిత 29-01-2007 న ఆంధ్ర ప్రభ దినపత్రిక 'సాహితీ గవాక్షం ' లో ప్రచురితమయ్యింది)

కామెంట్‌లు లేవు: