తెలంగాణ సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాల చైతన్యం అనేక కొత్త విషయాలను ఆవిష్కరించింది. ప్రజాస్వామిక వ్యవస్థ కోసం పోరాడే చైతన్యం తెలంగాణ సంస్కృతిలోనే ఉంది. దళిత, బిసి, ముస్లిం, గిరిజన సమూహాలు తెలంగాణ ఉద్య మంలో భాగస్వాములవుతూ అసలైన ముల్కీ సాహిత్యం సృష్టి స్తున్నాయి. అలా ఏర్పడిందే 'సింగిడి'. నవంబర్ 2న హన్మకొం డలోని పబ్లిక్‌గార్డెన్‌లో 'సింగిడి' ప్రారంభసభలు జరుగుతు న్నాయి. మధ్యాహ్నం రెండునుండి రాత్రివరకు జరిగే ఈ సభ ల్లో తెలంగాణ సాహిత్యం, అస్తిత్వం, స్త్రీ-దళిత-బహుజన- ముస్లిం-వాగ్గేయ సాహిత్యాలపై సెషన్‌లుంటాయి. బి.నరసిం గరావు, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు, అంబటి సురేంద్రరాజు, సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, గోగు శ్యామల, షాజహానా, సయ్యద్ ఖుర్షీద్, జిలుకర శ్రీనివాస్, సూర్యానాయక్, కేశరాజు కొమ్రన్న, కాశీం, స్కైబాబ తదితరులు పాల్గొంటారు.
-అన్వర్, అశోక్ మోరె 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి