http://vrdarla.multiply.com/video/item/2
ప్రముఖ సాహితీవేత్త ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారి స్మారకార్ధం హైదరాబాదు విశ్వవిద్యాలయంలో బుధవారం, 20-8-2008 సాయంత్రం సాహితీ సభ జరిగింది. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు గతంలో తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేశారు. జి.వి.ఎస్ . కళాపీఠం వారు ఎం.ఏ., ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థినీ,విద్యార్థులకు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పముఖ విమర్శకులు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యం గారు స్మారకోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారి కుమారులు డా//విద్యానాథ్, శ్రీ రాధాకృష్ణ మూర్తి, ఉస్మానియా యూనివర్సిటి అద్యాపకుడు డా// వెలుదండ నిత్యానంద రావు, తెలుగుశాఖ అధ్యాపకులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రసంగం వీడియోను మీకు అందిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి