సాక్షి తెలుగు పత్రిక (13-7-2008) లో క్రీస్తు బోధనలను వివరిస్తూ, క్రీస్తు బొమ్మను కూడా ప్రచురించడంలో జరిగిన పొరపాటుకి వెంటనే స్పందించి, తగిన విధంగా క్షమాపణ కోరడంలో ఆ పత్రిక యాజమాన్యం గొప్ప హూందాతనంతో వ్యవహరించింది. మొదటిపేజీలోనే తన పొరపాటుని అంగీకరించింది. పైగా , సాక్షి పత్రిక క్రైస్తవుల మనోభావాలను కావాలని దెబ్బతీసే విధంగా చేయలేదనీ, అది సాంకేతికంగా జరిగిన పొరపాటనీ స్పష్టంగానే తెలుస్తుంది. నేట్ లో చూస్తే ఈ ఫోటో గూగుల్ సెర్చ్ లో మూడవ ఫోటోగా కనిపిస్తుంది. సరిగ్గా పరిశీలిస్తే తప్ప జీసెస్ ఫోటోలో జరిగిన మార్పులు కూడా కనిపించవు. త్వరగా ముద్రణకు పంపాలనే జర్నలిస్ట్ ఆత్రుత వల్ల కూడా ఇలాంటి పొరపాటు జరిగి ఉండవచ్చు. ఆ ఫోటో పెట్టిన సమీర అనే జర్నలిస్ట్ నిన్న రాత్రి ntv లో స్వయంగా తన తప్పుని ఒప్పుకుంది. నేను నెట్ లో ఈ ఫోటో కోసం వెతికితే, అది ఒక బ్లాగు http:// jnassif93.wordpress.com నుండి గ్రహించిందని గూగుల్ సెర్చ్ చూపిస్తుంది. దీని వల్ల కూడా ఇది కావాలని చేసిన తప్పు కాదనిపిస్తుంది.అయినా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినకూడదేనే ఆలోచనతో వెంటనే స్పందించిన సాక్షి ని అభినందిస్తూ, ఇదే తరహాలో ఇతర పత్రికలూ వ్యవహరిస్తే బాగుంటుందనిపిస్తుంది.
డా// దార్ల వెంకటేశ్వరరావు,
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు.
http://vrdarla.blogspot.com
2 కామెంట్‌లు:
మీరు గమనించారా?
సాక్షి ని ప్రచురిస్తున్న జగతి ప్రచురణల చైర్మన్ జగన్ జవాబిచ్చుకున్నాడు.
మేనేజింగ్ డైరక్టర్ రామకృష్ణా రెడ్డి జవాబిచ్చుకున్నాడు .
ఫీచర్స్ ఎడిటర్ శ్రీ రాం (?) కి ముళ్ళు గుచ్చుకున్నయి అని ఒప్పుకున్నాడు.
సమీర క్షమార్హురాలని, క్షమించమని ప్రార్ధించింది!
ఫన్ డేలో, ఆ పత్రిక - సాక్షి సంపాదకుడు పతంజలి కాలం కూడా ఆగిపోయ్యింది.
ఈ వ్యవహారంలో సాక్షి సంపాదకుడు, కె.ఎన్.వై పతంజలి ఎక్కడా కనపడలేదు!!!
చాల్రోజులవుతుంది కదా.
ఇప్పుడు అసలు ప్రశ్న అడగొచ్చనుకుంటాను.
మరీ ఇలా సిగ్గు లేకుండా నెట్లో కాపీ కొట్టాలా?
అన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్లు మరో నాలుగయిదు ఆర్టిస్ట్ పోస్టులు మెయింటెయిన్ చెయ్యలేరా? ఇంకో నలుగురు ఆర్టిస్టులూ బాగుపడేవాళ్లు కదా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి