అణగారిన వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ సామాజిక, సాహిత్య రంగాలలో కృషిచేసే వారికి భారతీయ దళితసాహిత్య అకాడమీ(ఢిల్లీ) వారు జాతీయస్థాయిలో ఇచ్చే బాబాసాహెబ్ డా// అంబేడ్కర్ ఫెలోషిప్ అవార్డు(2007)ను నాకు ప్రటించారు. నేను ప్రస్తుతం హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్నాను. ఢిల్లోలో డిసెంబర్ 9, 10 వతేదీలలో జరిగే అకాడమీ 23వ జాతీయ సమావేశాల్లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించడం జరుగుతుందని అకాడమీ జాతీయ అధ్యక్షుడు డా//ఎస్.పి. సుమనస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరుద్ర రచనలపై పరిశోధన చేశాను. దళిత జీవితాలను ప్రతిఫలిస్తూ "దళిత తాత్త్వికుడు" కవితాసంకలనాన్ని ప్రచురించాను. "మాదిగ చైతన్యం", "సాహితీమూర్తుల ప్రశస్తి" గ్రంథాలకు ఉప - సంపాదకుడు గా వ్యవహరించాను. అమ్మ, మాఊరు, నాయిన, కవితామాలిక తదితర కవితాసంకలనాల్లో నా కవితలు ప్రచురితమయ్యాయి. అంతర్జాతీయ ఆంగ్ల త్రైమాస పత్రిక "లిటిక్రిట్ ఇండియా" లో నాఅనువాద కవితలు ప్రచురితమయ్యాయి. వీటితో పాటు వివిధ సాహితీ ప్రతికలు, ప్రత్యేక సంచికలు, ఇంటర్నెట్ పోర్టల్స్ లో అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ విశ్వవిద్యాలయాలు , కళాశాల్లో జరిగిన జాతీయ స్థాయి సెమినార్ల లో పలు పరిశోధనా పత్రాలను సమర్పించాను. "డా//యస్. టి. ఙ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన గ్రంథాన్ని ప్రచురించాను. రాఖీ, డాబామామ్మగారు వంటి కథలు రాశాను .
స్కాట్లాండు లోని గ్లాస్కో విశ్వవిద్యాలయం ఆచార్యులు సైమన్ చార్స్లీ , ఆంధ్రప్రదేశ్ లో దళితుల గురించి చేస్తున్న ప్రస్తుత పరిశోధనలో సాహిత్య విషయలకు సంబంధించి నేను సహకరిస్తున్నాను. ఇంటర్నెట్ లో నేను నిర్వహిస్తున్నwww.madigakavulu.blogspot.com గురించి ఆచార్యులు సైమన్ చార్స్లీ తన వెబ్ సైట్ www.simoncharsley.net లో ప్రముఖంగా పేర్కొన్నారు.
ఈ అవార్డు ప్రకటించినందుకు భారతీయ దళిత సాహిత్య అకాడమీకి
నా కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను.
5 కామెంట్‌లు:
మిత్రులకు అభినందనలు
మిత్రులకు అభినందనలు
దేవరపల్లి రాజేంద్ర కుమార్ గారు తేనెగూడు లో చూసి అభినందిస్తూ మెయిల్ పంపారు. దాన్ని తేనెగూడు టీం నాకు పంపింది.
ఆ అభినందన ఇది :
"దార్ల గారికి అంబేద్కర్ ఆవార్దు అందుకోనున్న సంధర్భంలో అందుకోంది నా అభినందనలు
రాజేంద్రకుమార్
http://visakhateeraana.blogspot.com మిత్రులు అపరంజి కూడ అభినందించారు. ఇంకా చాలామంది మెయిల్ ,పోను ల ద్వారా అభినందనలు తెలిపారు. వారందరికీ నా నమస్సులు.
మీ
దార్ల
దార్ల గారికి,
అభినందనలు.
-- విహారి
దార్ల గారూ, అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి