"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

17 October, 2007


(నేను తెలుగులో రాసిన రెండు కవితలకు Litcrit India అంతర్జాతీయ సాహిత్య పత్రిక లో ఆంగ్ల అనువాదాలు ప్రచురితమయ్యాయి. ఈ రెండు కవితలను హైదరాబాదు విశ్వ విద్యాలయంలో ఆంగ్ల శాఖలో అధ్యాపకులుగా పనిచేస్తున్న
Dr. D.Murali Manoharగారు అనువదించారు. Litcrit India సౌజన్యంతో ఈ కవితలను పునర్ముద్రిస్తున్నాను .)





Award for the City
I thought the city would embrace me
Ignoring whether it was day, night
Hunger, thirsty.
Weakness, sleepless
But my life was absorbed in the city construction!

Whoever may be the labour in establishing Taj Mahal
It became foundation for love
Hard work reflects and overtakes in moonlight’s cool breeze
The great poet exists through his poetry
With delight I become on to road to see the construction of city
No luring rhythm in my ‘walk’ on the Centre
The city made my legs broken and made me a handicapped!

The city has become a flower
A lock has been put on my nose
The city has become a Lord Indra’s Bungalow
A sin has made my existence ash!
I thought the city would embrace me
I thought the city was mine
I thought the city was my family
I thought the city was my soul mate
I was city, the city was I
In the construction of city, I became a dot
The city rejected me
The city that has rejected me gets selected for an award!
The city swallowed my labour juice
Did not leave out even the cane burning as the nature of human opportunism!
- writteb by Dr.Darla VenkateswaraRao
vrdarla@gmail.com
--- Translated by DrD.Murali Manohar
dmmsh@uohyd.ernet.in

నగరపురస్కారం!

నగరం నన్ను అక్కున చేర్చుకుంటుందనుకున్నాను
పగలనక,రాత్రనక
ఆకలనక,దప్పికనక
నీరసమనక,నిద్రనక
నగరనిర్మాణంలోనే కలిసిపోయింది నాజీవితం!

తాజ్ మహల్ నిర్మాణంలో కూలీలెవరైనా
పవిత్రప్రేమకు పునాదులయ్యో
వెన్నెల చల్లదనంలో శ్రమను మరిపించే కుడ్యాలయ్యో
మహాకవి కవిత్వమయ్యో నిలవగలిగారు!


నగరనిర్మాణాన్ని మురిపెంతో చూడాలని రోడ్డుమీదకొస్తే
నడివీధి 'నడకాలో నెరజాణత్వపు మెలికలు లేవని
కాళ్ళు విరగదీసి నగరం నన్నో వికలాంగుణ్ణి చేసింది
నగరం ఒక పువ్వయ్యింది
నాముక్కికి తాళం పడ్డది

నగరం ఒక ఫలమయ్యింది
నానోరు కట్టివేయబడింది

నగరం ఒక ఇంద్రభవనమయ్యింది
ఓ శాపమేదో నాఅస్తిత్త్వన్ని భస్మం చేసింది!
నగరం నన్ను అక్కున చేర్చుకుంటుందనుకున్నాను
నగరం నాఇల్లనుకున్నాను
నగరం నాకుటుంబమనుకున్నాను
నగరమే నేను-నేనే నగరమనుకున్నాను
నగరనిర్మాణంలోనే అణువునైపోయాను
నగరం నన్ను తిరస్కరించింది
నన్ను తిరస్కరించిన నగరం పురస్కారానికి ఎంపికయ్యింది.
నగరమిప్పుడు రసాన్ని పీల్చేసి
చొప్పను కాల్చేసే అవకాశవాద మానవ స్వభావం!
- డా// దార్ల వెంకటేశ్వరరావు

1 comment:

mohanrazz said...

'nagarapuraskaaram' baagundi.