"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

19 October, 2007

litcrit india ( International Magzine )లో దార్ల కవితలు-2














స్థానిక గొంతులే...?
ఆర్పవలసింది ముందు బ్లో అవుట్స్ నికాదు
అవన్నీ తాత్కాలికమే
తరలిపోతున్న సంపద కాలిబూడిదవుతున్న ప్రాంతం
ఆమట్టిలో పుట్టినోళ్ళలో మట్టి
దోబూచులాటల్లో మోసం
తప్పనిసరై రగులుతున్న గుండెమంటలు
ఈ మంటలార్పండి ముందు
రాయలసీమ...తెలంగాణ...కోనసీమ...ప్రాతాలుగా విడిపోతేనేమి
అస్తిత్వ పోరాట ధ్వనుల్లో స్థానిక గొంతుల్ని వినండి
రియల్ ఎస్టేట్స్... ఇండస్ట్రియలిస్ట్స్...బ్యూరోక్రాట్స్...
పేర్లేవైతేనేమి దోపిడీల నయావలసవాదమే!
ఫ్యాక్షనిజం, క్యాస్ట్ పాలిటిక్స్, ఆక్వాకల్ట్చర్...అంతా పొల్యూషనే!
పూరిగుడిసలన్నీ తవ్వోడలకే బలి!
అంతర్జాతీయ రింగ్ టోన్స్ ఆకాశ హార్మ్యాల్లో "గూడు " పుఠానీలు
ప్రతీ ప్రాంతమిప్పుడు డ్బ్ల్యు.టి.వొ. ముగ్గులతో కళకళలే!

ఒక్క ప్రాంతమైనా చూడగలరా
ఇవిగో నమ్ముకున్న నేలతల్లికి పెట్టిన రంద్రాలు
చమురన్వేషణలో పచ్చదనాల్లోని విధ్వంసాలు!
కుప్పకూలిన చెట్టంత అనుబంధాలు
పైసా పైసా కూడబెట్టుకున్న అరెకరం కొండచిలువలు మింగేసిన రొయ్యల చెరువు
చూపలేనివి ఇంకా ఎన్నేన్నో!
పేదరాసి పెద్దమ్మ పరిగ గింజల్ని కలబెట్టుకోవటానికే కరువైన కట్టెలు
వాన్ని తగలబెట్టటానికి ఎలావస్తాయ్

గ్యాసిక్కడె పుడుతున్నా దాన్ని ఇందనంగా మార్చుకోలేని అశక్తత!
ఒంట్లో, ఇంట్లో,కంట్లో అన్నింట్లో ఏవేవో ప్రలోభాలు!
కోనసీమిప్పుడు డబ్బుకట్టల్ని ప్రపంచబ్యాంకుకి మోసే రోజువారీ కూలీ!
కోనసీమిప్పుడు బ్లో అవుట్స్ రూపంలో రక్తం కక్కుతున్న కలర్ టి.వి.
కోనసీమిప్పుడు ఓ దారుణ ప్రియదర్శనం!



Raising… Local voice…?
--Dr.Darla Venkateswara Rao
It is not to stop blowouts first
Those are temporary
The assets are exported and local place is becoming an ash
Those who were born there are filled with mud in their mouths
There is cheating and jostling in sharing the assets
Compellingly the hearts are burning
Therefore, first, stop those burning hearts!
Rayalaseeme, Telangana, Coastal … Let those regions divide
Hear the loud voices of local inhabitants fighting for existence
Real estates, Industrialists, Bureaucrats…
Whatever may be the name, exploitation is the new migrating theory
Factionism, Cast politics, Aqua culture… all of these is pollution!
All the shabby huts are sacrificed for porcelances
International ring tones
Elevated ‘apartments’ reaching the sky is nothing but out of scam
Every house is decorated with the art and design of WTO!!
Can you identify one local area?
Here are the rigged holes on the trusted land
Exploring the crude oil affects green fields with blasting
Deep affections crushed
Half an acre made out of every pie
Crocodiles have swallowed Aqua lakes
Many many things cannot be shown…
Below poverty line peddamma has scarcity of wood to burn the little dal
How they are enough for burning the dead body
Gas is born right here but cannot be converted in to energy
In body, house, eyes, in all so many packages
Coastal land is a labour of World Bank to load and export bundles of currency
Coastal land is now in the form of blowouts vomiting the blood like colour T.V.
Coastal land a deceitful and attractive dear appearance!!
--- Translated by Dr. D.Murali Manohar.
(Litcrit India An International Journal of Literature Art& Culture, Volume V, Numbers 5&6, Spring/ Summer 2007 pp: 58)


(నేను తెలుగులో రాసిన రెండు కవితలకు Litcrit India అంతర్జాతీయ సాహిత్య పత్రిక లో ఆంగ్ల అనువాదాలు ప్రచురితమయ్యాయి. ఈ రెండు కవితలను హైదరాబాదు విశ్వ విద్యాలయంలో ఆంగ్ల శాఖలో అధ్యాపకులుగా పనిచేస్తున్న Dr. D.Murali Manoharగారు అనువదించారు. Litcrit India సౌజన్యంతో ఈ కవితలను పునర్ముద్రిస్తున్నాను .)

2 comments:

Bolloju Baba said...

కవిత చాలా బాగుంది. చాలా విస్త్రుతమైన పరిధి, భావాలను కలిగిఉంది.

చిన్న సందేహం

పూరిగుడిసలన్నీ తవ్వోడలకే బలి!

All the shabby huts are sacrificed for porcelances.

ఎక్కడో ఏదో అనువాద దోషంలా అనిపిస్తుంది. పోర్చెలాంసెస్ బహుసా స్పెల్లింగు మిస్టేకా.

తవ్వోడ అనెడిది "dredger" కి తెలుగు రూపం. దీని వెనుక ఒక కధ ఉంది.
విశాఖ పట్నం రేవులో ఇసుక పూడిక తీయటానికై "dredger" ఒచ్చిందట. దానికి తెలుగు సమానార్ధకం కోసం మేధావులు బుర్రలు గించుకుంటున్నారు. అక్కడ పనిచేసే కార్మికులు ఆ "dredger" ను తవ్వోడ అని వ్యవహరించటం పురిపండా గారు గమనించి, సరైన అచ్చ తెనుగు పదాలు శ్రామికుల నుండే ఉద్భవిస్తాయని సూత్రీకరించారని ఒక కధనం. తవ్వోడ అంటే తవ్విపోసే ఓడ అని అర్ధం.
మీ కవితలో అదే అర్ధంతో వ్రాసినట్లయితే అది ఒక అందమైన పదచిత్రం గా పోల్చుకోవచ్చును. కాకపోయినట్లైతే ఒక ముద్రారాక్షసంగా అనుకుంటాను.

మీ బ్లాగులోని చాలా వ్యాసాల లోని భావాలే నాకు చాలా కాలంగా మనసును తొలిచే విషయాలే? మీరు చక్కగా అక్షరరూపాన్ని, ఉద్యమ రూపాన్ని కల్పిస్తున్నారు.
అభినందనలు, కృతజ్ఞతలు.

బొల్లోజు బాబా

http://sahitheeyanam.blogspot.com/

vrdarla said...

థాంక్యూ!
మీ బ్లాగ్ చూశాను. మంచి కవితలు ఉన్నాయి. దీన్ని ఆ అనువాదకునికి చూపిస్తాను.
మీ
దార్ల