"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

25 June, 2007

కొత్త రూపులో సెంట్రల్ యూనివర్సిటి వెబ్ !

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ వెబ్ కొత్త రూపం ధరించింది. ఇప్పుడు చాలా బాగుంది. అయితే,Departments వారిగా అప్ డేట్ చేయవలసి ఉంది.

7 comments:

ప్రదీపు said...

మీరు collegeలో ఉండి access చేసుకోగలిగే లింక్ ఇచ్చినట్లున్నారు. బయట వాల్లకు ఈ లింకు మాత్రమే వాడుకోగలుగుతారనుకుంటా. ఏమయినా కొత్త రూపం బాగుంది.

Naga said...

హైదరాబాదు విశ్వవిద్యాలయంలో బోర్డులు తెలుగులో రాస్తారా? తెలుసుకోవాలని ఉంది.

రవి వైజాసత్య said...

ఆహా ఇప్పటికిగానీ ఈ సైటుకు మోక్షం రాలేదనమాట. గత 8-9 యేళ్ల నుండి పేలవమైన ఆ పాత వెబ్‌పేజీ చూసి విసుగెత్తింది. డిపార్ట్మెంటు సైటులో మా గురువుగారు అప్పారావుగారి ఫోటో చూసి ఆనందంగా ఉంది.

vrdarla said...

యూనివర్సిటీ వెబ్ మార్చటం పట్ల మీ అభిప్రాయాల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి.
ప్రదీపు గారు అన్నట్లు బయటి వాళ్ళకు ఇది ఓపెన్‌ కాదా? నాకు తెలియదు. తెలుసుకోవాలని ఉంది.
నాగరాజు గారూ!
తెలుగులో రాసున్నారండీ.. అబ్బో దీని కోసం మేము ఈ యూనివర్సిటీలో చదువుకొనేటప్పుడినుండి ఒక విధంగా పోరాటమే చేశాం. కానీ, ఈ మధ్యనే తెలుగులో బోర్డులు పెట్టారు. ఎప్పుడైనా వీలయితే సరదాగా రండి
రవి గారూ... మీరు మీ గురువు గారి పట్ల చూపిన అభిమానం నాకూ చాలా సంతోషం వేసింది.వెంటనే చూశాను. ఆచార్య అప్పారావు పొదిలి గారు సహృదయులు.వారి పోటో తో డిపార్ట్ మెంట్ లోగోను తయారు చేశారు. ఇంకా పూర్తిగా అందరి వివరాలూ పెట్తలేదు. ఏది ఏమైనా మీరు కూడా ఈ యూనివర్సిటీ విద్యార్థి కావడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై మన యూనివర్సిటీ అనుకుందామా?
మీరి science చదివీ మంచి సాహిత్యాభిరుచి ఉన్నారని మీరు ఎన్నిక చేసిన సంగీత బ్లాగును బట్టి అనిపించింది. ఇంకో మాట మీరు ఎక్కడో గాని "కంగారు" అనే పదాన్ని ఉపయోగించారు. అంధ్రా ప్రాంతం, అదీ ఉభయగోదావరి ప్రాంతమేమో అంపి్స్తోంది . నా అనుమానం ఎంత వరకూ నిజం. తెలుసుకోవాలనే తప్ప ప్రాంతీయ రాజకీయాలకు కాదులెండి.

vrdarla said...

హడా విడిలో తప్పులతడకగా టైపు అయ్యింది.

ప్రదీపు said...

172.16.*.* అని ఉండే అడ్రస్సులు సాధారణంగా LANలో వాడే ఐపీ అడ్రస్సులు. కాలేజీ వెబ్సైటును కూడా అదే LANలోని ఒక కంప్యూటరులో ఏర్పాటు చేసినప్పుడు; ఆ వెబ్సైటును చేరటానికి campus బయటివారికి ఒక ఐపీ అడ్రసు, campus లోపల ఉన్న వారికి ఇంకో ఐపీ అడ్రస్సును కేటాయిస్తారు. నేను పైన ఇచ్చిన లింకు బహుశా మీకు అని చేయకపోవచ్చు.

రవి వైజాసత్య said...

దార్ల గారూ, నా వ్యాఖ్యకు మీరు రాసిన ప్రతివ్యాఖ్య చాలారోజుల తర్వాత ఇప్పుడే చూశాను. మాది ఒకప్పటి రాయలసీమ ప్రాంతమైన గిద్దలూరు (ప్రస్తుతం కోస్తా జిల్లా అయిన ప్రకాశంలో ఉంది). చిన్నప్పట్నించి పెరిగింది హైదరాబాదులో. సాంస్కృతికంగా రాయలసీమ అయినా వివిధ ప్రాంతాల ప్రభావంతో నా భాషలోని ప్రాంతీయత కలగాపులగమై పోయింది. నేనెప్పుడూ ఆశ్చర్యపోయే విషయమేంటంటే మా ప్రాంతపు భాషలో మహబూబ్ నగర్ మాండలికం అక్కడక్కడా కనిపిస్తుంది. (రాయలసీమ, కోస్తా సరిహద్దులో ఉన్న చిన్న ప్రాంతం యొక్క స్థానిక భాషపై మహబూబ్‌నగర్ మాండలిక ప్రభావం ఉండటం ఆశ్చర్యం. తీరికదొరికినప్పుడు పరిశోధించాలి.