"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

22 జూన్, 2007

జాన్‌ కవిపై సాహితీ కౌముది ప్రత్యేక సంచిక


కవిత్వంలోని వస్తువు, అభివ్యక్తులను బట్టి గుర్తించటమే ప్రతి కవికీ నిజమైన గుర్తింపు. అలాంటప్పుడు కుల, మత, ప్రాంతీయ భేదాలు పొడచూపవు. నిజానికి కవిత్వాన్ని ఇష్ట పడటానికి ఈ కొలమానాలు చాలా మంది చూస్తుంటారు. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది భావజాలం. భావజాలం నచ్చినప్పుడు పైవేమీ పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఇవేమీ కాకుండా, కేవలం కవిత్వాన్నే ఇష్టపడేవాళ్ళూ ఉంటారు. అటువంటి వాళ్ళు చాలా అరుదు. అసలు విషయం ఏమిటంటే, ఇటీవల సాహితీకౌముది త్రైమాసిక పత్రిక ఏప్రిల్ 2007 సంచిక చూశాను. దాన్ని మధుర కవి శ్రీ మల్లవరపు జాన్‌ 80 వ జయంతి ప్రత్యేక సంచికగా ప్రచురించారు. తెలుగు పద్య సాహిత్యాన్ని ప్రోత్సాహించే పత్రిక. దీనిలో చాలా మంచి వ్యాసాలు, కవితలు ఉన్నాయి. జాన్‌ కవి గారి గురించే కాకుండా, మరికొన్ని శీర్షికలు కూడా ఉన్నాయి. సాహితీ వార్తలు ఉన్నాయి.
వ్యవస్థాపక ప్రధాన సంపాధకులు శిష్ట్లా వెంకట్రావు గారు మంచి సంపాదకీయం రాశారు. సంచికలో ఉన్న అన్ని వ్యాసాల పెట్టు ఆ సంపాదకీయంలో ఉంది. జాన్‌కవిగారి సమగ్ర వ్యక్తిత్వం ఆ సంపాదకీయంలో పెట్ట గలిగారు. సనాతన సంప్రదాయాన్ని మన్నిస్తూనే వాటిలోని బల హీనతలను త్రోసి రాజనగల కవులలో ఒకరుగా జాన్‌ కవిని బాగా అంచెనా వేయగలిగారు. "దైవభక్తి, దేశభక్తి, సామాజిక స్వభావం, మృదుస్వాభావికత ఆయన వ్యక్తిత్వాన్ని మహోన్నత స్థాయిలో నిల్పిన కవిగా జాన్‌ కవి గారిని అభివర్ణించారు.
షేక్ ఆలీ, ఎం.పి. జాను కవి, ఉన్నం జ్యోతి వాసు, మల్లవరపు రాజేశ్వరరావు, మల్లవరపు వెంకటరావు, ఫణితపు శ్రీరామ మూర్తి, కొండ్రెడ్డి వేంకటేశ్వర రెడ్డి , డా.బీరం సుందరరావు, బోడావుల నాగేశ్వరరావు, గంగవరపు జానకి రావు, బులుసు వేంకటేశ్వర్లు మొదలైన వారు జాన్‌ కవిగారి సాహిత్యాన్ని, వ్యక్తిత్త్వాన్నిఛందో బద్దంగా మంచి పద్యాలను రాశారు.
జాన్‌ కవిగారి గురించి చాలామంది మంచి వ్యాసాలు రాశారు. " మధుర కవి సాహిత్య దర్శనం" పేరుతో డా// గోగినేని యోగ ప్రభావతి గారు రాసిన వ్యాసం చాలా బాగుంది. ఇంకా ఇలాంటి వ్యాసాలు చాలా ఉన్నాయి. జాన్‌ కవి గారి వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని తెలుసుకోవాలనే వారికి ఈ సంచిక ఒక ఆకర గ్రంథంగా ఉపయోగిస్తుంది.
ఈ సంచిక కావాలనుకున్నావారు కింది చిరునామాకి సంప్రదించ వచ్చు.
విడిప్రతి : రూ.15/
ప్రధాన సంపాదకులు,
శిష్ట్లా వెంకట్రావు,
" సాహితీ కౌముది" త్రైమాసిక పత్రిక,
ఇంటి. నెంబరు 34 - 16 ( 2)
గాంధీనగర్, యలమంచిలి - 531 055
ఆంధ్ర ప్రదేశ్

కామెంట్‌లు లేవు: