"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

11 April, 2007

"విదేశీయుల ముందుజనగణమనెందుకు?

"విదేశీయుల ముందుజనగణమనెందుకు? " అని infosys నారాయణమూర్తి గారు వ్యాఖ్యానించినట్లు ఓ వార్త చదివి చాలా బాధనిపించింది. ఆయన గురించి ఒక సారి ఈ టీవీ " మార్గ దర్శి "లో ఒక కార్యక్రమం కూడా ప్రసారం చేశారు. అప్పుడు ఆయన కృషీ, పట్టుదలలను తెలుసుకొని నిజంగానే చాలా మందికి మార్గ దర్శి అనుకున్నాను.
మన దేశంలో భూమితో పాటు రకరకాల రాయితీలు పొందుతూ దేశ జాతీయగీతాన్ని ఈ విధంగా కించ పరచడం భారతీయులనందరినీ అవమానించినట్లని పించింది. ఇలాంటి వాళ్ళు మన దేశం గురించి ఇతరదేశాల్లో ఎలాంటి ప్రచారం చేస్తారో కదా అనీ ఆందోళన కలిగిస్తుంది.
దీనికి మన దేశ భక్తులు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.

6 comments:

Sudhakar said...

నిజమేనండీ..నాకు కూడా ఒక్క సారి చివుక్కుమంది. అయితే నారాయణ మూర్తి గారు ఒక పక్కా ప్రాక్టికల్ మనిషి. ఒక మంచి హ్యుమానిటరియన్ కూడా. దేశ భక్తి మనసులో వుండాలి కానీ మంచెలపైనుంచి ఇచ్చే ప్రసంగాలలో కాదు అనుకునే రకం. మన దేశంలో నిజంగా ఎంతమందికి దేశభక్తి వుంది చెప్పండి. పక్క జిల్లా అంటే పడదు, రాష్ట్రం అంటే పడదు. కులం అంటే పడదు. 1001 రకాలుగా మనం మనలో దేశాన్ని ఏదో రకంగా ద్వేషించుతూనే వుంటాం. దారిన పోతూ నిరంభ్యంతరంగా ఈ దేశం భూమిపై కాండ్రించి వుమ్మివెయ్యగలం.

మన దేశంలో కామన్ గా ఒక పెద్ద హిపోక్రసీ వుంది.అదే ఈ కుహానా దేశభక్తి.పాకిస్తాన్ తో కయ్యాలు లేకుంటే ఆ కొద్దిగా కూడా వుండేది కాదు.

Unknown said...

మీరు చెప్పేది నిజమే ఐనా మనలో మనకు ఎన్నో కుమ్ములాటలు ఉండవచ్చు. కాని జాతీయ గీతం మీద ఇలాంటి వ్యాఖ్య చేయడం సబబు కాదు, దేశానికి కాబోయే రాష్ట్ర పతి చేయదగ్గ వ్యాఖ్య కాదు. ఇది ఎలా ఉందంటే గుడ్డి వాడికి దీపం ఎందుకు దండగ అన్నట్టు ఉంది గానీ వాడికి చూపు ఇవ్వాలంటే ఏమి చెయ్యాలి అన్నట్టు లేదు ఇంకా చెప్పాలంటే విదేశీయులకు అమ్ముడు పోయినట్టు ఉంది
నాకు ఇన్నాల్లు INFY లో పని చేద్దామని ఉండేది కాని ఇప్పుడు చాలా సంతోషిస్తున్నా because I was not qualified for INFY

సిరిసిరిమువ్వ said...

నిజం చెప్పారు సుధాకర్ గారూ. వార్త చూడగానే ముందు కొంచం చివుక్కుమనిపించినా ఆలోచిస్తే ఈ మీడియా వాళ్ళు ఆయన అన్నది అన్నట్లుగా కాక కాస్త ఎక్కువ చేసి చెప్పారేమో అనిపించింది. మీరన్నట్లు దేశభక్తి మనసులో వుండాలి కాని వేదికలెక్కి ఓ పక్క జైహింద్ అంటూ ఇంకోపక్క దేశద్రోహం చేసేవాళ్ళు ఎంతమంది లేరు.

నూరేళ్ళ పైబడ్డ చరిత్ర గల కాంగ్రెస్ లో సమర్ధులు ఎవరూ లేనట్లు ఓ విదేశీయురాలి చేతికి పాలన పగ్గాలు ఇచ్చాము దానికన్నా ఇదేమి పెద్ద దేశద్రోహం కాదేమో.

Unknown said...

ఏదెలా ఉన్నా నారాయణ మూర్తి గారు ఇలా అనకుండా ఉండవలసింది. ఇందులో ప్రాక్టికల్ గా ఆలోచించడం ఏమీ లేదు అని నా ఉద్దేశ్యం. ఎవరో విదేశీయుల కోసం మన జాతీయ గీతాన్ని పాడకుండా వాయిద్యం మాత్రమే వినిపించడం, దానికి మళ్ళీ వాళ్ళు పలకలేరని సంజాయిషీ ఇవ్వడం ఎంత వరకూ సబబు ? అన్ని దేశాలూ ఇలాగే చేస్తున్నాయా ? ఈయన అమెరికా కి వెళీతే వారు ఇలాగే చేస్తారా ?
తప్పులు అందరి వల్లా జరుగుతాయి. తప్పు జరిగితే తప్పని ఒప్పుకోవడమే సరయిన పద్ధతి (ఆయన క్షమాపణ అడిగారు కూడా). ఆయన కావాలని అన్నారో, అనలేదో అనేది తరవాత. అది అందరికీ బాధ కలిగించింది.
వేరెవరో ఎలాగో చేస్తున్నారని ఈయన ఇలా చేసినా ఫరవాలేదు అనే వాదన కూడా సరయినది కాదు.

vrdarla said...

"మన దేశంలో కామన్ గా ఒక పెద్ద హిపోక్రసీ వుంది.అదే ఈ కుహనా దేశభక్తి.పాకిస్తాన్ తో కయ్యాలు లేకుంటే ఆ కొద్దిగా కూడా వుండేది కాదు." సుధాకర్ గారి ఈ వ్యాఖ్యలు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి.గొప్ప వ్యంగ్యం ఉంది. చాలా balanced and alytical అభిప్రాయం. నిజమే నారాయణ మూర్తిగారు రాజకీయవేత్తలా ప్రకటనలు చేయరు. సుధాకర్ గారు అన్నట్లు నారయణ మూర్తిగారు 'ఒక పక్కా ప్రాక్టికల్ మనిషి'! అందుకే ఆయన్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు అనేకమంది కదండీ! వివిధ విద్యాసంస్థల్లో ఫిజుల విషయంలో ఆయన అభిప్రాయాలను గమనిస్తే ఆ ప్రాక్టి కాలిటి అర్థమవుతుంది.
మనదేశంలో కులాలున్నాయి. మతాలున్నాయి. అయినా మనమంతా కలిసిమెలిసే ఉంటున్నాం. మనం కులం గురించి చర్చించుకునేటప్పుడు కొన్ని ఉద్రేకపూర్వకంగా కూడా మాట్లాడుతుంటాం. తరువాత" అయ్యో అనవసరంగా అలా మాట్లాడేనా! "అనీ పశ్చాత్తాపపడేవాళ్ళూ ఉన్నారు. మొన్న కులం గురించి జరిగిన చర్చ (http://aha-naa-blog-anta.blogspot.com)లో అలాగే కామెంట్స్ చేసిన వారున్నారు. మాట్లాడకుండా ఉండేవాళ్ళ కంటే ఎలా మాట్లాడినా అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ప్రయత్నించే వాళ్ళు గొప్పవాళ్ళే అనుకుంటాను. సుబ్రహ్మణ్యం గారి ఆలోచనలు చాలా వరకూ బ్రాహ్మణిజాన్ని, జాతీయతను సమర్థించేటట్లు గా ఉంటాయి. అయినా ఆయన రాతల్లో వారిదైన రీజన్‌ కనిపిస్తుంటుంది. డా. ఇస్మాయిల్ గారు నాకు తెలిసినంత వరకూ ఎప్పుడూ కులం గురించి వ్యాఖ్యానించలేదు. ఆయన కూడా దళిత గోవిందం గురించి చక్కని వ్యాఖ్య చేశారు.ఆయన బ్లాగు మిత్రులను కుటుంబ సభ్యులుగా భావించుకొని తన వ్యక్తిగత విషయాలను కూడా బ్లాగు మిత్రులతో పంచుకుంటుంటారు.ఆయనో నవనీత హృదయుడనిపిస్తుంది. ఇంక, ప్రసాద్ గారు ఇంచుమించు ఆలోచించే బ్లాగు మిత్రులను అందరినీ చర్చలో పాల్గొనేటట్లు చేయగలుగుతుంటారు. సామాజికి వాస్తవితకు ప్రాధాన్యతనిస్తుంటారు. ఇలా .. చాలా మంది కులం గురించి చర్చించుకుంటున్నా, అవి ఎక్కడా వ్యక్తి గత నిందారోపణలకు తావివ్వకుండా కొనసాగడం మంచి వాతావరణాన్నే సూచిస్తుంది.
ఇంతకీ ఇదంతా ఎందుకంటే , మనం కులం , మతం గురించి చర్చించుకోవడం అవి మన అంతర్గత సమస్యలు. దేశభక్తి ఉందా లేదా అనేదానికంటే మన జాతియగీతాన్ని విదేశీ్యుల ముందు పాడవలసిన అవసరం ఏం ఉందని ఒక సామాన్య పౌరుడు అంటే తెలియక అన్నాడనుకోవచ్చు. కానీ..ఒక మేధావి అలా అన్నారంటే దాని ప్రభావం చాలా ఉంటుంది కదా! ఈ విషయంలో చాలా మంది స్పందించాలనుకున్నా, వారి ఉద్యోగాలు, వారి జీవితాలు ఆయనకు సంబందించిన కంపెనీలతో ముడి పడి ఉన్నాయి. ఏ మంటే ఏసమస్య చుట్టుకుంటుందో అనుకొని కామెంట్ చేయడానికే భయపడే వాళ్ళెంతోమంది ఉన్నారు. మనకి ఆర్టికల్ 19 భావ స్వాతంత్ర్యపు హక్కుని చ్చినా దాన్ని మనం వినియోగించుకోలేని స్థితి లోనే ఉన్నాం. దానికి అనేక కారణాలు.

Anonymous said...


This is great job!

Thanks for sharing this post.


Oracle Apps online Training

MS Dynamics AX online Training