"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

01 April, 2007

అపూర్వ పంచ సహస్రావధానం

(ఇటీవల జరిగిన డా. మేడ సాని మోహన్‌ గారి "అపూర్వ పంచ సహస్రావధానం" ఎలా ఉందని ఓ విదేశీ మిత్రుడడిగాడు.
పత్రికల్లో వాస్తవాలు వచ్చి నట్లు నాకనిపించలేదన్నాడు.
అయినా అదో " చారిత్రక నమోదు " కదా దాని గురించి రాయడం కూడా చాలా అవసరమే అనిపించింది.)
మిత్రమా !
ఏమని చెప్పను...
"ఆ అవధానం ..". అబ్బో గొప్పగా ఉందిలే ... !!
వర్ణనాతీతమనుకో....
అదే వేదిక పై అంతకు ముందు మాడుగుల నాగ ఫణి శర్మ గారు చాలా సంవత్స రాల క్రితం సహస్రావధానం చేశారు. అప్పుడు ఆయన అవధానానికో గ్లామర్‌ తీసుకొచ్చారు. ఆ అవధానిని ఒకరకంగా చెప్పాలంటే చాలా మంది "పూజించేవాళ్ళు"! అవధానం కంటే "అదే" గొప్ప ఆకర్శణీయంఅయ్యిందన్నా పొరపాటు కాదనిపిస్తుంది. కానీ, ఈ సారి జరిగిన అవధానం లో ఆ ఆర్భాటం లేదు. ఆ నిలువెత్తు దండలూ లేవు. అన్ని స్తోత్రాలూ లేవు. అవధానిగారు మేడ'సాని ' వారు, " శర్మ" గారు కాదు కదా! సహజంగా నే ఆ ఆర్భాటాలు వీళ్ళకు అంత రుచించవేమో... ఏమో... ఆ భావజాలాన్ని జీర్ణించుకున్న... దాన్నే ప్రచారం చేస్తున్న వాళ్ళని అంతసులువుగా అర్థం చేసుకోలేం సుమా....! మొత్తమ్మీద నిజమైన అవధానానికే ఎక్కవ సమయాన్ని కేటాయించడం సంతోషం!
అవధానంలో ఆ పద్య విద్య గొప్పతనాన్ని, అవధాని ప్రఙ్ఞా పాటవాలు వెల్లడయ్యే లా ఉండాలి. కానీ .. సమన్వయం చేసే మహాపండితులు భాషనే పట్టుకొని వేలాడే వారు. అన్యభాషా ప్రయోగాలు తెలుగు భాష ను నాశనం చేస్తున్నాయని ఆ మహాపండిత సమన్వయకర్తలు తెగ ఇదై పోయారనుకో. అప్పుడప్పుడూ వచ్చి డా. రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు డా. మేడ సాని మోహన్‌ గారు చెప్పిన పద్యాల్లో చమత్కారాన్నీ, ప్రయోగ ఔచిత్యాన్ని చక్కగా వివరించేవారు. అవధానం పేరుతో అవధానిగారి "అవధాన కళ"ను ఆ మహాపండిత సమన్వయకర్తలు సర్వ నాశనం చేశార్నకోవచ్చు . వ్యాకరణం, భాషలంటూ వాటిని మాత్రమే కేంద్రం చేసుకొని వారి సమన్వయం కొనసాగింది.
విశిష్ట అతిధి రూపంలో వచ్చిన వాళ్ళు 90% మంది సమైక్య ఆంధ్ర గురించీ, ప్రామాణక భాష గురించీ ఏమేమి వివరణాత్మకమయిన "ఉపన్యాస ప్రశ్నలు " ప్రహించాయోకదా .. భాష పేరుతో మళ్ళీ ఆ వేదికను వాళ్ళు " పావనం" చేశారనుకో...
ఇక ,అవధాని గారి విషయం చూస్తే పద్యాలు చెప్పుకుపోవటమే తప్ప, వాటిని ఎంతమంది అర్థంచేసుకుంటున్నారో లేదో కూడా కనీసం ఆలోచించలేదు. అవి మరోసారైనా చెప్పేవారు కాదు. " ఇప్పటికి ఇన్ని పద్యాలు అయ్యాయి" అనే లెక్కలే తప్ప ఒక్క పద్యమైనా సాహితీ వేత్తలు ఆస్వాదిస్తున్నారా? లేదా? తాను చెప్పిన పద్యాన్నికనీసం పండితులైనా అర్థం చే్సుకుంటున్నారా?లేదా? అనే ఆలోచనతోకూడా అవధానం కొనసాగలేదు.
పృచ్చకుల గురించీ ఒక మాట చెప్పుకోవాలి.
అవధానంలో పాల్గొన్న చాలా మందికి ఆ అవధానిగారేమి చెపుతున్నారో కూడా తెలియదు. పాల్గొంటే నిర్వాహకులు సన్మానం చేస్తున్నారు. అదే తమకు చాలనుకునట్లే కనిపించింది. చాలా మంది పృచ్చకుల ఉచ్చారణను వేదికమీదే "మహాపండిత సమన్వయకర్తలు" సరిదిద్దేవార. ఎలాంటివారు ఆ అపూర్వ సహస్రావధానాన్నివిజయవంతం చే్శారో తెలుస్తుందనుకుంటున్నాను. ఆ మాత్రం ఊహించుకోగలవనీ అనుకుంటున్నాను.
ఇదిలా ఉంటే, మళ్ళీ తిరుపతిలో " అఫుర్వ దశసహస్రావధానం " చేయించేయడానికి సన్నాహాలు చేస్తున్నారట! దాన్ని ఆవేదిక మీదే చాలామంది ప్రకటించేయడం, దానికి ఆహో ..ఓహో లు కొట్టేయడం చాలా చిరాకనిపించింది. సాహిత్యానికెందుకు విలువ ఎందుకు ఉండటంలేదూ అనే ప్రశ్న వేసుకోవాలనిపించింది.
ఇలా జరిగిన ఈ "పంచ సహస్రావధానాన్ని" రాబోయే తరాలకు సాహిత్య చరిత్రలో గొప్పగా వివరించి చెప్పాలా? చెప్పకతప్పదా? అవధానాలన్నీ ఇలాగే జరుగుతున్నాయా? ఎన్నో ప్రశ్నలు ... సమాధానం ?
నిజానికి పద్యం గురించి తెలిసిన పండిత కవులు పాల్గొని ఆ అవధానాన్ని జయప్రదం చేయగలిగితే అప్పుడు కదా అవధానం లో ఉండే గొప్పతనం వెల్లడయ్యేదనిపించింది. ఇలాంటి అవధానాలను ఆసరా చేసుకొని "సమకాలీన తెలుగు సాహిత్యము నందు అవధానప్రక్రియ పూర్వవైభవమును సంతరించుకొనుచున్నది .ఇది యెంతయో ముదావాహముకదా" అని ప్రతిపాదించే వాళ్ళనేమనాలి? సాహిత్య చరిత్రను వక్రీకరించడం కాదా? అనిపించింది. భాష పేరుతో వెనుకబడిన ప్రజల, ప్రాంతాల మనోభిప్రాయాలను కించపరచడం ఆధిపత్య వర్గాలకు ఉన్నదే కదా...అనీ అనిపించింది.
ఇవన్నీ నా కళ్ళతో చూసినవీ, నాకు అనిపించనవీ మాత్రమే.
మిగతా మిత్రుల నుండి కూడా అవధానానికి సంబంధించిన నివేదికలను రప్పించుకో.
అన్నీ చదువు
కానీ మిత్రమా ...అన్నీ నమ్మకు. అన్నీ అసత్యాలనీ వదిలేయకు.
నీదైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకో.
ఉంటాను
మళ్ళీ కలుద్దాం
మీ
దార్ల

1 comment:

చదువరి said...

నాగఫణిశర్మ గారు అవధానం చేసినపుడు దాన్ని టీవీలో చూసేవాణ్ణి. మీరు చెప్పినట్లు అప్పుడు కూడా కొందరు పృచ్ఛకులు అలాంటివాళ్ళే తగిలారండి. కొందరికి ఉచ్చారణ దోషాలు లేకుండా తెలుగు మాట్లాడ్డమే వచ్చేది కాదు. అవధానంలో పాల్గొనేవారికి సాహిత్యంలో ప్రవేశం ఉండి తీరాలని నా అభిప్రాయం కూడా.