25 అక్టోబర్, 2006
కాసుల ప్రతాప రెడ్డి గార్కి శుభా కాంక్షలు!
ప్రముఖ కథారచయిత కాసుల ప్రతాప రెడ్డి గారికి మానేరు రచయితల సంఘం(కరీంనగర్)వారు ఈ ఏడాది(2006) సురమౌళి స్మారక కథా పురస్కారాన్ని ప్రకటించారు.ఆయన రాసిన "ఎల్లమ్మ ఇతరకథలు" కథా సంపుటికి గాను ఈ పురస్కారాన్ని ఎంపిక చేశారు. ఈకథా సంపుటిలో ఒక సామాజిక ఉద్యమ కార్యకర్తగా, ఉత్తమ సాహితీ వేత్తగా రచయిత కనిపిస్తారు.ఇంతకుముందు శిలువకు తొడిగిన మొగ్గ అనే కథా సంపుటిని ప్రచురించారు.అలాగే గుక్క పేరుతో ఒక కవితా సంపుటిని కూడా ప్రచురించారు.వీరికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను! వీరి "వెంటాడే అవమానం" కథను గురించి నేను కేంద్ర సాహిత్య అకాడమీ,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా నిర్వహించిన తెలుగు - మలయాళీ కథల జాతీయ సదస్సులో మాట్లాడను. వీరు రాసిన గుక్క కవితా సంపుటి పై నేను రాసిన వ్యాసం కింది లింక్ లోhttp://thatstelugu.oneindia.in/sahiti/kitabu/gukka.html చదువుకోవచ్చు.అలాగే వీరు రాసిన ఎల్లమ్మ కథ ను కూడా ఆసక్తి ఉన్నవాళ్ళు http.//thatstelugu.oneindia.in/sahiti లో చదువుకోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి