"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

25 నవంబర్, 2006

BEST WISHES TO Prof.Sudhakar Marathe !

చిత్రంలో ఆచార్య సుధాకర్ మరాఠే గారిని,తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య పరిమి రామనరసిం హం గారు అభినందిస్తున్నారు






ప్రొఫెసర్ సుధాకర్ మరాఠే గారు ఈ నెల(నవంబర్) 30న డీన్ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ , హైదరాబాదు విశ్వవిద్యాలయం గా పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

ప్రొఫెసర్ సుధాకర్ మరాఠే గారు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ప్రస్తుతం విద్యార్ధులు మిగతావారంతా హ్యుమానిటీస్ ఎదురుగా కార్లు, బైకులు ఒక క్రమంలో పెడుతున్నారంటే వారు చూపిన శ్రద్ధ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
ఇక, అధ్యాపకుల పుట్టిన రోజులకు, వివిధ పధోన్నతులకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు పంపించేవారు. వారితో వ్యక్తి గతంగా కలిసినప్పుడు చేయవలసిన, జరగవలసిన పరిశోధన గురించి కొత్త కొత్త ఆలోచనలను రేకెత్తించేవారు. మాతృ భాషకు విలువనివ్వాలనే వారు. మాతృభాషల్లోని కవితలను కొన్నింటిని ఆంగ్లంలోకి అనువదించే పనిచేశారు.వారు పదవీ విరమణ పొందినా,వారి సలహాలు విద్యార్థులకు, అధ్యాపకులకు, యూనివర్సిటికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ప్రొఫెసర్ సుధాకర్ మరాఠే గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
- డా.దార్ల వెంకటేశ్వర రావు

1 కామెంట్‌:

SRAJJARAPU చెప్పారు...

Wonderful