"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

13 అక్టోబర్, 2026

విల్సన్ రావుగారి 'జాషువా పద్య శిల్పం' గ్రంథావిష్కరణ

 సాహిత్య జీవితాన్ని వొడిసి పట్టిన

 'జాషువా పద్య శిల్పం'



 మహాకవి గుర్రం జాషువా సాహిత్య జీవితాన్ని వొడిసి పట్టిన రచనగా కొమ్మవరపు విల్సన్ రావు రాసిన  'జాషువా పద్య శిల్పం' తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోతుందని ప్రముఖ సాహితీవేత్త సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం (11.10.2026) కర్నూల్ లోని టీజీవి కళాక్షేత్రంలో  సాహితీ స్రవంతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ సభాధ్యక్షతన పుస్తకావిష్కరణ సభ జరిగింది. పుస్తకావిష్కరణ అనంతరం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటివరకు వచ్చిన జాషువాపై రచనల్లో వైవిధ్యమైన రచనగా ఇది నిలిచిపోతుందని అన్నారు. ఈ పుస్తకంలో ఇంతకుముందు పరిశోధకులు, విమర్శకులు లోతుగా పట్టించుకోని అనేకాంశాలను విల్సన్ రావు కొమ్మవరపు పట్టించుకోని విషయాలను బయటపెట్టారని అన్నారు.  సాహిత్య విమర్శలో  పునర్ మూల్యాంకన విధానంలో జాషువా సాహిత్యాన్ని పునర్ మూల్యాంకన చేసిన గ్రంథం గా ఆయన పేర్కొన్నారు. దేవాలయాల ప్రవేశం కోసం దేశంలో మొట్టమొదటిసారిగా కేరళలోని తిరువాన్కూర్ మహా దేవాలయంలో జరిగిన వైకం సత్యాగ్రహం ప్రభావంతో జాషువా తన గబ్బిలం కావ్యం రాశారనే విషయం ఈ పుస్తకంలో అత్యంత ముఖ్యమైన అంశమని దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.   ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శాంతి నారాయణ మాట్లాడుతూ జాషువా పద్యంలోని శిల్పాన్ని వస్తువుని, ఈ రచన సమగ్రంగా చర్చించిందని అన్నారు. అసమానతల సమాజంలో నుంచి జాషువా కలం దిక్కారస్వరమైందని  ఈ ధిక్కార స్వరాన్ని  రచయిత మరింత పదునుగా చూపించాడని  అన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ కథకుడు అడవాల శేషగిరి రాయుడు మాట్లాడుతూ ఆనాటి సామాజిక అంతరాలు జాషువా కలం ఎలా ఎలుగెత్తి సాగిందో ఆ కలం ప్రయాణాన్ని రచయిత అద్భుతంగా మలిచాడని అన్నారు. పుస్తకాన్ని పరిచయం చేసిన రాయలసీమ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గంధం అరుణ  మాట్లాడుతూ రచనలో ఎనిమిది వ్యాసాలలోను రచయిత జాషువాను పరిచయం చేయడమే కాకుండా ఆయన సాహిత్యాన్ని మూల్యాంకనం చేసినట్లు ఉందని అన్నారు. వనపర్తికి చెందిన ప్రముఖ కవి జనజ్వాల మాట్లాడుతూ జాషువా కవిత్వం నిప్పుకణికలా మండిందని, అది అగ్రవర్ణ భావజాలాన్ని సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసిందని అన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ సాహితీ స్రవంతి కర్నూలుగా ఇది మూడవ రచనగా తీసుకువచ్చామని, జాషువా సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో  నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. గాడి చర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర కల్కూర  మాట్లాడుతూ జాషువా జీవితం సాహిత్యం సంక్లిష్టమైనదని ఎంతో ప్రాసంగికత కలిగినదని అన్నారు. ఈ సమావేశంలో రచయితలు డాక్టర్ నాగేశ్వరాచారి, మారుతి పౌరోహితం, బిజివేముల రమణారెడ్డి, తెలుగు వెంకటేష్,సయ్యద్ జహీర్ అహ్మద్, జనతా ఫౌండేషన్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా, అవిజ వెంకటేశ్వర రెడ్డి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. సభను సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్ ప్రారంభించగా నగర అధ్యక్షులు ఆగిపోగు నాగరాజు వందన సమర్పణతో ముగించారు.

ప్రభంజనం దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 
నినాదం దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 

గగన్ సమాచార్ దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 
ఆంధ్రజ్యోతి. దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 
ఈనాడు దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 
ప్రజాశక్తి దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 
సృజన క్రాంతి దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 
జన ప్రతి ధ్వని దినపత్రిక 12.10.2026 సౌజన్యంతో 


మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

కామెంట్‌లు లేవు: