అవసరం
అవసరం తీరిపోవడమో
అవసరం లేకపోవడమో
నిర్లక్ష్యం
నిలువెల్లా ప్రవహిస్తుంది.
నిన్న
నీ ఉనికి అవసరం
నువ్వొక బంగారు కొండ!
ఈరోజు
నువ్వు లేకపోవడమే సౌకర్యం
నువ్వొక నిర్లక్ష్యపు కుండ!
— దార్ల వెంకటేశ్వరరావు
2.9.2026
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి