ఇప్పుడు ఎవర్నేమనగలను…!
సంతోషమైనా
దుఃఖమైనా నేనే కదా అనుభవించాను.
ఇప్పుడు
ఆరోగ్యంనెపంతో
నా దుఃఖాన్ని ఇతరులపై తోసేయగలనా?
నెమ్మదిగా కూలిపోతున్న
ఈ శరీరాన్ని చూసి
వాళ్ల చిరునవ్వులనుచెదరగొట్టగలనా?
నా నొప్పికి
వాళ్ల మనసులను శిక్షించగలనా?
నా మౌనం
నాకే భారమైతే,
దాన్నిఇతరుల భుజాలపైమోపగలనా?
నా బాధ
నా గుండెలోనేఅలలెత్తాలి.
నా కన్నీరునా కళ్లలోనే ఆవిరైపోవాలి.
నా వేదన
మరో హృదయానికి
బరువుగా మారకూడదు.
ఈ ప్రయాణం
చివరి వరకూ నాదే కదా
ఆ బాధలన్నీ
నేనే చివరిదాకా మోసుకొంటూపోవాలి!
దార్ల వెంకటేశ్వరరావు 2.7.2026

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి